A Short Poetry Of A Guy Describing How Unique His Lover Is & How She's Incomparable

Updated on
A Short Poetry Of A Guy Describing How Unique His Lover Is & How She's Incomparable

Contributed by MV Ramana

నువ్వు నన్ను దేనితో పోల్చి చూడగలవన్న ప్రేయసి ప్రశ్నకు ప్రేమికుడి బదులే ఈ అక్షర ఆకారాలు.. పంచభూతాలని పిలిచి చూశా నీకోసం పోటీగా !! నీ నీలి కన్నుల్లోంచే పుట్టానని ఆ ఆకాశం, అవి కురిపించిన బాష్పపు ధారలే తనకు ఆధారమని వర్షము, నీవు విడిచిన శ్వాసే వాయువుగా నీ చూపులే నిప్పుల జ్వాలలై నీవు పరిచిన నీ నార చీరెతో నేలగా మారిన మాకు తనతో పోటీ ఏంటని నన్నే ప్రశ్నించాయి.. ముల్లోకాలు గాలించి చూశా నీతో పోల్చదగినవాళ్లు ఎవరయినా ఉంటారేమో అని !! నీ నీడే చీకటిగా, నీ ప్రతిబింబం పగలుగా నీవు నడిచిన అడుగులే ప్రపంచ వింతలై, ఆ నీ అడుగుల మధ్య అంతరమే సప్తసముద్రాలుగా, నీ పాదపు ధూళి రేణువులతో దేవాలయాలు వెలసి, నీ స్పర్శతో జీవం పొందాలని ఇలలో రాతిగా ఉన్న మాకు తనతో పొటీ ఏంటని ఆ దేవుళ్ళే మొరపెట్టుకున్నాయి.... అలాగే.. ఆ నింగి తారలు కూడా ఏనాటికయినా నీ సిగలో సింగారించుకుంటావేమో అని పూవులుగా పుట్టామని, నీ మేనిఛాయలే ఆ హరివిల్లుగా, నీకు రూపమివ్వాలని నరులు చేసిన విఫలప్రయత్నమే తనని తాజ్ మహల్ బాధపడుతుంటే... పోనీలే అని దేవతల దగ్గరికి వెళ్ళా, నీతో పోల్చి చూద్దామని..!! నీవు గడిపిన వేల క్షణాల్లోంచి ఒక్క ఆనందపు క్షణం అప్పు అడిగి స్వర్గంగా మార్చుకున్నానని ఇంద్రుడు, నీ స్వేదంతో సేకరించిన అమృతం తాగే దేవతలమయ్యామని, నిన్ను మనసులో ఊహించుకొని బ్రహ్మ మమ్మల్ని మలిచాడు కాబట్టే ఈ రూపంలోనైనా ఉన్నామని త్రిలోక సుందరులు భోరుమన్నాయి నీతో పొటీ అనగానే.. ఇవే కాదు, ఈ విశ్వమే నువ్వు అనే వృక్షంలోంచి.. కొమ్మ, రెమ్మలుగా పుట్టిన మాకు తనతో పొటీ ఏంటని జగమంతా నాతో వాదిస్తుంటే నిన్ను దేనితో పోల్చి చూసుకోగలను నా "ప్రణయసఖీ.."