చాలామంది తమ ఆనందం కోసం, వర్క్ నుండి రిలీఫ్ కోసం టూరిస్ట్ ప్లేసస్ కి వెళ్తుంటారు. కాని డాక్టర్ రమ్యశ్రీ తుమ్మల మాత్రం పేదవారికి సేవచేయడం కోసం ఇండియాకు వస్తుంటారు. వారి ఆరోగ్యం బాగుపడినప్పుడు వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు అందులోనే తనకి నిజమైన ఆనందం దొరుకుతుందని రమ్యశ్రీ చెబుతారు. మన హైదరాబాద్ కు చెందిన తుమ్మల రమ్యశ్రీ అమెరికాలో వైద్యవిద్యను పూర్తిచేశారు. ప్రతి సంవత్సరం 15మంది డాక్టర్లతో ఒక బృందంగా ఏర్పడి "మెడికల్ యాత్ర" గా మన ఇండియాకు వచ్చి కొన్ని రోజుల పాటు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.


మనదేశంలో ఎంతోమంది ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఆర్ధిక ఇబ్బందుల మూలంగ పూర్తిగా బాగు చేసుకోకుండానే వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పటి వరకు 10 గ్రామాలలో పర్యటించిన రమ్య, సుమారు 400 మందికి పైగా పేషెంట్స్ వ్యాదులను బాగు చేశారు. చాలామందికి నిజమైన దేశభక్తి మీద అపోహలుంటాయి.. అలాంటి వారు దేశభక్తి అంటే క్రికెట్ లో గెలవడంలోనో మరే ఇతర అనవసర విషయంలోని ఆనందాన్ని దేశభక్తి అనుకుంటారు కాని ఇలాంటి అభాగ్యులను కాపాడి వారి జీవితాలను బాగు చేయడం కూడా నిజమైన దేశభక్తికి నిర్వచనం. అలా రమ్యశ్రీ తుమ్మల తన దేశభక్తిని నిరూపించుకుంటున్నారు..


