అరిటాకు భోజనం
ఇప్పుడు కొత్త రకాల డిజైనింగ్ ప్లేట్స్ వస్తున్నాయి కాని ఆకాలంలో మాత్రం అరిటాకులో మాత్రమే భోజనం చేసేవారు. పెళ్ళిళ్ళకు పండుగలకు అరిటాకులతో ఘనంగా శుభకార్యాలు నిర్వహించేవారు.. ఇందుకు ఏ ప్లాస్టిక్ వాడకం కాని లేదా శుభ్రం చేయడానికి ఏ కెమికల్స్ వాడిన డిష్ వాషర్ల అవసరం లేదు. అంతేకాదు శత్రువులు ఎవరైన భోజనంలో విషం కలిపితే అరిటాకు రంగు మారుతుంది. ఆరోగ్యంతో పాటు రక్షణ పరంగా కూడా అరిటాకును ఉపయోగించెవారు.
పసుపు వాడకం
పసుపు భారతీయులు వాడినంతగా మరే ఇతర దేశాల వారు వాడరు. పసుపులో ఆంటి బయోటిక్స్ సాంద్రత ఎక్కువ. అందుకే బయటి క్రిమి కీటకాలు లోనికి రాకుండా ఇంటి గడపకు పసుపు రాస్తారు, ఆడవారు వారి ముఖానికి, పాదాలకు కొన్ని ప్రత్యేక రోజులలో రాసుకుంటారు దీనివల్ల వారి పాదాలు శుభ్రపడటమే కాక శుభశూచికంగా కూడా పరిగనిస్తారు.
వేప
ప్రతిరోజు ఉదయాన్నే వేపచెట్టుకు పూజ చేయాలంటారు.. నిజానికి పూజ వల్ల చెట్టు దగ్గర గడిపే సమయంలో వేప గాలిని పీలుస్తాము.. ఉదయాన్నే వేపచెట్టు గాలి పీల్చడం ఆరోగ్యానికి ఎంతో మంచింది.
కుంకుమ
హిందువులు తప్పక కుంకుమ ధరిస్తారు.. ఇది భక్తి కోసం మాత్రమే కాదు ఏకాగ్రతగా ఉండటం, ఎదుటి వారు మన అనుమతి లేకుండా హిప్నొటైజ్ చేయకుండ వాటికి గురికాకుండా అరికడుతుంది.
నేల మీద భోజనం
నేల మీద కూర్ఛొని భుజించడం వల్ల మనకు ఎంత ఆకలిగా ఉంటే అంత మాత్రమే తింటాము అంతే కాకుండా పొట్ట భాగంలోని కొవ్వును కూడ తగ్గించుకోవచ్చు. కుర్చునే పద్దతి వల్ల తిన్న ఆహరం సులువుగా జీర్ణం అవుతుంది
గోవు పేడ
ఇప్పటికి పల్లెటూరులలో గోవు పేడతో కలిపిన నీటితో ఇంటి వాకిలినీ కళ్ళాపి చల్లుతారు.. గోవు పేడలో ఉండే నాచురల్ ఆంటిబయోటిక్స్ బాక్టీరియాలను దరిచేరనీయవు. అంతేకాకుండా ఆర్గానిక్ ఫుడ్ కోసం సేంద్రీయ ఎరువులుగా పేడను వాడతారు.
తులసి పూజ
ప్రతి హిందూ కుటుంబంలో తులసి మొక్క తప్పక ఉంటుంది.. తులసి పూజ తరువాత తీసుకునే తులసి ఆకులు, వాటి తీర్ధం రోజు సేవించడం వల్ల క్యాన్సర్ వంటి వ్యాదులు రాకుండా ముందే అరికట్టవచ్చు అని వైద్య శాస్ర్తం చెబుతుంది.
దీపాలను వెలిగించడం
నెయ్యి, నువ్వులు వంటి నూనెల ల తో వెలిగించిన దీపాల మూలంగా చీకటిని ప్రాలదోలటమే కాకుండా పాజిటివ్ ఆలోచనలు వస్తాయని నమ్మకం.
మామిడి తోరణాలు
మామిడి ఆకులు తెంచినా కొన్ని గంటలపాటు ఆక్సిజన్ అందిస్తునే ఉంటుంది. సాదారణంగా పండుగలు శుభకార్యాలలో ఇంటికి బందువులు ఎక్కువ సంఖ్యలో వస్తారు ఇంటి లోపల ఉన్న బందువుల ఆరోగ్యం కోసం మనo పండుగలు శుభకార్యాలకు మామిడి ఆకులను తోరణాలుగా కడతాo.
శవ దహనం
చాలా ప్రాంతాలలో శవాలను సంప్రదాయ పద్దతిలో దహనం చేస్తారు..
ఒక శవాన్నినాశనం చేయ్యడంలో సరైన పద్దతిగా నిరూపన అయ్యింది. ఒక శవం నుండి వచ్చే ఆనారోగ్యాలను ఇలా దహనం చేయడం వల్ల అరికట్టవచ్చు.
ఇప్పుడు అందరూ రీసర్చ్ చేసి అది సాధించాం ఇది సాధించాం అని అనుకుంటుంటారు కాని నిజానికి మన భారతీయులు ఏనాడో వీటిని కనుగొని పాటించడం మొదలుపెట్టారు. అంతే కాక దానికి భక్తి అనే పరిపూర్ణత్వం జోడించడం వల్ల తప్పనిసరిగా ఈ ఆచారాలు గౌరవంగా పాటించాలి అనే నియమంతో అందరు ఆచరిస్తున్నారు.. ఇవే కావు ప్రతి ఆచారంలో కూడా ఏదో ఒక ఉపయోగం తప్పనిసరిగా ఉంటుంది.. గుడ్డిగా నమ్మడానికి దాని గురుంచి తెలుసుకొని పాటించడానికి చాల తేడా ఉంటుంది.. కొన్ని అవసరంలేని చెడు చేసే మూడనమ్మకాలు కూడా ఉన్నాయి కాని ఇలా లోతుగా పరిశీలించడం వల్ల ఏది మూడ నమ్మకం ఏది గొప్ప పద్దతి అన్న విషయం తెలుస్తుంది.









