మన తెలుగువారికి పచ్చళ్ళకు ఒక భయంకరమైన అవినాభావ సంబంధం ఉందండి, తెలుగువారికి పచ్చడి బోర్ కొట్టదు. కొత్తరకం పేర్లతో ఎన్నిరకాల వంటలు వచ్చేసినా కాని ఆవకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ, గోంగూర పచ్చడి అని పేరు వింటే చాలు ఆహా.. అనిపిస్తుంటుంది. తెలుగువారి వంటశాలలో పచ్చడి కూడా దాదాపు ప్రతి ఇంట్లో ఉండి తీరుతుంది. డబ్బు సంపాధించాలంటే చదువు అవసరం లేదు టాలెంట్ ఉంటే చాలు అని మనం ఎప్పటి నుండో వింటున్నాం.. టాలెంట్ నుండి డబ్బు సంపాదించడం అనేది యువకులలో మాత్రమే కాదు వంటింట్లో వంట చేసే ఒక గృహిణిలో కూడా ఉంటుందని మనం ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాలో రీసెంట్ గా చూశాం, ఇప్పుడు దాట్ల సౌజన్య గారి ద్వారా మళ్ళి చూస్తున్నాం.
![img_2120](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/img_2120.jpg)
![Prawn-Pickle](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/Prawn-Pickle.jpg)
ఈ భయంకరమైన స్పీడ్ యుగంలో మనకు పచ్చళ్ళు చేయడానికి టైం సరిపోవడంలేదు, ఇంకొంతమందికి టైం ఉన్నాకాని పచ్చళ్ళు తయారుచేయరాకపోవడం ఇలా చాలా రకాలుగా మనోళ్ళు ఇబ్బందులు పడడాన్ని గమనించారు దాట్ల సౌజన్య గారు. చదువుకున్నది ఇంటర్మీడియట్ ఐనా కాని రుచికరమైన పచ్చళ్ళల్లో పి.హెచ్.డి స్థాయి అనుభవం ఉండడంతో 2015లో భర్త సహాయంతో రాజు పికిల్స్.కామ్ అనే వెబ్ సైట్ స్టార్ట్ చేసి ఆన్ లైన్, ఫోన్ ద్వారా బుకింగ్స్(888 625 3456) చేసుకుని హోమ్ డెలివరి అందిస్తున్నారు.
![drr](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/drr_2017-04.jpg)
ఈ రకమైన బిజినెస్ స్టార్ట్ చేయడానికి సౌజన్య గారికి ఒక సంఘటన ప్రేరేపించింది. సౌజన్య గారి స్వగ్రామం భీమవరం, వారి భర్త ఉద్యోగం వల్ల హైదరాబాద్ లో ఉంటున్నారు. ఒకసారి పండుగకు ఊరు వెళ్ళి హైదరాబాద్ కు తిరిగివచ్చేటప్పుడు కొన్ని రకాల పచ్చళ్ళు తీసుకువచ్చారు.. అవి స్నేహితులకు నచ్చడంతో ఈసారి భీమవరం నుండి వచ్చేటప్పుడు మాకు కూడా తీసుకురండి అని చెప్పడంతో కొన్నిసార్లు అలాగే తీసుకువచ్చారు.. ఇలా ప్రతిసారి తీసుకురావడం కంటే మనమే తయారుచేసి అమ్మితే డబ్బు కూడా సంపాదించవచ్చు అని ఈ సంఘటన ప్రేరేపించింది. సౌజన్య గారు హైదరాబాద్ మియాపూర్ లో పచ్చళ్ళు తయారుచేస్తున్నా కాని వీటిలో రుచి అద్భుతంగా ఉండాలని ఇందులో వాడే కారం, మసాలాలు మొదలైనవన్ని భీమవరం నుండి తీసుకువస్తారు. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ మొదలైన అన్ని రకాల పచ్చళ్ళు తయారుచేస్తారు. కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే కాక విదేశాలలో కూడా రాజు పికెల్స్ కి ప్రత్యేక అభిమానులున్నారు.
![chicken-pickle](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/chicken-pickle.jpg)
![4](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/4-8_2017-04.jpg)
![1](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/1-8_2017-04.jpg)