దేవుడా! ఓ మంచి దేవుడా అడక్కుండానే అన్ని ఇచ్చావ్ అమ్మ, నాన్న, మంచి కుటుంబం, స్నేహితులు, అన్ని... ఒక్కటి అడుగుతున్న దయచేసి తీర్చు స్వామి. ఈరోజు ట్రైన్ లో ఒక్క అమ్మాయి నా ఎదురుగా కుర్చొనెలా చూడు ప్లీస్," అని దేవుడి కి మొక్కుకుని రైల్వే స్టేషన్ కి బయలుదేరాను.
నా పేరు శ్రీను, హైదరబాద్ లో మంచి జాబ్ లో సెటిల్ అయ్యాను, తరువాత పెళ్ళే, అందరికి వాళ్ళ లవ్ స్టోరి ఇలా ఉండాలి అని ఓ ఊహ ఉంటుంది, నాకూ ఉంది. ఓ అమ్మాయి ని ట్రైన్ లో కలవాలని, తనకి ప్రపోస్ చేసి పెళ్ళి చేసుకోవాలని.. కాని, ఇన్నాళ్ళు సెటిల్ అవ్వాలని ఆ చాన్స్ తీసుకోలేదు. కాబట్టి దేవుడి కి ఈరోజు నా కల నిజం అవ్వాలని చాలా గట్టిగా మొక్కుకుని ట్రైన్ ఎక్కాను. ఈరోజు దేవుడు నా ప్రార్థన ని ఆలకించాడో లెదో అని అనుకుంటున్న ఈ లోపు... నా ఏదురు గా మా బామ్మ వయస్సు ఉన్న పెద్దావిడ కుర్చున్నారు."దేవుడా!!! అమ్మాయి అంటే అమ్మమ్మ కాదు స్వామి" అని మనస్సులో ఆ దేవుడ్ని భక్తి తో మందలించాను. ఇంతలో ఆమె తన బ్యాగ్ జిప్ వేయడానికి ఇబ్బంది పడటం చూసి సాయం చేసాను, దానికి ఆవిడా "థ్యాంక్స్" అని చేబితే " భలేవారండి మీరు మా అమ్మమ్మ లాంటి వారు, ఎక్కడికి వెళ్తున్నారు?" అని ఆమెతో మాటలు కలిపాను. ఆమె తన మనవడు మనవరాలని చూడటానికి హైదరబాద్ వస్తోంది. కాసేపు తరువాత మేము కూడ అమ్మమ్మ మనవళ్ళం అయిపోయాం, చాలా కబుర్లు చేప్పుకుని నిద్రపోయాం" పొద్దున హైదరబాద్ లో తనకి టాటా చెప్పి నేను ఇంకా నా రూం కి అట్నుంచి నా ఆఫీస్ అలా నా డైలీ రొటీన్ లోకి వెళ్ళిపోయా.
మళ్ళి నెల తరువతా పండుగకి ఊరెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతూ " దేవుడా ఈసారి అమ్మమ్మ కాదు 28 ఏళ్ళ లోపు అమ్మాయి నా ఎదురు గా కుర్చోనేలా చేసి నా ప్రేమ కథని మొదలుపెట్టు సామి ఎన్నాళ్ళు "god is busy in writing my love story" అని స్టేటస్ పెట్టుకోవాలి" అని మొక్కుకున్న కాని ఈసారి కూడా హ్యాండ్ ఇచ్చాడు. నా ఎదురుగా ఎంతో క్యూట్ గా ఉన్న 4 ఏళ్ళ బాబు వాళ్ళ అమ్మ కుర్చున్నారు. "ఏంటి సామి ఇది" అని దేవుడ్ని దీనంగా ఓ చూపు చూస్తుండగా ఇంతలో ఆ క్యూట్ బాబు వాళ్ళ అమ్మ ని బ్యాగ్ సర్దనివ్వకుండా అల్లరి మొదలెట్టాడు. ఇక నేను ఇన్వాల్వ్ అయ్యి "నేను చుసుకుంటా లేండీ అక్క" అని తనని నా దగ్గరికి తీసుకుని తనతో ఎవో ఆటలు ఆడుతూ ఏవో కార్టున్స్ చూపించి తనని డైవెర్ట్ చేశాను ఇంతలో ట్రైన్ కదిలింది.. కాసేపు తరువాత సెటిల్ అయ్యాక నా గురించి అడిగి తను వాళ్ళ మావయ్య అత్తయ్య ల దగ్గరికి వెళ్తున్నా అని తన గురించి చెప్పారు. నన్ను పిలవాల్సి వచ్చినప్పుడల్ల "తమ్ముడు" అని పిలిచేది. అలా అమ్మాయి అయితే దొరకలేదు కాని అక్క దొరికింది..
ఊరిలో పండగ అయినా తరువాత హైదరాబాద్ ట్రైన్ ఎక్కా ఈసారి ఇంకొంచెం శ్రద్ధ తో "స్వామి ప్లీస్ నా ముందు 25 ఏళ్ళ లోపు పెళ్ళి కాని అమ్మాయి ని కుర్చోపెట్టి నన్ను ఓ ఇంటి వాడ్ని చేయ్యి సామి నీకు పుణ్యముంటుంది" అని నా లో ని ఆక్రోశాన్ని, ఆవేశాన్ని, ఆవేదనని ఆయన ముందు వెల్లబుచ్చాను. కాని...