"Chase Your Dreams But Make Sure You Don't Find Shortcuts Path Must Be Difficult But Don't Give Up" ఈ మాటలు చిన్నతనంలో రమేష్ టెండుల్కర్ తన కొడుకు సచిన్ టెండుల్కర్ తో చెప్పిన మాటలు.. బహుశా ఆ మాటలే తన కొడుకుని "భారత రత్న" ను చేస్తాయని ఆ తండ్రి కూడా ఊహించలేదు కాబోలు.. "సచిన్ టెండుల్కర్"... క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరకి సచిన్ తెలుసు, తెలియడం గొప్పకాదు తెలిసిన ప్రతిఒక్కరి మదిలో సచిన్ ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉండటం గొప్ప సచిన్ ఆ స్తాయిలో ఉంటారు. మనం ఎప్పటినుండో వింటున్న మాట "క్రికెట్ ఒక మతమైతే సచిన్ ఆ మతానికి దేవుడు"అని.. నిజమే క్రికెట్ అనే ఒక మతానికి సచిన్ ఎల్లలు లేని దేవుడు.. సచిన్ కేవలం భారత క్రికెట్ జట్టు తరుపున మాత్రమే ఆడుతున్నా ప్రపంచమంతా అభిమానులున్నారు.. వారు ఏ స్థాయిలో ఉండేవారంటే తమ టీం గెలవాలి కాని బ్యాటింగ్ కు వచ్చిన సచిన్ మాత్రం అవుట్ అవ్వద్దు అని.. ఎందుకంటే సచిన్ క్రికెట్ రికార్ఢులలో ఎంత ఎత్తుగా ఉన్నాడో వ్యక్తిత్వంలో కూడా అంతే మంచి స్థాయిలో ఉన్నాడు. అందుకే సచిన్ అంటే మనవాడు మన ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిగా అనిపిస్తారు..
దాదాపు 24 ఏళ్ళ సుధీర్ఘ కెరీర్ లో ఎన్నో రికార్ఢులను అందుకున్నారు..
వన్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు) వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (96 అర్థ సెంచరీలు) అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (463 వన్డేలు) వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు) వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (15 సార్లు) అతిపిన్న వయస్సులో(16) వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు. రాహుల్ ద్రవిడ్ తో కలిసి అత్యధిక పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు. (331 పరుగులు ) సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పాట్నర్‌షిప్ రికార్డు. (6609) అత్యధిక సార్లు 200 మించి పాట్నర్‌షిప్ పరుగులు. (6 సార్లు) వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు) టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (67అర్థ సెంచరీలు) 20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్. కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు) అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు. అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. (200 టెస్టులు)
మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మ గాంధీని అయినా విమర్శించే వారున్నారేమో కాని సచిన్ కు మాత్రం లేరు సచిన్ వ్యక్తిత్వంలో కొన్ని మరుపురాని గుర్తులు...
• సచిన్ కు నాన్న అంటే ప్రాణం.. కన్న తండ్రి మరణించిన తన ధర్మాని వీడలేదు అంతటి భాదాకర సమయంలో కూడా ఏకంగా సెంచరీ తో తన ఆటను ప్రదర్శించారు.. •మ్యాచ్ ఫిక్సింగ్ లో ఎవ్వరి మీదైన ఆరోపనలు వస్తాయి కాని సచిన్ మీద మాత్రం కాదు కనీసం ఆరోపనలు కూడా చేయలేరు "నిప్పుకు చెదలు పట్టదు" అంతటి మంచి వ్యక్తిత్వం ఆయనది.. • వయసు రాగానే తల్లిదండ్రులను ఒదిలేసే ఈరోజుల్లో తనకు ఈ స్థాయి రాడానికి పునాది వేసిన తన గురువుని ఇప్పటికి కంటికి రెప్పలా తన ఆలనా పాలన చూసుకుంటున్నారు.. • జట్టులోని సభ్యులతో మాత్రమే కాదు వేరే జట్టులోని సభ్యులతో కూడా మంచి స్నేహాంతో మెలిగి వారి అభివృద్ధికి తగిన సూచనలిస్తారు.. •హోరా హోరి మ్యాచ్ లలో ఒక్కోసారి సచిన్ ను కొంతమంది ఆటగాళ్ళు రెచ్చగొట్టినా ఏ ఒక్క సందర్భంలోను తన ప్రశాంత వ్యక్తిత్వాన్ని కొల్పోరు.. • మన ఆంధ్రప్రదేశ్ లోని "పుట్టం రాజు కండ్రిగ" గ్రామాన్ని దత్తత తీసుకొని భారతదేశంలోనే ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దారు.. భారతదేశం లోనే గ్రామ దత్తత కార్యక్రమంలో అందరికి స్పూర్తినిచ్చారు.... • సచిన్ 10 Class English Subject లో ఫేయిల్ అయ్యారు కాని ఇప్పుడు సచిన్ జీవిత చరిత్రనే 10 Class English Subject లో వచ్చేసింది.. •టెండుల్కర్ వ్రాయడంలో ఎడమచేతి వాటం ఉపయోగించిననూ, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో మాత్రం కుడిచేతినే ఉపయోగిస్తారు..
భారతదేశంలో ఉన్న అన్ని అత్యత్తమ పురస్కారాలు భారతరత్న, అర్జున, రాజీవ్ ఖేల్ రత్న,జాతీయ అంతర్జాతీయ యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లు ఇలా ఎన్నో అందుకున్నారు.. టెస్టులు వన్డే మ్యాచ్ లలో కలిపి ఇప్పటికి 664 మ్యాచులలో దాదాపు 35,000 పరుగులు సాధించారు.. సర్ డాన్,బ్రాడ్ మెన్, వివియన్. రిచర్డ్స్, సునీల్ గవాస్కర్ లాంటి అత్యత్తమ ఆటగాళ్ళందరి దృష్టిలో సచిన్ యే గొప్ప ఆటగాడు...