Contributed By RJ Avinash
మన మాట చాలా గొప్పది దానికి ఒక ధైర్యం పది మందికి చేరడానికి ఒక స్థానం ఇచ్చిన సోషల్ మీడియా ఎందుకో ఒక ఈరోజు నచ్చింది
కేవలం ఒక్క రోజులో ఇది నా తప్పు అని ఆ వ్యక్తి చెప్పేలా చేసింది అంటే ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే
కాకపోతే ఇలా మాట్లాడే నోరున్నా ఆ ధైర్యం కేవలం మనం log ఔట్ చేసేదాక మాత్రమేనా అని చిన్న doubt వచ్చింది !!
కాదు అంటారా ..అయితే
25 ఏళ్ళు వచ్చి ఇష్టం లేకపోయినా మన అక్కకో, చెల్లికో స్టేటస్ పేరుతోే,మనోళ్లు అనే పేరుతో.. పెళ్లి అని luggage వేసేటప్పుడు కూడా మాట్లాడాలిగా మనతో పాటు ఉన్న ఫ్రెండ్ ఒక అమ్మాయి ఎవరైనా అబ్బాయితో కనపడినప్పుడు తప్పుగా మాట్లాడితే వాడి చెంప పగలగొట్టాలిగా
ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒక తాగుబోతు పెళ్ళాన్ని కొడుతూ కనిపిస్తే మన తలలు ఎందుకు తిరిగిపోతాయి మన నోళ్లు ఎందుకు ముసుకుపోతాయి ??
మనకి నచ్చిన అమ్మాయి ఎంత లేట్ అయి వచ్చినా అంతా చెప్తుంటే మనకి నమ్మకం పెరగలిగా ..అనుమానం ఎందుకు పెరుగుతోంది ??
హమ్మయ్య !..మనల్ని కూడా ఇలా పది మంది ఆడుకునే ఛాన్స్ రాలేదు కాబట్టి సరిపోయింది గాని లేకపోతేనా !!