లాక్ డౌన్ ముగియడానికి ఇంకో 15 రోజులు పట్టేలా ఉంది, దాదాపు 40రోజులకు పైగా ఉంటున్న ఈ లాక్ డౌన్ ప్రపంచంలోనే అత్యధిక రోజులు కొనసాగుతున్న నిర్బంధంగా పరిగణించవచ్చు. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోవడం మూలాన మనలో ఒకరకమైన లేజీ లైఫ్ స్టైల్ అలవాటయ్యే అవకాశం ఉంది. ఫోకస్ గా ఆలోచించకపోవడం, సమయాన్ని ఎలా ఉపయోగించకపోవడం తెలియకపోవడం వల్ల వెబ్ సిరీస్ లు చూస్తూ కళ్ళు, నిద్రను పాడుచేసుకోవడం, ఇప్పుడు పొల్యూషన్ లేకుండా బానే ఉంది కాని ఒకేసారి పొల్యూషన్ పెరిగిపోతే మనం అడ్జస్ట్ అవ్వగలమా.? ఫిజికల్ వర్క్స్ అంతగా లేకపోవడం వల్ల ఫ్యాట్ పెరిగిపోవడం.. ఇలాంటి రకరకాల చెడు అలవాట్లు మనం దీర్ఘకాలం కొనసాగించే ప్రమాదం ఉంది. లాక్ డౌన్ వల్ల చెడు జరగడానికి ఎంత అవకాశం ఉందొ, మంచికి అంతే అవకాశం ఉంది. బుక్స్ చదవడం, ఇంట్లో వంట చెయ్యడం, అమ్మకు హెల్ప్ చెయ్యడం, అలాగే మనం హెల్దీగా ఫిట్ గా ఉండే వర్కౌట్స్ చెయ్యడం..
ఒక్క రూపాయి అవసరం లేదు: శివ స్వరూప్ హైదరాబాద్ కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఒకప్పుడు చాలామందిలానే వర్కౌట్స్, హెల్దీ ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఎప్పుడైతే ఇషా ఫౌండేషన్ లో యోగా, మెడిటేషన్ నేర్చుకోవడం, ఫిజికల్ వర్కౌట్స్ కు సంబంధించి ముంబయ్ లోని ప్రతిష్టాత్మకమైన BFI లో ట్రైన్ అవ్వడం వల్ల శివ జీవితంలో విపరీతమైన మార్పులు సంభవించాయి. తనకు కలిగిన అనుభవాన్ని మిగిలినవారికి కూడా అందజేయాలన్న ఉద్దేశ్యంతో ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరో పక్కన జనాలను మైండ్ పరంగా, బాడీ పరంగా ఫిట్ గా ఉంచుతున్నారు.
ఎవరెస్ట్ ఎక్కినంత కష్టం కాదు: వెయిట్ తగ్గడం, ఫుడ్ విషయంలో కంట్రోల్ గా ఉండడం, ఏమీ ఆలోచించకుండా కాసేపు మెడిటేషన్ చెయ్యడం.. ఇవ్వేమి ఎవరెస్ట్ ఎక్కినంత కష్టమేమీ కాదని శివ అభిప్రాయం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే 'వి కెన్ డూ వండర్స్'. భోజనానికి భోజనానికి ఒక ఆరు గంటలు గ్యాప్ ఉంటే చాలు, ప్రతిరోజు ఆక్సిజన్ పార్క్ లో కాసేపు నడక, చిన్నపాటి వర్కౌట్స్, అక్కడే కాసేపు మెడిటేషన్, అలాగే మన శారీరక శ్రమకు అవసరమయ్యేంత మాత్రమే హెల్దీ ఆహారం తీసుకుంటే పరిపూర్ణంగా జీవితాన్ని ఆస్వాదించవచ్చు.
ఈ లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటూ ఇలాంటి తేలికపాటి వర్కౌట్స్ చెయ్యవచ్చు:
1. Tabata workout
2. Core Workout
3. High Intensity Bodyweight Circuit
4. Slow down core engaging workouts
5. Hiit Legs
6. Core Circuit
7. Total Body Workout
8. Flutter Kicks
9. Total Body Workout with a Chair
10. Upper Body Hiit Workout
11. Core Burner
12.AB's CIRCUIT
13. Home Body Weight HIIT
14. AB Workouts (Without any equipment)
15. Runners Workout