మా భీమవరం మాకు కన్న తల్లి లాంటిది. ఓ తల్లి తన పిల్లలందరిని సమానంగా చూసినట్టుగా మా భీమవరం మమ్మల్నందరిని సమానంగా ప్రేమిస్తుంది.. కన్న తల్లి నవమాసాలు మోస్తే మా భీమవరం వంద సంవత్సరాలు మోస్తుంది. తల్లి వాత్సల్యంతో తన ప్రేమ కలగలిసిన పాలతో పెంచి పెద్ద చేస్తే మా భీమవరం గోదారమ్మ నీటిని అందించింది. అమ్మ నీతి కథలతో ప్రయోజికులను చేయడానికి ప్రయత్నిస్తే మా భీమవరం ఇక్కడి ప్రతి ఒక్క మనిషి ద్వారా మమ్మల్ని ప్రయోజికులుగా ఎదిగేలా చేస్తుంది. అవును మా భీమవరం మాతో మాట్లాడుతుంది, ప్రేమిస్తుంది, లాలిస్తుంది, మమ్మల్ని ఆర్ధికంగా నిలదొక్కుకునేలా సహాయం చేస్తుంది, అలసిపోతే తన చల్లని ఒడిలో సేదతీర్చుతుంది. ఇది మా సంస్కృతి, ఇది మా బంగారు భీమవరం ..Checkout this beautiful video "Happy Bhimavaram" by the students of SRKR Engineering College. Be prepared to fall in love with the city!