కూతుళ్లే కాదు.. కొడుకులు కూడా ఇల్లొదిలి వెళ్తారు.. కూతురు పెళ్ళైతే.. కొడుకు పెళ్లికి ముందే.. తనవారి కోసం.. ఇంటికోసం.. ఎప్పుడైనా ఆలోచించారా..?? తలగడ లేకపోతే పడుకోడానికి ససేమిరా అనేవాడు.. ఇప్పుడు కటిక నేల పైనా కిక్కురుమనకుండా పడుకుంటున్నాడు. తినడానికి వంద సాకులు చెపుతూ ఏడిపించేవాడు.. ఇప్పుడు ఏది దొరికితే అదే తింటున్నాడు. తన గదిలోకి ఎవరికి రానివ్వని, తన వస్తువులను ముట్టుకోనివ్వని వాడు.. ఇప్పుడు ఒకే గదిలో అందరితో ఉంటూ షేర్ చేసుకుంటూ అడ్జస్ట్ అవుతున్నాడు. ఇల్లు, తనవాళ్ళని ఎంతో మిస్ చేస్తూకూడా.. "అబ్బే నే బాగానే ఉన్నా!" అంటూ తన ఫీలింగ్స్ ను దాస్తున్నాడు. వందల కలలుకన్నవాడు.. వర్తమానం లో జీవిస్తూ ఏదైనా సరే ఫర్వాలేదు అనుకుంటున్నాడు. కెరీర్ కోసమో, జాబ్ కోసమో కాగితంలా తయారయ్యాడు. ఎర్రటి ఎండలో నడుస్తూ అనుకుంటున్నాడు.. నేను కాలితేనే కదా ఇంట్లో దీపం వెలిగేది.. అని. వర్షంలో తడుస్తూ తిరుగుతున్నాడు.. కొద్దిగా.. ఇంకొద్దిగా కష్టపడైనా సరే సంపాదించాలి.. కన్నవాళ్ళని చూసుకోవాలి అనుకుంటూ. కూతుళ్ళే కాదు సార్.. కొడుకులూ ఇల్లొదిలి వెళ్తున్నారు.. తన వాళ్ళ కోసం..!!
By Gangadhar Chatiri