రోగి ని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగి తో సమానం అన్నారు శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో చిరంజీవి గారు. అలాంటప్పుడు రోగికి సరైన వైద్యం కల్పించని హాస్పిటల్స్ కూడా నరకం తో సమానమే గా.
నాకు బాగా తెలిసిన 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి కి అనుకోకుండా గుండె పోటు వచ్చింది. ఏమి చేయాలో తెలియని వారి కుటుంబం ఆ ఊరిలో మంచి పేరున్న ప్రతి చోట పెద్ద పెద్ద పోస్టర్స్ ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వాళ్ళు వెంటనే ICU లో చేర్పించారు, కానీ ECG కోసం అవరసరమైన జెల్, పేపర్స్ లేవని తీసుకుని రావడానికి వెళ్లే లోపల ఇక్కడ పరిస్థితి విషమించి, రిపోర్ట్స్ చూడకుండా డాక్టర్స్ తీసుకున్న చిన్న స్టెప్ వల్ల చిన్న నొప్పి కాస్త పెద్దదై అతన్ని తన వారికి కాకుండా చేసింది. ఇలా అరుదుగా వచ్చే వ్యాధికి చికిత్స చేసే పరికరాలు ఉన్నాయి అని ప్రచారం చేసుకునే హాస్పిటల్ లో విరిగా అత్యవసరమయ్యే చిన్న చిన్న పరికరాలు లేవు.
ఐతే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. ఇంకో వైపు తక్కువ ఫీజు తీసుకుని చిన్న జ్వరానికి మందు ఇవ్వడానికైనా ఆ పేషెంట్ తాలూకు రిపోర్ట్స్ జాగ్రత్త పరిశీలించి కానీ మందు ఇవ్వని డాక్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి సరైన గుర్తింపు అందని కారణంగా మరుగున పడుతున్నారు.
ఏ విషయానికి అయినా గుర్తింపు ముఖ్యం. చాలా సందర్భాలలో.. అవసరైమైన వారికి గుర్తింపు రావట్లేదు అనవసరమైన వారికి గుర్తింపు వస్తోంది. ప్రజలకి అవసరమయ్యే రూల్స్, సెక్షన్స్ కన్నా అనవసరమైన రూల్స్ గురించి, సెక్షన్స్ గురించి తెలుస్తున్నాయి
ఒక హాస్పిటల్ కి ప్రచారం కన్నా పరికరాలు ముఖ్యం. ఎల్లపుడు అలెర్ట్ గా ఉండే సిబ్బంది ముఖ్యం. ICU లో పాటించ వలసిన నియమ నిబంధనలు కింది ఫైల్ లో ఉన్నాయి.


ICU కి సంభందించిన రూల్స్ అందులో ఉండవలసిన పరికరాలపై అవగాహన మనకు ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయం గురించి సతీష్ కుమార్ పెండ్యాల గారు, తన వంతు కృషి చేస్తున్నారు. వృత్తిపరంగా న్యాయవాది అయినా సతీష్ గారు మల్టీప్లెక్స్ లో పార్కింగ్ చార్జెస్ ని తీసేయడానికి ఇంకా చాలావాటికి కృషి చేశారు.

ICU లో పరికరాలతో పాటు. అక్కడికి ప్రాణ భయం తో వచ్చిన వారిని అభిమానంగా పలకరించే సిబ్బంది కూడా చాలా అవసరం . ఎంతో క్రుంగిపోయి ఉన్న వారితో హాస్పిటల్ సిబ్బంది పరుషంగా మాట్లాడితే ఆ మాత్రం ధైర్యం కూడా వారిలో ఆవిరవుతుంది.
దీన్ని కారణంగా చూపి హాస్పిటల్ సిబ్బంది ని తప్పు బట్టలేం. ఎప్పుడు ఆ వాతావరణం లో ఉంటూ ప్రశాంతంగా ఉండటం వారికైనా మామూలు విషయం కాదు. ఆ విసుగు ని పేషెంట్స్ పైన చూపిస్తారు. అలా కాకుండా షిఫ్ట్స్ పద్దతి అమలు చేస్తే బాగుంటుంది. ఈ పద్ధతి ని కొన్ని హాస్పిటల్స్ అమలు చేసినప్పటికీ అన్ని హాస్పిటల్స్ అమలు చేయాల్సిన అవసరం ఉంది.
వైద్యో నారాయణ హరి: అన్నారు పెద్దలు. అలాంటి దేవుళ్ళు ఉండే దేవాలయాలు గా హాస్పిటల్స్ ఉండాలి నరకం లా కాదు. బాధైనా సంతోషమైన ఒకేలా తీసుకునే సానుకూల దృక్పధాన్ని అక్కడికి వచ్చే పేషెంట్స్ కల్పించాలి. బతుకు నిచ్చే బతుకు నేర్పే హాస్పిటల్స్ ఎన్నో రావాలని కోరుకుందాం.