ఎంత చిన్న ఉద్యోగం అయినా కానివ్వండి గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడంటే చాలు నెలకు వారికి వచ్చె జీతం కన్నా కొన్ని రెట్లెక్కువ సంపాదిస్తారు అని అవినీతి అధికారులుపై ACB అధికారుల దాడుల ద్వారా మనకు తెలుస్తుంది.. "లీడర్" సినిమాలో చెప్పినట్టు న్యాయంగా పనిచేయడం అంటే ఈరోజుల్లో త్యాగం చెయ్యడం అని.. ఇప్పటి కాలం నాటి త్యాగానికి అర్ధాన్ని దాటి తన జీతాన్ని సైతం ప్రజలకోసం త్యాగం చేసిన ఒక మంచి మనిషి గురుంచి ఈరోజు తెలుసుకుందాం..
ఆర్మ్ స్ట్రాంగ్ పామె.. నాగలాండ్ లోని జిమె అనే గిరిజన తెగకు చెందిన ఒక వెనుకబడిన ప్రాంతానికి చెందిన వ్యక్తి.. చిన్ననాటి కష్టపడి చదివి IAS పూర్తిచేశాడు.. అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ప్రతి ఒక్కరు Motivational గా మాట్లాడతారు అలాగే పామె కూడ తన చూట్టు ఉన్న వారితో మాట్లాడి స్పూర్తిని నింపేవారు.. 2009 Batch IAS Officer అయిన ఆర్మ్ స్ట్రాంగ్ మణిపూర్ లోని తమెంగ్లంగ్ జిల్లాకు చెందిన తౌసెంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పుడు అతని పేరు దేశమంతటా మారుమోగిపోతుంది. తాను పోస్టింగ్ తీసుకున్న తొలి రోజుల్లో అక్కడి మారుమూలగా ఉన్న 31 గ్రామాలను కాలినడక ద్వారా సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుకున్నారు.. అక్కడి గ్రామస్తులంతా ముక్త కంఠంతో ఒక్కటే కోరుకున్నారు వారికి ప్రపంచంతో సంబందం కావాలని.. అవును వారుంటున్న ప్రాంతానికి పట్టణ ప్రాంతానికి వారది లేకపోవడం వల్ల ఎంతటి దయానీయ పరిస్థితులను అనుభవిస్తున్నారు అని వివరించారు.. రాళ్ళు, గుట్టలు దారి నుండే బియ్యం బస్తాలు లాంటి బరువైన సరుకులను భుజం మీద వేసుకొని నడుచుకుంటు ఎన్నో కిలోమీటర్లు నడిచే దయనీయ పరిస్తితి.. వైద్య సదుపాయాలు లేవు, వ్యైద్యులు రారు, పిల్లల చదువులకు చాల ఇబ్బందిగా ఉండేవి.. వీటన్నింటికి పరిష్కారం ఆ రోడ్డు.. గవర్నమెంట్ లో ఆర్ధిక లోటు కారణంగా ఆ రోడ్డుకు అనుమతి లభించడం లేదు.
ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా తానే నిధులు సమకూర్చి పూర్తిచేయ్యాలి అని వజ్రసంకల్పం పూరించాడు. ఫండ్స్ కోసం మొదట తన ఇంటి నుండే మొదలు పెట్టాడు. తన కొన్ని నెలల జీతం 5,00,000 మొదటి ఫండ్ గా, సోదరుడు 1,00,000, అమ్మ నాన్న వారి పెన్షన్ 5,000 రూపాయలు ఇచ్చారు ఇలా తన స్నేహితులు, తెలిసిన వారు, ఫేస్ బుక్ పోస్టింగ్స్, మీడియా ప్రచారం ద్వారా స్థానికుల నుండి కొంత నిధులను సమకూర్చారు. చేతిలో తక్కువ మొత్తం ఉండటం మూలంగ ఖర్చు తగ్గించాలని అనుకున్నాడు. రోడ్డు నిర్మాణానికి స్థానికులు ఉచితంగా పని చేయడానికి తమవంతు సహాయాన్ని అందించారు, రోడ్డు రోలర్ మిగితా పనివారితో మాట్లాడి సమస్యను వివరించడంతో వారు కూడా ఉచితంగా పని చేయడానికి ముందుకొచ్చారు.. ఎన్నో సమస్యలను ఎదుర్కొని 100 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేశాడు. ఏళ్ళ తరబడి గా వచ్చిన కన్నీళ్ళు ఆ రోడ్డు నిర్మాణంతో ఆనందభాష్పాలుగా మారిపోయాయి.. కేవలం ఊహలకే పరిమితం అయ్యే ఈ ఘనతను చూసి భారతదేశం అంతా 28 ఏళ్ళ ఆర్మ్ స్ట్రాంగ్ పామెను Miracle Man గా కీర్తిస్తుంది.
ప్రతి ఒక్కరితో స్వయంగా మాట్లాడి వారు కోరుకుంటున్న సమస్యలకు పరిష్కారాలను అందించి ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా పామె అన్ని తానై వారి బాధాలను తీరిస్తున్నాడు.. ఒక సమయంలో అయితే అనారోగ్యభారిన పడిన ప్రజల వద్దకు సాధారణ గవర్నమెంట్ వైద్యులు రాకపోవడంతో తన స్నేహితులైన కొంతమంది డాక్టర్స్ ని పిలిపించి దాదాపు 500 మంది భాదితుల ప్రాణాలను కాపాడాడు. ఏళ్ళ తరబడిగా ఉన్న సమస్యలకు వారు చేసే ప్రార్ధనలకు పామె సమాధానంగా మారాడు..ఆధికారాన్ని, మానవ శక్తిని సరైన పద్దతిలో ఉపయోగించుకుంటే ఎలాంటి అద్భుతాలైన సాధించవచ్చు అని ఈ యువ అధికారి నిరుపిస్తున్నాడు.