నేను భారతీయుడిని అదే నా ఐడెంటిటీ ఉత్తర దక్షిణాలు దిక్కులు మాత్రమే వాటిని సాకుగా చూపి నా దేశాన్ని దేశ ప్రజలని ముక్కలు చెయ్యొద్దు రంగులో రూపులో చూపులో మాటలో నడిచే బాటలో రుచులలో అభిరుచుల్లో భాషలో యాసలో భేదాలెన్నో ఉంటాయి కానీ మాకే విభేదాలు లేవు పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఇలా పేర్లు మాత్రమే వేరు మా వేర్లు(Roots) ఎప్పుడూ ఒకటే. భాషలు వేరైనా భావాలు ఎప్పటికీ ఒకటే పాలన కోసమే రాష్ట్రాలు ,సరిహద్దులు. మనుషుల్లో మనసుల్లో ఏ హద్దులు లేవు హక్కుల కోసం పోరాడతాం ఉద్యమాలు చేస్తాం నదుల్లో నిధుల్లో మా వాటా కోసం మాలో మేము గొడవలు పడతాం మాలో మాకు గొడవలు పెడితే మాత్రం ఆ బుద్దిని సవరిస్తాం ఆ పిచ్చిని సరిచేస్తాం పోటీపడతాం వృద్ధిలో అభివృద్ధిలో. చేయి అందిస్తాం, చేతనైంది చేస్తాం కరువులో కష్టం లో తేడాలుండొచ్చు తగువులుండొచ్చుగాక మేమంతా ఒక్కటే కోటి గొంతుకలు ఒక్కటై వందేమాతరమని నినదిస్తాం. రంగులు వేరంటూ రాజకీయం చేస్తే నిలదీస్తాం దేశం కోసం చీమల దండై కదిలోస్తాం… మమ్మల్ని కదిలిస్తే తేనెటీగలై కరిచేస్తాం దేశ సమగ్రతకే అగ్రతాంబూలం నా దేశ సమైక్యతకి అదే మూలం నా దేశం జగతికి ఇచ్చిన సందేశం భిన్నత్వంలో ఏకత్వం భారతీయుడ్ని అదే నా పేరు మువ్వన్నెల జెండా నా పొగరు
I take pride in calling myself an INDIAN. JUST INDIAN. Don’t differentiate us by calling North or South. Let us come out of racist tendencies be it caste, languages, color, region, language. Let’s make diversity our strength not weakness! JAI HIND!