ప్రమదాలు జరిగినప్పుడు ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వం అని తిట్టడమో, లేదంటే మిగిలిన వారిని నిందించడమో చేస్తుంటాం, కాని మన వంతు బాధ్యతగా మనమేం చేస్తున్నాం.? అని అంతరాత్మ సాక్షిగా ఆలోచించలేకపోతున్నాం. 12 సంవత్సరాల రవితేజ ఇప్పుడు యావత్ భారత దేశాన్ని మాటలతో కాకుండా తన చేతలతో మన కర్తవ్యాన్ని భోదించాడు.. సరిగ్గా నిలబడడమే ఇంకా నేర్వని 6 నెలల బాబు బోరు బావిలో పడి చనిపోయిన సంఘటన, ఇంకా హబ్సిగూడ ప్రాంతంలో జరిగిన ఒక ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూడడంతో అతని మనసును తీవ్రంగా కలిచివేసింది..
తన ప్రాంతంలోని గుంతలను పూడ్చడానికి ఈ రెండు సంఘటనలే బలంగా ఉసిగొల్పాయి. రవితేజ గవర్నమెంట్ స్కూల్ లో 6th క్లాస్ చదువుతున్నాడు. తన కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా చిన్న చిన్న రాళ్ళను వేరోచోట సేకరించి హబ్సిగూడ పరిధిలోని గుంతలను పూడ్చే మహాయుద్ధంలో ఏ ఒక్కరి కోసం ఎదురు చూడకుండా ఒంటరి సైనికునిగా పోరాటం చేస్తున్నారు. తమ కుటుంబంలోని వారికి గాని, బంధువులకు గాని, ఆఖరికి తనకు తెలిసినవారికి గాని ప్రమాదం జరగలేదు, సాటి మనిషికి జరిగిన ప్రమాదాన్ని చూసి చలించి గుంతలను పూడుస్తున్నాడంటే రవితేజ నిండైన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు.. రవితేజ చేస్తున్న ఈ సేవను "దేశభక్తి" అని వర్ణించడం కన్నా సాటి మనిషి పై అతనికి ఉన్న "మానవత్వం" అని అర్ధం చేసుకోవచ్చు.
Image Source: Deccan Chronicle