Meet The Hyderabadi Girl Who Is A 7-Time World Champion In "Master Of Memory"!

Updated on
Meet The Hyderabadi Girl Who Is A 7-Time World Champion In "Master Of Memory"!

ఇందాక ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు అందరిని అడిగిన ప్రశ్ననే వైష్ణవిని కూడా అడగాలనిపించింది కాని ఆగిపోయా.. ఎందుకడగాలి Bronze Medal గెలిస్తే Gold మెడల్ నా డ్రీమ్ అని చెప్పేవారేమో.. కాని తను ఇప్పటివరకు పాల్గొన్న మెమోరి చాంపియన్ షిప్స్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవల్స్ అన్ని కలిపి ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారో తెలుసా.? 17కి పైగానే.. పాల్గొన్న మొదటి ఏడాది(2010) నుండి ఇప్పటివరకు ఇంటర్నేషనల్ లెవల్ లో వరుసగా 7 సంవత్సరాలు గోల్డ్ మెడల్స్ గెలుచుకుని "Master Of Memory" అనే ప్రపంచపు సింహాసనం మీద మన అమ్మాయి 7 సంవత్సరాలుగా అదే స్థానంలో కొనసాగుతుంది. అంత సాధించిన వైష్ణవిని మీ డ్రీం ఏంటి అని మొదట అడగాలనిపించలేదు.

unnamed (2)
unnamed (1)
10846512_4985974025164_8671644323591446177_n

ఈ గేమ్ ఎలా ఉంటుందంటే.. ప్రతి చాంపియన్ షిప్ లో 10 Events ఉంటాయి.. ఒక్కో ఈవెంట్ లో ఒక్కోరకమైన గేమ్ ఉంటుంది. Ex: ఒక ఈవెంట్ లో నెంబర్స్ ఉంటాయి, ఈ నెంబర్స్ ఎలా ఆర్డర్ లో చెప్పారో/చూపించారో అదే ఆర్డర్ లో చెప్పాల్సి ఉంటుంది. అలా Historic and Future Dates, Names and Faces, Binary Digits, One Hour Numbers, Abstract Images, 15 Minute Numbers, Random Words, 10 Minute Cards, Speed Numbers, Spoken Numbers ఇలా ప్రతి ఈవెంట్ లో ఆడిన గేమ్స్ లో వచ్చిన మార్కులను బట్టి అవార్డ్ స్థాయి ఉంటుంది.

Awards 1
Awards 2
Awards
Awards3

రామాయణంలో శ్రీరాముడు ఒక మాట అన్నాడు "మనసు వజ్రం కన్నా కఠినమైనది, అగ్నికన్నా తీక్షణమైనది. అగ్నిని మింగడం కన్నా, పర్వతాన్ని పెల్లగించడం కన్నా, సముద్రాన్ని ఇంకించడం కన్నా మనసును నిగ్రహించడం అత్యంత కష్టతరం". నిజంగా ఆపకుండా మనం అవసరమైతే రోజుకు 10గంటలు కష్టపడగలం, కాని ఒక గంట ఏ ఆలోచన లేకుండా ఉండాలంటే చాల కష్టంగా ఉంటుంది.. వైష్ణవిగారు అలాంటి మనసును తన చెప్పుచేతల్లో పెట్టుకుని ఎంతో మానసికంగా ధృడంగా ఉంటే తప్ప పాల్గొనలేని ఈ గేమ్ లో ఉన్నతంగా రాణిస్తున్నారు.. తన వయసు కేవలం 22 కాని తాను సాధించిన పతకాలను చూసి తెలుగువారు, భారతీయులు గర్వంగా పొంగిపోతే మిగిలిన ప్రపంచం మాత్రం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఒక్కసారి తాను సాధించిన పతకాలు చూద్దాం.

14358734_10202270495801833_1673416705954600090_n
unnamed (4)
12122898_1080930308585432_7709617092590854925_n

"మన పూర్వ భారతీయులలో అద్భుత శక్తి ఉంది. అది శారీరకంగాను, మానసికంగాను ఉంది. కాని ఇప్పుడు మన సాంప్రదాయ అలవాట్లు మర్చిపోయి Western Culture కి అలవాటు పడిపోతుండడం వల్ల మన మేధస్సు తగ్గిపోతూ వస్తుంది. ప్రైవేట్ మెమొరి ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ అనే సంస్థలా కాకుండా భవిషత్తులో ఉచితంగా ఒక పెద్ద ఇనిస్టిట్యూట్ స్థాపించి పిల్లలందరిలో ఐక్యూ లెవల్స్ పెంచడానికి కృషి చేస్తానని తను బలంగా కోరుకుంటున్నారు. అది కేవలం పిల్లలకు మాత్రమే కాదు దేశానికీ ఉపయోగకరమని తన అభిప్రాయం.

12795350_1146798645331931_5913627600331795569_n