హృదయ్ ఒక Middle Class Family కి చెందిన Average Student. Childhood నుండి ఏ కష్టం తెలియకుండా Education Continue చేసి Engineering Average Marks తో Pass అయ్యాడు. Software Courses ఇంకా English Fluency కోసం Hyderabad అమీర్ పేట్ Institute లో Join అయ్యాడు ఎలాగైనా మంచి జాబ్ కొట్టాలనే ధీమాతో. But...అన్ని మనం అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది!!! తనకు ఎంతో ఇష్టమైన తండ్రి ఒక Accident లో చనిపోయాడు. అసలే Sensitive Heart అయిన హృదయ్ నాన్న మరణం తట్టుకోలేకపోయాడు. ఇంకా తన చదువుకోసం చేసిన అప్పులు,కుటుంబ పోషణ,తన Coaching ల కోసం ఒక బార్ లో సర్వర్ గా పనిచేద్దామని నిర్ణయించుకున్నాడు.Day Time అంతా కోచింగ్ సెంటర్స్ లో Evening Night Time అంతా బార్ లో. హృదయ్ చాల ఒత్తిడికి గురవుతున్నాడు, ఇది అతని జీవితంలో చాల క్లిష్టసమయం.
తనతో చదువుకున్న Friends అందరికి Job వచ్చేశాయి కాని నాకే ఇంకా రాలేదంటు భాదపడుతు Bar లో Customers కి Serve చేస్తుఉండగా అతని వెనుక ఉన్న Cabin లోకి కొంతమంది వచ్చి కూర్చున్నారు. ఏదో మాట్లాడుకుంటు సర్వర్... అని హృదయ్ ని పిలిచారు తిరిగి చూస్తే అతనితో చదువుకుని జాబ్ చేస్తున్న హృదయ్ Friends. హృదయ్ హృదయము ఒక్కసారి ఆగిపోయింది, వాళ్ళముందు నిలబడే ధైర్యం లేక బయటకు వచ్చి అలానే నడుచుకుంటు దూరంగా వెళ్ళిపోతున్నాడు...దూరంగా ఒక చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడే ఏడుస్తు కూర్చున్నాడు. రాత్రి 3 గంటలకు దాహం వేసి అక్కడ ఒక చెట్టుకింద ఉన్న కుండ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వెళ్తుంటే హృదయ్... అని పిలిచిన శబ్ధం తిరిగిచూస్తే కుండ మాట్లాడటం మొదలుపెట్టింది.
కుండ: నేను నిన్ను చాల Time నుండి గమనిస్తున్నాను నీ భాద నాకు అర్ధం అయ్యింది. భాదపడు తప్పులేదు అలాగే నా జీవితంలో నేను పడ్డ కష్టం గురుంచి చెబుతా విను...
హృదయ్: అదేంటి నువ్వు కష్టాలు పడ్డావా ??
కుండ: అవును... నేను నీకు ఇలా ఉపయేగపడక ముందు భూమిని అంటిపెట్టుకున్న మట్టిని. నాకంటు ఒక గుర్తింపు ఉండకపోయేది, అందరు నన్ను తొక్కేవాళ్ళు. ఒక కుమ్మరి నన్ను వెళికితీసి ఒక మూలన పడేశాడు ఎండకు ఎండి వానకు తడిచాను. కుమ్మరి నాలో అనవసరపు చెత్త రాళ్ళు చెడును తీసేసాడు అప్పుడు నాకు అర్ధం అయ్యింది నాలో ఇంత Bad ఉందా అని... అదంతా నానుండి వేరు చేసేసరికి చాల హ్యాపి అనిపించింది. ఆ తరువాత నన్ను కిందపడేసి నీళ్ళుపోసి తన బరువైన శరీరంతో నన్ను తొక్కడం మొదలుపెట్టాడు నాకు చెప్పలేని భాదవేసింది వెంటనే ఒక సారె మీదవేసి నాక ఒక ఆకారం వచ్చేదాకా దాన్ని గుండ్రంగ తిప్పాడు,ఆశ్చర్యం... నాకంటు ఏ ఆకారం లేదనుకున్నా నాకు ఒక ఆకారం వచ్చింది. కాని ఆ ఆనందం నాకు ఎంతో కాలం లేదు.కొన్నిరోజులకు నన్ను సల సల మండుతున్న మంటలలో వేశాడు అప్పుడు నా భాదను మాటల్లో వర్ణించలేను. మంట చల్లారాక నల్లగా ఉండే నేను ఎర్రగా మారి చిన్న నీటిచుక్క కూడా బయటికి వెళ్ళనియ్యని నీటిని చల్లగా మర్చె ఇలా ఒక కుండగా మారాను.
ఏ గుర్తింపు లేని నాకు ఒక కుమ్మరి నన్ను గుర్తించి నాకు ఇన్ని కష్టాలు పెట్టాడు అయినా కూడా నాకంటు ఒక గుర్తింపు వచ్చింది. నేను ఈరోజు ఇలా ఇంతమందికి సహాయం చేస్తున్నా ఎంత వేడి నీటినైన చల్లబరిచేంత శక్తి నాకు వచ్చింది. నేను మట్టినుండి కుమ్మరి కష్టాలను అనుభవించిన తర్వాతనే నలుగురికి సాయం చేసెంత ఎదిగాను. అలాగే నువ్వు కూడా కాలం పెట్టే కష్టాలను తట్టుకుని దాటాకనే నీకంటు అందరికన్నా ఉన్నతమైన గుర్తింపు లభిస్తుంది. ఇలా మాట్లాడుతుండగానే తెల్లారింది... హృదయ్ తన గుండె నిండా ధైర్యాన్ని నింపుకుని మొదట తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి తన పరిస్థితిని వివరించి బార్ లో జరిగిన దానికి Apology చెప్పాడు. ఇక ఆరోజు నుండి రెట్టించిన ఉత్సాహంతో కష్టపడటం మొదలుపెట్టాడు, ఎదుటివారి ముందు తనని తాను చిన్న చూపుగా చూసుకోలేదు ఏదో Miracle జరిగినట్టు ఈ Incident జరిగిన వెంటనే అతనికి జాబ్ రాలేదు సంవత్సరం అంతా ఓపికగా Honest గా Struggle చేశాక జాబ్ ని గెలిచాడు.
(Inspired from Ramakrishna Prabha)