అప్పుడు మహ్మద్ జబీ ఖాన్ వయసు 14. తను ఉంటున్న కాలనీలో ఒక జర్మన్ షెపర్డ్ కుక్క పిల్ల రోడ్డు పక్కన ఎవరో వదిలేసి వెళ్ళినట్టుగా ఒంటరిగా ఉంది. జర్మన్ షెపర్డ్ అంటే ఖరీదైన కుక్క పిల్ల ఇలా వీదిలో ఎవరు వదిలేశారేంటి అని చుట్టు పక్కల ఉన్నవారిని కనుక్కుంటే ఎవరో కావాలనే వదిలేశారని అర్ధమయ్యింది. కాని జబీ ఖాన్ కు ఆ కుక్క పిల్లను అలా వదిలేయాలని అనిపించలేదు.. తన ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవాలని అనుకున్నాడు, అలానే చేశాడు.. తీరా రెండు రోజుల తర్వాత ఆ కుక్క పిల్ల చనిపోయింది. దీనికి కారణం ఆ కుక్కకు ప్రాణాంతకమైన హెల్త్ ప్రాబ్లమ్ రావడం.


జబీ ఖాన్ దగ్గరికి చేరుకునే సరికే ఆ కుక్క పిల్లకు ఆ జబ్బు చివరి దశలో ఉందని డాక్టర్ల ద్వారా తెలిసింది. ఆ జబ్బు లాస్ట్ స్టేజ్ లో ఉండడం వల్ల డాక్టర్స్ కూడా ఏమి చేయలేమన్నారు. జబీ ఖాన్ కు అప్పుడు అర్ధం అయ్యింది. ఆ కుక్క పిల్ల యజమాని Costly Treatment ఎక్కడ ఇప్పించాల్సి వస్తుందో అని ఇలా బ్రతికుండగానే వదిలేశాడని. ఆ సంఘటన జబీని విపరీతంగా కలిచివేసింది. ఆ చిన్న కుక్క పిల్ల చావు మూలంగ తనో లక్ష్యాన్ని ఎంచుకున్నాడు.


కొంతకాలం తర్వాత ఇంటర్మీడియట్ చదువుతుండగానే అలా వదిలేసిన Dogs కోసం ఒక షెల్టర్ ను ఏర్పాటుచేసి ఎన్నో డాగ్స్ ను కేరింగ్ గా చూసుకున్నాడు. అంతా బాగానే ఉంది కాని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఇంజనీరింగ్ కోసం K.G Reddy Engineering College లో Join ఐన దగ్గరి నుండి కొన్నికష్టాలు మొదలయ్యాయి. ప్రతిరోజూ ఆ డాగ్ షెల్టర్ నుండి కాలేజ్ కి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇలా కాదని చెప్పి ఏకంగా కాలేజిలోనే ఇలాంటి వాటి కోసం ఒక ప్రత్యేకమైన షెల్టర్ ఉండాలని అందుకోసం కాలేజ్ యాజమాన్యాన్ని సంప్రదించాడు. మొదట షెల్టర్ ఏర్పాటు, కాలేజిలోనికి జంతువుల అనుమతి ఇవ్వకపోయినా కాని తర్వాత అంగీకంరించారు. ఇప్పుడు K.G Reddy Engineering College మోయినాబాద్ లో Dogs Rabbits, Ducks, Pigeons, Cats, Turkeys ఇలా 50 వరకు పక్షులు, జంతువులు వీరి కాలేజిలో ఉన్నాయి.


ఇంతేకాకుండా జబీ ఖాన్ జంతు సంరక్షణ కోసం ఒక ప్రత్యేక Registered NGO(Pawsforlifee@gmail.com)ని Start చేసి మిగితా ప్రాణులకోసం తనవంతు బాధ్యతను నిర్వహిస్తున్నాడు. జబీ ఖాన్ తాను పెంచుతున్న జంతువులపై ఎంత మమకారం ఉంటుందంటే వారి ఆధీనంలో ఉన్న వాటిని దత్తత ఇచ్చే విషయంలో కూడా ఆ దత్తత తీసుకునేవారి ఆర్ధిక వివరాలు, వారి ఇంటి పరిసరాలు, వారికి జంతువులపై ఉండే ప్రేమ ఇలాంటివన్ని క్షణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దత్తత ఇస్తాడు. తన ఖర్చులను మిగిలిన ఎంజాయ్ మెంట్స్ అన్ని వదులుకుని తన పాకెట్ మనీ అంతా వీటి సంరక్షణ కోసమే వినియోగిస్తున్నాడు.


మనం ఒక మంచి పని కోసం నిజాయితిగా నిర్వహిస్తుంటే మనకు తోడుగా మనలాంటి వారు తమ సహయాన్ని అందిస్తారు.. జబీ ఖాన్ ఇంకా కొంతమంది మిత్రులు కలిసిచేస్తున్న ఈ సేవకు దాతలు ముందుకొచ్చి జంతువులకు, పక్షులకు అవసరమయ్యే ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ భూమి మన ఒక్కరిదే కాదు మనతో పాటు సకల జంతువులకు బ్రతికే హక్కు ఉంది వాటి కోసం మన అనవసర ఖర్చులను తగ్గించుకుని మనవంతు సహయాన్ని జబీ ఖాన్ లా అందించవచ్చు..


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.