నేను చదువుకునె రోజుల్లో తినడానికి తిండికూడా దొరికేది కాదు ఆకళితో స్నేహం చేశాను.. అప్పుడే అనుకున్నా నేను మన దేశానికి ప్రధాన మంత్రిని కావాలని దేశ పేదరికాన్ని నిర్ములించాలి అని.. ఇది చంద్రబోస్ గారి అప్పటి ఆలోచన సరలి.. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె అనే కుగ్రామం. తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు. తల్లి మదనమ్మ గృహిణి. వారికి మొత్తం నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ చివరివవాడు. చంద్రబోస్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు.. అవకాశాల కోసం ఎదురుచుస్తున్న సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోని శ్రీకాంత్ తొ స్నేహం ద్వారా దర్శకుడు ముప్పలనేని శివతో పరిచయం ఏర్పడింది.. అప్పుడు అతను తీస్తున్న తాజ్ మహల్ సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చింది.. మంచు కొండల్లోని చంద్రమా పాట ద్వారా తన ప్రతిభ ప్రస్థానం మొదలయింది.. ఇప్పటికి తాను ఒక అత్యున్నత పాటల రచయితగా వెలుగొందుతున్నా తన పునాదిని మరిచిపోలేదు, తనలో ఉన్న స్పూర్తిదాయక భావాలు తన పాటలలో ప్రస్పుటంగా కనిపిస్తాయి.. ప్రేమ గీతాలైనా, విరహ గీతాలయినా, స్పూర్తిదాయకమైన ఏ రకమైన పాట రాయలన్నాఅయనకు ఆయనే సాటి. ఎంత సక్కగున్నావే అంటూ ఆడపిల్ల అందాన్ని వినసంపుగా వర్ణించగలడు, ఓరయ్యో అంటూ మన కంటిలో నీళ్లు తెప్పించగలడు. ఆయన కలం నుండి జాలువారిన పాటలలో కొన్ని అధ్భుతాలు .
1. Don't Stop Till You Get Enough(Nannaku Prematho)
2. Who Are You(1-Nenokkadine)
3. ఎలా ఎలా(Panja)
4. గొ గొ అదిగొ లోకం అదిగొ (Sainikudu)
5. నేనున్నానని నీకేం కాదని(Nenunnanu)
6. పెదవె పలికిన మటాల్లొనె(Nani)
7. తెలుగు భాష తియ్యదనం(Neeku nenu naaku nuvvu)
8. నీ నవ్వుల తెల్లదనాన్ని(Adi)
9. చిన్ని ఆశలు నాలో(Manam)
10. Feel My Love(Aarya)
11. బ్రతకాలి(oosaravelli)
12. వెళుతున్నా వెళుతున్నా(Boss)
13. మౌనంగానే ఎదగమని(Naa Autograph)
14. నువ్వంటే ప్రాణమని
15. కొడితె కొట్టాలిరా(Tagore)
16. ఎంత సక్కగున్నవె (Rangasthalam)
17.ఓరయ్యో (Rangasthalam)