Contributed by Masthan Vali K
Happy New Year Friends.!! ఏంటిప్పుడు New Year Wishes అనుకుంటున్నారా! ఓ రెండు నెలలు Advance లెండి. ఏంటి వద్దా...! ఎహె మీరు మీ మొహమాటం, పర్లేదు ఉంచండి.!! వాకె వాకె, విషయం లోకి వచ్చేద్దాం. చిన్నప్పుడు తెలుగు లో ఓ పద్యం చదువుకునుంటారు, " ఆరంభింపరు నీచ మానవులు... " అని. అందులో " ఆరంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్" అని ఉంటుంది. దానర్థం ఏంటంటే ఏదైనా పని చేయదలచి దాన్ని ప్రారంభించి కొన్ని కారణాల వలన మధ్యలోనే ఆపేయడం. మనలో మన మాట, మీలో చాలా మంది ఇదే Category. Facts విని Feel అవ్వకూడదు మరి! దీనికి Best Examples, కొత్త సంవత్సరం రాగానే మీరు తీసుకునే Resolutions!
అబ్బో అబ్బో... పొద్దున్నే నిద్దర్లేవాలి, సెల్ ఫోన్ ని దూరంగా ఉంచాలి, పొట్ట తగ్గించాలి, జిమ్ కి వెళ్ళాలి, స్లిమ్ గా అవ్వాలి, డబ్బు సేవ్ చెయ్యాలి, Friends తో గోవా వెళ్ళాలి, పోరీని / పోరడ్ని పట్టాలి, మాంచి ఉద్యోగం కొట్టాలి, పుస్తకాల పురుగైపోవాలి, మందు మానేయాలి, Passion ను ఫాలో అవ్వాలి... అబ్బో... అబ్బో... చెప్పుకుంటూ పొతే ఈ Resolutions List పూర్తయ్యేసరికి ఇంకో సంవత్సరం వస్తుంది. అవన్నీ నిజంగా ఫాలో అయ్యుంటే... మనకన్నా పొడిచే మొనగాడే లేడమ్మో అని పాడుకునేవాళ్ళు! మరిప్పుడో... సరె సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం… అని Meme మొఖం వేస్కుని చదువుతున్నారు!
అనుకోవడం వరకు అంతా బాగు బాగు... ఆచరణకొచ్చే సరికి సిగ్గు లేకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తుంటారు. చెప్పాను గా Facts విని Feel అవ్వకూడదు అని! ఆరంభ శూరత్వం... అంతలోనే సమాప్తం! పది నెలలు అయిపోయాయి. ఎంత మంది అనుకున్నది అనుకున్నట్టు ఆచరిస్తున్నారు? ఎమన్నా అంటే Hurt అవుతారు... మనోభావాలు అద్దెకు తీసుకొచ్చి మరి దెబ్బ తీసుకుంటారు! ఏందిది... నాకేందిది అంటా!? అరే, కొత్త సంవత్సరం రాగానే మీరు స్వాగతించిన తీరుకు, పరిచయం ఉన్నా లేకున్నా కనిపించిన ప్రతి ఒక్కరిని Wish చేసిన మీ విశాల హృదయానికి, ఈ ఏడాది ఖచ్చితంగా ఏదైనా సాధించాలని మీలో రేగిన ఉత్తేజానికి... ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు ఈ ఏడాదైపోతుందో, కొత్త సంవత్సరం ఎప్పుడుస్తుందో అని నిరాశ తో ఎదురు చూస్తున్న వైనానికి సంబంధం లేదు! దేనికయ్యా ఇంకో కొత్త సంవత్సరం,తగలబెట్టడానికా... ? ఈ ఏడు ఏమంత వెలగబెట్టారని...? చెయ్యాల్సినప్పుడు చెయ్యకుండా అపుడు ఇప్పుడు అని ఆలస్యం చేస్తూ, ఇప్పుడు ఇంకో కొత్త సంవత్సరం అంటా! నేనూ గమనిస్తూనే ఉన్నా... ఈ రోజు కాకపొతే రేపు, రేపు కాకపొతే ఎల్లుండి... మధ్యలో ఆపేసిన దాన్ని మళ్ళీ మొదలుపెడతారేమో అని, అబ్బే, అసలా ఆలోచనే లేదే. అప్పటికి మా వాళ్లు చెప్తూనే ఉన్నారు... “అనుభవం తో అంటున్నాం, మీ మాటలను serious గా తీసుకోకు “ అని.! నేనేమో వాళ్ళ మాటలు లైట్ తీసుకున్నాను!! మీ హడావిడిని, వేడుకలని, సంబరాలను చూసి నా వలన మీ జీవితాల్లో ఏంతో కొంత మేలు జరుగుతుందని ఆనందపడ్డాను. కానీ మీ ఉత్సాహం కొద్దికాలమే అని నెల తిరక్కముందే అర్థమైంది.
నన్ను ఎంతో ఘనంగా ఆహ్వానించిన మీరు ఇప్పుడు ఎందుకు మరిచిపోయారన్నది కాదు నా బాధ, మీకు మీరు చేసుకున్న ప్రమాణాలను... అవే మీ Resolutions ను పట్టించుకోట్లేదన్నదే నా ఆవేదన.! నేను పొతే ఇంకో సంవత్సరం వస్తుంది, అది కాదు కదా కావలసింది! నిజానికి ఈ సంవత్సరం, నెల, వారం ఇవన్నీ మీరు సృష్టించుకున్నవి... ఎందుకన్న విషయం నాకన్నా మీకు బాగా తెలుసు. మరి దాన్ని ఎంతవరకు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు? వారం లో ఐదు రోజులు ఆఫీస్ పని, మిగతా రెండ్రోజులు వీకెండ్ పేరుతో ఖతం! మీరనుకున్న దాంట్లో ఏ 10,15 శాతం చేసుంటారంతే... దానికే పొంగిపోతారు చాలా మంది, ఇక అక్కడితో ఆపేస్తారు. జాగ్రత్తగా వినండి, అదే చదవండి... కొత్త సంవత్సరం, పాత సంవత్సరం లాంటివేం లేవు. మీ లెక్కల కోసం, మీ సౌలభ్యం కోసం మీరు కనిపెట్టుకున్నారు, అంతే! ఉన్నది ఒక్కటే, కాలం! ఆ కాలాన్నే నిమిషాలుగా, గంటలుగా, వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా విభజించారు?! ఎందుకు అంటే కొత్త అంటే అంత మోజు మీకు, 24 గంటల తర్వాత కొత్త రోజు, 7 రోజుల తర్వాత కొత్త వారం, 4 వారాల తర్వాత కొత్త నెల, 12 నెలల తర్వాత కొత్త సంవత్సరం... ఈ కొలమానం వలన, దాని వెనకున్న మీక్కావలసిన కొత్తదనం వలన చేసే పని పట్ల ఒక నిర్దిష్టత ఏర్పడుతుందని... కానీ మీకు తెలిసిన, మీరు మరిచిపోయిన ఒక సీక్రెట్ చెప్పనా, కొత్తదనం అంత ఇష్టమైతే, ప్రతి క్షణం కొత్తదే కదా... రెప్పపాటు లో కొత్త క్షణం, మరి దాన్ని సెలెబ్రేట్ చేసుకోరా…?
సర్లెండి, చెప్పాలంటే ఇలా చాలా ఉన్నాయ్.! నేనిలాగే చూస్తూ ఉంటే పుణ్య కాలం కాస్తా పూర్తవుతుందని తట్టుకోలేక ఓ సారి మీరనుకున్నవి మరిచిపోయారేమో గుర్తు చేద్దామని వచ్చాను. అంతేగాని మిమ్మల్ని వేలెత్తి చూపాలని కాదు! మొత్తానికి నే చెప్పొచ్చేదేంటంటే... నేను పూర్తవ్వడానికి ఇంకా రెండు నెలలున్నాయ్, ఈ లోపు... 1. Just అలా మనసులో అనుకుని వదిలేసిన పనులను ఇప్పుడైనా మొదలుపెట్టండి, Better Late Than Never!! 2. మొదలుపెట్టి వదిలేసిన పనులను పునఃప్రారంభించండి. Restart I Say! 3. ఈ పాటికే ప్రారంభించిన వాటిని విజయవంతంగా కొనసాగించండి / పూర్తి చేయండి. Yes, Let’s Complete it! ఆ రకంగా రాబోయే సంవత్సరానికి ఇప్పటినుండే సిద్ధం అవ్వండి... అప్పుడు కొత్త ఏడాది మొత్తం నల్లేరు పై నడకే, అదే Cakewalk...!! 2 months… 60 Days… and the Countdown starts, Now! Get ready to Kick start 2020!
అన్నట్టు మరిచా, ఎంత సేపు అది చేయలేదు ఇది చేయలేదు అనడమే గానీ, అనుకున్నవనుకున్నట్టు పాటించిన వారి గురించేంటి అంటే, వారే " ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్... " Category. ఎన్ని ఆటంకాలెదురైనా మొదలు పెట్టిన పనిని పూర్తి చేసేంత వరకూ నిద్రపోరు, అలాంటి వారి గురించి చెప్పేదేముంది... వారికి నా తరపున Thanks & Congrats చెబుతూ, మిగతా వారికి All the Best చెబుతూ… దురుసు గా మాట్లాడానని ఫీల్ అవకుండా, నా ఫీలింగేంటో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ…
ఇట్లు కాలం. అదే, ప్రస్తుతానికి మీ 2019!