నిజానికి మన చిన్ననాటి జ్ఞాపకాలే మనతో ఎప్పటికి నేస్తాలుగా ఉంటాయి.. మన స్కూల్ డేస్, మన స్నేహితులు, మన అల్లరి పనులు.. ఏమైనా గాని ఆరోజులే మనకు మరుపురాని మధురస్మృతులుగా మదిలో నిలిచిపోతాయి. అలాంటి తీయ్యని జ్ఞాపకాలలో మనం ఆడుకున్న బొమ్మలకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అమ్మాయిలకు ఐతే బొమ్మలను వారి ప్రాణ స్నేహితులులా అపురూపంగా చూసుకుంటారు. ఆ బొమ్మకో మంచి పేరు పెట్టి, వాటికి మంచి డ్రెస్ కూడా కుట్టించి అందంగా అలంకరిస్తారు.. వాటితో ముద్దు ముద్దుగా మాట్లాడతారు, వాటికి చిన్ని చిన్ని కథలు చెబుతారు కూడా.. పిల్లలకు బొమ్మలకు విడదీయరాని అనుబంధం అలాంటిది.



కాని మన సంప్రదాయ భారతీయ డ్రెస్ లలో ఉండే బొమ్మలు అత్యంత అరుదు. ఈ లోటునే తన ఉపాధిగా మార్చుకున్నారు మన హైదరాబాద్ కు చెందిన హిమ శైలజ గారు. Kiyaa (Kiyaa.in) అనే సంస్థను 2014లో స్థాపించి మనదేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు చెందిన ప్రతి ప్రాంత సంప్రదాయకమైన దుస్తులతో, భారతీయ స్త్రీ ఆహార్యంతో అందంగా చూడ ముచ్చటగా ఉండే బొమ్మలను తయారుచేయడం ప్రారంభించారు. బొమ్మలలో మన పవిత్రమైన సంప్రదాయత పుష్కలంగా ఉండటంతో నేటితరం పిల్లలకు మన సంస్కృతి చిన్నతనం నుండే తెలుస్తుందని ఈ బొమ్మలనే వారి పిల్లలకు కానుకగా అందిస్తున్నారు తల్లిదండ్రులు.



Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.