సరిగ్గా నాలుగు నెలల ముందు మన "Indian Cinema గారు Tollywood" తో మాట్లాడారు అని మనందరికీ తెలుసు కదా. ఆ కబుర్లు మనం "This Sweet Conversation Between Indian Cinema And Tollywood Will Warm Your Heart Instantly!" లో చూసాం . ఇప్పుడు మన Indian Cinema గారు Tollywood గారిని అభినందించడానికి మళ్ళీ పిలిచారట! ఆ కబుర్లు ఏంటో చూద్దామా!
Indian Cinema : హా రావయ్యా Tollywood. మళ్ళీ రెండవసారి నీతో మాట్లాడాలనిపించి పిలిపించా. చాలా విషయాలు మాట్లాడాలి. ఇంతకీ ఎలా ఉన్నావ్? Tollywood : హా నేను బాగానే ఉన్నానండి, మీరేలాఉన్నారు? మళ్ళీ నన్ను గుర్తుంచుకుని మరీ పిలిపించుకుని మాట్లాడతారు అని అస్సలు అనుకోలేదండీ! మళ్ళీ ఇలా కలవడం చాలా ఆనందం గా ఉంది నాకు. Indian Cinema : నాలుగు నెలలు అయ్యింది, చాలా హిట్స్ వచ్చాయి, ఐనా నీలో ఏ మార్పూ లేదు. అదే హుషారు, అదే సంస్కారం, అదే వినమ్రత. అందరికన్నా మీలో నాకు నచ్చే విషయాలు ముఖ్యం గా ఇవేనయ్యా. పోయిన సారి లాగ నుల్చొకుండా కూర్చో! Tollywood : హహ్హ! చాలా థాంక్స్ అండీ. Indian Cinema : ఈ నాలుగు నెలల్లో చాలా అంటే చాలానే జరిగిపోయాయయ్యా. బాహుబలి లాంటి హిట్టు సినిమాలు వచ్చాయో లేదో, అలా డ్రగ్స్ అని ఇంకో మచ్చ అంటుకుంది . Tollywood : అవునండీ! డ్రగ్స్ అనే మచ్చ మొన్నమొన్ననె అంటుకుంది. దీనివల్ల మంచి వారిని కూడా, చెడు గా చూపించాయి కొన్ని TV Channels. కానీ దీనివల్ల ఇంకో మంచి కూడా జరిగింది. నిజమ్ గా చెడ్డ వారు ఉన్నా, మంచివాళ్ళ కీర్తి మాత్రం మరింత పెరిగింది. ఇది కూడా మన మంచికే లేండి. Indian Cinema : హా నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజమ్. అది పక్కనుంచు లే కానీ, పెళ్లిచూపులు, శతమానంభవతి సినిమాలకి National Award ఇవ్వడం నాకెంతో తృప్తి గా అనిపించింది. ఇంక బాహుబలి తిరగ రాసిన రికార్డులు ఐతే చెప్పనక్కర్లేదు. మన దేశం లోనే బాగా collect చేస్తుంది అనుకున్నా, కానీ ఇతర దేశాల్లో అతి పేద్ద "Block Buster" గా నిలవడం మామూలు విషయం కాదు. రాజమౌళి కి నేను ఏమిచ్చి ఋణం తీర్చుకోగలనయ్యా. Tollywood : అవునండీ! రాజమౌళి ఇప్పటిదాకా తెలుగు సినిమా అనే హిస్టరీ book లో Syllabus మొత్తం change చేసేసారు... ఆ syllabus దేశం లో ప్రతీ పౌరుడికి నచ్చింది. Indian Cinema : హా! ఒక్క సినిమా నే అనుకున్నా కానీ శేఖర్ కమ్ముల, తేజ.. వీరిద్దరూ ఏం తక్కువ కాదని చూపించారు. దేనికి అదే సాటి. ఫిదా లో ఒక్కొక్కరి నటన కట్టిపడేసింది నన్న. ప్రాంతీయ తెలంగాణా బాష కి మాత్రం నేను అభిమానినయిపోయా. ఇంక నేనే రాజు నేనే మంత్రి లో రానా కొత్త హంగులతో కనిపించాడు. ముఖ్యం గా రానా ని చూసినప్పుడు నాకు భల్లాల దేవుడు అని mental గా fix అయిపోయా. కానీ తేజ direct చేసిన సినిమాలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. మీ తెలుగు వారితో వచ్చింది ఇదేనయ్యా, మంచి కథ వస్తే ఒక్కొక్క పాత్రా జీవించేస్తారు అందులో. Tollywood : చాలా thanks అండీ. ఇప్పుడు Tollywood అంటే మొత్తం దేశం అంతా ఎదురుచూస్తుంది. అవునూ ఇంతకీ మీరు ఆనందో బ్రహ్మ, "Arjun Reddy" లు చూసారా? Indian Cinema : మీ సినిమాలు మొదటి రోజు చూసేది నేనే కదా! ఆనందో బ్రహ్మ లో Comedy 100% ఉన్నాది, కానీ అందులో నాకు మీ కొత్తదనం నచ్చిందయ్యా. అదే నాకు ఘాజీ లో కూడా పిచ్చి పిచ్చి గా నచ్చేసింది. "Sankalp Reddy" చాలా విశ్వప్రయత్నమే చేసాడు. ఒక కొత్త అనుభూతి ని కలిగించాడు. ఒక రాజమౌళి, ఒక శేఖర్ కమ్ముల, ఒక జాగర్లమూడి క్రిష్, ఒక సంకల్ప్ రెడ్డి, ఒక సందీప్ వంగా వీరి లాంటి వాళ్ళు మనకి దొరికిన ఆణిముత్యాలు. హా సందీప్ వంగా అంటున్నా కదా! అసలు Arjun Reddy ని అంత తెలివి గా మనసుకి హత్తుకుపోయేలా తీసిన విధానం నన్ను కట్టిపడేసింది, Vijay అందులో పరకాయ ప్రవేశం చేసేసాడు అంతే! Tollywood : హా అవునండీ! సరిగ్గా 28 సంవత్సరాల క్రితం వచ్చిన శివ తో అందరూ పోలుస్తున్నారు. Indian Cinema : లేదయ్యా! అలా పోల్చడం అస్సలు కుదరదు. దేని స్టోరీ దానిదే, ఎవరి నటన వాళ్లదే. అప్పట్లో వచ్చిన శివ, అప్పటిదాకా ఉన్న రొటీన్ స్టోరీల రికార్డులు బద్దలుకొట్టింది. ఇప్పుడు ఇదీ అదే చేస్తుంది. కొత్తదనం తో కథలు రూపుదిద్దుకుంటున్నాయి. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నిన్నుకోరి సినిమా ఒక అబ్బాయి Love Story అయితే, Arjun Reddy ఇంకొకడిది. రెండు సినిమాలూ జనాలు accept చేసారు. Tollywood : అవునండీ! దేన్నీ compare చెయ్యలేం. Arjun Reddy లో ఉన్న angles, కథ వెళ్లే విధానం, ఒక స్వచ్ఛమైన ప్రేమ, ఒక భావ వ్యక్తీకరణ, ఒక ప్రేమించిన అబ్బాయి యొక్క perspective, నేటి సమాజం పోకడ, ఇవన్నీ జనాలకి అర్థమయ్యేలా చూపించారు. Indian Cinema : చూస్తూ ఉండు! ఊహించనంత హిట్ అవ్వకపోతే నన్ను అడుగు! Attitude అనే పదానికి, Anger అనే పదానికి మధ్య వ్రిత్యాసం మనకి స్పష్టం గా కనిపిస్తుంది. నిజాంగానే ఈ సినిమాలో ఉన్న చాలా కోణాలు, జనాలని తప్పకుండా Inspire చేస్తాయ్! ఈసారి మీ Tollywood లో బాగా పేరున్న Online హీరోల గురించి, మీకున్న Platforms గురించి చర్చిద్దాం! నాకూ తెలుసుకోవాలని ఉందయ్యా! Tollywood : Online హీరోలు ఏంటండీ? Short films గురించా? Indian Cinema : Short films ఏ కాదయ్యా! మీకు చాలా platforms ఉన్నాయ్ గా Youtube తో పాటు. నాకు వాటి గురించి అంతగా తెలియవూ! కానీ పేరు మాత్రం విన్నా. త్వరలో మాట్లాడదాం లే. Tollywood : హోహో అవా! మీకు అన్నీ తెలుసన్నమాట! తప్పకుండా కలుద్దాం అండీ! ఇక సెలవు!