Contributed By V.Siva Rama Teja
College లో మనం ఎంత ఆనందం గా ఉన్నా, చాలా బాధ పడేది మాత్రం ఒక్క Farewell party రోజే! ఎలాగో 4th ఇయర్ వారు బాధపడటం రొటీనే. కానీ నాకు ఫ్రెండ్స్ నుంచి విడిపోతున్నాం అనే బాధ కన్నా ఈ B.Tech నాలుగు సంవత్సరాల college life లో ఏమీ పీకలేదనే బాధ లోలోపల ఉంది. నాకే కాదు నా situation లో ఉన్న ప్రతీవారికి ఇలాగే ఉంటుందేమో! ఎదో 48 subjects నేర్చుకున్నాం, exams రాసాం తప్ప కొత్తదనం ఏదీ లేదు. ఐనా అందరూ బానే ఉంటే నాకేందుకు ఈ లేనిపోని doubts అని బాధ లోపలే ఉంచేస్కుని Farewell Function కి వెళ్ళా.
Cut చేస్తే ....... function మొదలైంది.
Faculty ఒక్కొక్కరు speeches ఇవ్వడం మొదలు పెట్టారు. College లో చదువుతున్నప్పుడు ఎవ్వరూ ఇలా మంచి మాటలు చెప్పరు. కానీ ఇప్పుడు ? B.Tech అయిపోయాక ఏం చెయ్యాలో ఉచిత సలహాలు మాత్రం ఇస్తారు. Function అంతా బాగానే జరుగుతుంది. కాసేపయ్యాక "కాలేజీ స్టూడెంట్స్ ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా ... ?" అని మైక్ లో వినబడింది. ఎవ్వరూ పైకి లేవలేని సమయం లో నాలోని ఆత్మా రాముడు పైకి లేచాడు. College లో ఎన్నడూ లేని ధైర్యం, ఉత్సాహం నాకు వచ్చాయి ఆ సమయం లో. నా ప్రమేయం లేకుండానే, "నేను మాట్లాడతా !" అని నా నోరు చెప్పేసింది. నా కాళ్ళు నన్ను స్టేజి దగ్గరికి తీసుకెళ్లాయి. ఈ నాలుగు సంవత్సరాలు చదివి విడిపోతున్నాం అనే బాధ ఒక పక్క, ఈ నాలుగు సంవత్సరాలూ ఏమీ కొత్తగా చేయలేదనే బాధ మరో పక్క . ఎలాగైతేనేం, నా నోరు నా మనోగళం విప్పింది.
Cut చేస్తే ........
"నేను ఇక్కడ రెండే రెండు ముక్కలు మాట్లాడదలుచుకున్నా ! Dear Sirs అండ్ Madams , మొదటిది 'మీరు ఈ నాలుగు సంవత్సరాల్లో మాకు ఏం నేర్పించారో', రెండవది 'ఈ నాలుగు సంవత్సరాల్లో మేము ఏం నేర్చుకున్నామో' అని.
ఇక్కడున్న ప్రతీ faculty ని నేను కొన్ని questions అడగడలుచుకున్నా. ఎలాగో ఒక వన్ వీక్ లో మేము ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాం sir . ఈ questions కి మీరు answers చెప్పకపోయినా ఫరవాలేదు . మీకు ఈ questions అర్థమైతే చాలు sir.
Sir మాలో చాలామందికి 10th లో 80% , Inter లో 90% వచ్చాయ్ . కానీ B.Tech లో ఎందుకు sir 60% రావడమే చాలా కష్టమైపోతుంది ? ఇక్కడికి వచ్చాకనే Attendance కి ఉన్నంత Importance marks లో కూడా ఉండదు sir. 10th లోనూ, Intermediate లోనూ Enjoyment కోసమైనా చదవడానికి వెళ్ళేవాళ్ళము.అక్కడ Attendance అనే word ఏ తెలీదు మాకు సరిగ్గా. కానీ B.Tech కి వచ్చాక, ఇక్కడ full reverse . Attendance కోసమే వస్తున్నాం తప్ప enjoyment కోసం అస్సలు కాదు. ఎందుకు? సరేపోని ఏదో చదివాం 4 years ...... supplies రాసి, అర్థంకాని subjects చదివీ ........ కానీ మొన్న కాక మొన్న interviews వచ్చినప్పుడు అన్నీ Service based companies వచ్చాయ్ తప్ప Product based Company ఒక్కటైనా వచ్చిందా? పోనీ ఎదో ఒక software job వచ్చిందనుకున్నాం. ఆ job కూడా మా 10th , Inter లో ఉన్న knowledge బట్టి వచ్చింది తప్ప, B.Tech కీ ఆ job కీ ఏ సంబంధమూ లేదు. మాలో చాలా మందికి further studies చదవాలని ఉంటుంది. దానికి ఏవేవో exams రాస్తారు. B.Tech అయిపోయాక కూడా కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతున్నారు ఒక సంవత్సరం పటు. మీరు ఒక్క సారి ఆలోచించండి sir. College లో మీరు బాగా చెప్పుంటే వాళ్ళు బయటికి వెళ్లి చాలా money waste చేసుకొని ఎందుకు 1 year మళ్ళీ చదువుతారు?
ప్రపంచం లో Most Successful People లో 35% College Dropouts అని ఎక్కడో చదివా. ఇప్పుడు మేమూ మానేసి ఒక Startup పెడతాం అంటే కాళ్ళు విరగ్గొట్టి మళ్లీ college కే పంపిస్తారు sir మా parents . మాకు మర్క్స్ ఏమైనా తక్కువొస్తే parents మమ్మల్నే అంటారు కానీ మిమ్మల్ని , కాలేజీ ని ఒక్కమాట కూడా అనరు . ఎందుకు ? ఎందుకంటే college లో join అయ్యినప్పుడు అందరూ మంచి కాలేజీ అనే ఉద్దేశం తోనే చేరతారు కాబట్టి.
ఒకటి ఆలోచించండి sir . ఒక Intermediate చదివే వాడినో లేదా ఒక 10th చదివే అమ్మాయినో ...... 'నువ్వు future లో ఏం అవుతావ్ ?' అని అడిగితే , ..... 'నేను Google లో job సంపాదిస్తా' అనో లేదా 'నేను Scientist అవుతా' అనో గర్వం గా చెప్తారు. కానీ వారిలాంటి వాళ్లే B.Tech లో ఒక Job Interview కి Written Test కూడా qualify అవ్వరు . Ofcourse బాగా చదివిన వాళ్ళు ఎదో అవుతారు లేండి . అది వేరే విషయం . మిగిలిన students కి మీరు ఏం నేర్పించినట్టు ? 5 marks for Attendance , Below 75% అయితే Condonation . ఇవే కదా !
హా ! attendance అంటే మళ్ళీ ఒకటి గుర్తుకొస్తుంది. మీరు చెప్పే అర్థంకాని class కోసం మేము nearly 2hrs కూర్చోవాలి. అదే 2 hrs మీకు ఒక అర్థంకాని cinema చూపిస్తే మీరు కూర్చోగలరా ? నేను అందరి Lecturers ని అనట్లేదు . ఎవరైతే అర్థంకాకుండా Class Board కి చెప్పుకుంటూ పోతారో వారికే చెప్తున్నా . May be మీరు రోజుకి ఒక 2 hrs కష్టపడతారేమో . పోనీ ఒక 5 hrs అనుకుందాం . మరి మా parents సంగతి ఏంటి ? వాళ్ళు రోజుకి 10 hrs పైన కష్టపడి సంపాదించిన డబ్బు తో మమ్మల్ని చదివిస్తున్నారు . మరి వాళ్ళ కష్టానికి మీరు న్యాయం చేసారా ? సరే ఇంకా చెప్తే బాగా emotional అయిపోతానేమో .
ఇంక రెండో part కి వెళదాం . మేము ఈ నాలుగు సంవత్సరాల్లో నేర్చుకున్నదేంటిఅంటే , ఏ పనైనా చేయగలము అనే ధైర్యం , Time Management , వివిధ రకాల జనాలని అర్థంచేసుకోవడం , ఇలాంటివి .. రాత్రికి రాత్రే 100 పేజీల Record రాసినప్పుడు, రాత్రికి రాత్రే 10 drawing షీట్లు గీసినప్పడు , ఇలాంటి క్వాలిటీస్ తెలుస్తాయి మాకు . మీకు ముందు B.Tech స్టూడెంట్స్ అందరూ స్లిప్లు పెడతారనే అపోహ పోవాలి . స్లిప్లు దేవుడెరుగు . బాగా రాసినా సరే మంచి మార్క్స్ రావడం కష్టతరం అయిపోతుంది మాకు . మన దేశం లో B.Tech చేసిన వాళ్ళందరూ software కి వెళ్ళిపోతే India లో IT sector తప్ప ఇంకేమి develop అవ్వవు sir . ఒక 40 ఏళ్ళు వచ్చాక వెనక్కి తిరిగి చూస్కుంటే Data Structures , C language తప్ప ఇంకేమీ కనిపించవు . నేను చెప్పాల్సింది అంతా అనుకోకుండా చెప్పేసాను . Juniors కి నేను ఇచ్చే పెద్ద మెసేజ్ ఈ స్పీచ్ ఏ .. ....... Thank You ."
Cut చేస్తే ........ ఇలా నా ఆత్మా రాముడు నా ఆవేశాన్ని నా నోటి ద్వారా వెళ్లబుచ్చాడు .
Cut చేస్తే ......... చప్పట్లు ఈలలు గోలలు .........
Cut చేస్తే ......... ఎవరో కాలు మీద తన్నుతూ " మామ లేవరా ! ఎనిమిదిన్నర అయ్యింది ! ఇంకో అరగంట లో క్లాసుంది . ఈరోజు కూడా interest లేదని మానేస్తే Attendance బొక్క మనకే . లేగరా మామ !" అని ఒక పొలికేక వినిపించి, నిద్ర లేచాను .
మీకు ఈపాటికే అర్ధమయ్యే ఉంటుంది . ఇదంతా ఒక పేద్ద కల అని . ఇది కల అయినా అందులో ఉన్న ప్రతీ విషయం అక్షరాలా నిజమ్ . ఒక B.Tech student యొక్క ఆవేదన ఒక B.Tech student కే అర్ధమవ్వుద్ది . ఇది ఒక సాటిలేని B.Tech స్టూడెంట్ యొక్క అంతరంగం.
ఈ article చదువుతున్న లెక్చరర్ లేదా student గుర్తించుకోవాల్సింది ఏంటంటే , అన్ని college లు ఒకేలా ఉండవు . అందరు లెక్చరర్లు ఒకేలా ఉండరు . కొన్ని మంచి college లు ఉంటాయి అలాగే కొందరు మంచి లెక్చరర్లు ఉంటారు . అలంటి వారికి ఈ article వర్తించదు . ఈ article కేవలం స్టూడెంట్ కి ఏమీ నేర్పించకుండా, నాలుగు సంవత్సరాలు వేస్ట్ చేయించేసిన లెక్చరర్స్ మఱియు కాలేజీ లకి మాత్రమే అంకితం .
కలలు నిజమ్ కాకపోవచ్చు . కానీ కలలో వచ్చింది మాత్రం నిజమ్.