Here's Why Comrade Puchalapalli Sundarayya Is One Of The Most Inspiring Political Leaders This Country Ever Saw!

Updated on
Here's Why Comrade Puchalapalli Sundarayya Is One Of The Most Inspiring Political Leaders This Country Ever Saw!

Written By Siva Racharla

ఆయన ఒక "నిర్వచనం",ఆయనొక "నిర్మాత",ఆయనొక "ఉదాహరణ",ఆయన భారత రాజకీయ వ్యవస్థకు నిలువుటద్దం... ఆయన "Marxist in practice"...

అందరు ప్రధానుల & మన రాష్ట్ర ముఖ్యమంత్రుల పేర్లు తడుముకోకుండ ఎంత మంది చెప్పగలరు? జీవితాంతం ప్రతిపక్షంలో వున్నా "ఆ"నాయకుడి పేరు అధికారంలో ఏపార్టి వున్నా స్మరించటానికి కారణం ఏమిటి? అసెంబ్లీల్లో అధికార & ప్రతిపక్షాలు గొడవపడ్డ ప్రతిసారి "ఆ"నాయకుడు ప్రాతినిధ్యం వహించిన సభలో ఇలా గొడవ జరగటం భాధాకరం అనటం వింటుంటాము.

ఆమనిషి,ఆనాయకుడు "పుచ్చలపల్లి సుందరయ్య" aka కామ్రేడ్ "P.S" నిన్న మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిగారికి మంత్రి పదవి రాని సందర్భంలో కూడ నాకు సుందరయ్య స్పూర్తి, రాజకీయల్లో ఎప్పుడు అక్రమపద్దతులు పాటించలేదు అని చెప్పుకున్నారు.

కమ్యునిస్ట్ పార్టీలతొ పరిచయం వున్న వారికి పార్టి "నిర్మాణం" అన్నమాట పరిచయం వుంటుంది. రాజకీయ పార్టీల బాషలో "నిర్మాణం" అంటే సిద్దాంతము, రాజకీయ కార్యక్రమము ఒకేలాగ వుండటం.ఇప్పటిలా అధికారం కోసం కప్పలతక్కెడలు,గోడదూకటాలు నిర్మాణాత్మక రాజకీయాలు కాదు.

సుందరయ్య స్వతంత్ర భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత. ప్రధాని నెహ్రు&మంత్రులుకు అనేక అంశాలలో సుందరయ్య ప్రసంగాలు దారిచూపాయి.సుందరయ్య మాట్లాడుతున్నప్పుడు నెహ్రు స్వయంగా నోట్సు రాసుకునేవారు. ప్రతిపక్ష నేతకు "మంత్రి" హోదా వుంటుంది(ఇప్పటికి కూడ). పార్లమెంటు ప్రతిపక్షనేతగా వుండి కూడ అన్ని సదుపాయాలను వదులుకోని బస్సులొ లేదా స్వయంగా సైకిల్ తొక్కుకుంటునో పార్లమెంటుకు వెళ్లేవారు. సైకిల్ మీద వెళ్ళటం గొప్పతానానికి సంబంధించిన లక్షణం కాదు, వ్యక్తిత్వం. సుందరయ్యగారి ఈవ్యక్తిత్వమే ప్రజలకు దగ్గర చేసింది. ఈవ్యక్తిత్వమే ఎదుటివారు చెప్పే విషయన్ని ఓపిగ్గా వినే లక్షణం తత్ ద్వారా వాటి పరిష్కారం కోసం పనిచేసే పద్దతి సుందరయ్య గారి సొంతం అయ్యింది.

సుందరయ్య ఓకసారి MPగా, మూడుసార్లు MLAగా పనిచేశారు. అయితే సుందరయ్య చేపట్టిన ఈపదవుల కన్నా ఆయన ప్రతిపాదనలు,చేపట్టిన పనులవలనే చనిపోయిన 32 సంవత్సరాల తరువాత కూడ ప్రజలు స్మరించుకుంటున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత చేపట్టవలసిన పనుల గురించి అనేక రచనలు చేశారు. ఇప్పుడు చెప్పుకుంటున్న నదుల అనుసంధానం గురించి 50వ దశకంలోనే సుందరయ్యగారు ప్రతిపాదించారు. "ఆంధ్రప్రదేశులొ సమగ్ర నీటిపారుదల" అన్న పుస్తకంతో అనేక ప్రాజెక్టులు, నదుల అనుసంధానం గురించి రాశారు. సాయుద తెలంగాణా రైతాంగ పోరాట నిర్మాత సుందరయ్య.4,5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో వుంటు దళాలకు మార్గదర్శకత్వం చేశాడు.

తెలంగాణా సాయుధపోరాటం తరువాత ఆఉద్యమ అనుభవాలను "వీర తెలంగాణ విప్లవ పోరటం గుణపాఠాల" పేరుతో పుస్థకం రాశారు. సుందరయ్యగారి ఎంత వాస్తవికమో ఇలాంటి పుస్తకాలు తెలియచేస్తాయి. తెలంగాణ సాయుధపోరాటంలో కాని,ఎమర్జెన్సి రోజుల్లో కాని కామ్రేడ్స్ & వారి కుటుంబల పట్ల సుందరయ్య చాల జాగర్తలు తీసుకునేవారు. కొండపల్లి కోటేశ్వరమ్మగారు(సీతారమయ్యగారి భార్య) రాసిన "నిర్జన వారధి" పుస్తకంలొ సుందరయ్యది ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వమో తెలియచేసే సంఘటనలు వివరించారు.

అజ్ఞాతంలో వున్న దళాలను,వారి కుటుంబ సభ్యులను సుందరయ్య గారు కలిసినప్పుడు...తను ముందుగా భోజనం చెయ్యకుండ గర్భిణిలు,పిల్లలకు భోజనం పెట్టి చివరలొ తను తినేవారు.కారణం నేను వచ్చానని ఈరోజు మంచి భోజనం వండివుంటారు,మీకు రోజు ఇలాంటి భోజనం దొరకదు కాదా?ముందు మీరు తినండి అని వారికి భోజనం పెట్టేవారంట సుందరయ్యగారు.దళాలన్న ఒకచోట వుండటం వలాన ఎదో ఒక భోజనం దొరికేది,నిత్య సంచారి అయిన సుందరయ్యలాంటి నాయకులకు గ్యారెంటి భోజనాలు తక్కువ.అది కామ్రేడ్స్ పట్ల సుందరయ్యగారి ప్రేమ,నాయకుడే త్యాగం చెయ్యలనే లక్షణం.

60,70 దశాబ్ధాలలో కమ్యునిస్ట్ పార్టీలలోకి డాక్టర్లు,లాయర్లు ప్రవాహంలాగ చేరారు.సుందరయ్యగారు డాక్టర్లను పార్టి full timersగా కాకుండ గ్రామాల్లో వైద్య సేవలు చెయ్యాలని ప్రోత్సహించారు. 1964లొ CPI నుంచి CPM విడిపొయినప్పుడు సుందరయ్యగారు CPM జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుందరయ్యగారి నాయకత్వంలొ CPM "Party Program" documentలొ పార్టి కార్యక్రమాన్ని వివరించారు,ఆ డాక్యుమెంట్ CPM రాజ్యాంగం. భారత దేశంలొ party programను రాసుకున్న ఏకైక పార్టి CPM..దానికి initiate సుందరయ్యగారు నేత్రుత్వం వహించారు.. సుందరయ్యగారి పోరటాం ఆయన సొంత ఊరు నెల్లూరు జిల్లా "అలగానిపాడు" నుంచే మొదలయ్యాయి. సుందరయ్య గారి వ్యక్తిగత జీవితం త్యాగాల నిలయం.చిన్న వయసులోనే కులాన్ని వదులుకున్నారు.తన చెల్లల్లను,ఇతర పిల్లలను హరిజనవాడలో వున్న స్కూల్లొ చదివించారు. అలగానిపాడులొని అంటరానితనాన్ని నిర్మూలించటానికి హరిజనవాడ బావిలోని నీటిని ఊర్లోని అన్ని బావులలో కలిపాడు.

ఆయన హాబిల్లొ చదవటం రాయటం ముఖ్యమైనవి. అలగానిపాడులో మొదటి గ్రంధాలయన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారి ఇల్లు కూడ స్మారక చిహ్నం అయ్యింది. ఆస్తి పంపకాల్లొ వచ్చిన తన వాటా మొత్తాన్ని పార్టికి ఇచ్చేసి,పార్టి ఇచ్చిన అలవెన్సుతో బతికారు.మాజి MP & MLAలకు ఇచ్చే పెన్షన్ కూడ పార్టికి ఇచ్చారు.

తాన జీవితం మొత్తం ప్రజలకోసం,పార్టీ కోసం పనిచేయలన్న లక్ష్యంతొ పెళ్ళి చేసుకోకుడదనుకున్నారు.అయితే కామ్రేడ్. లీలాగారు పట్టుదలతో ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరించారు. సుందరయ్యగారు & లీలాగారు మాట్లాడుకోని పిల్లలు పుట్టకుండ సుందరయ్యగారు ఆపరేషన్ చేయించు కున్నారు. సుందరయ్య & లీలమ్మ ఇద్దరు త్యాగజీవులు. సుందరయ్య &లీల గార్లకు పిల్లలు లేకుంటే ఏమి?నాలాంటి అనేక మంది వారసులు ... సుందరయ్య త్యాగం,సుందరయ్య దర్శనికత మనకు తెలియకుండనే ఎదో ఒకరూపంలొ మన జీవితం మీద ప్రభావం చూపుతుంది. సుందరయ్యగారి తమ్ముడు డాక్టర్.రామచంద్రారెడ్డి గారు కూడ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు. డాక్టర్.రాం గారు నేతాజితో పనిచేశారు.నేతాజి డాక్టర్.రాముకు రాసిన ఉత్తరాలు నెల్లూరు జిల్లా ఆఫీసులొ 2001లో చదివాను. CPM డాక్టర్.రాం పేరుతో "రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల"ను నెల్లూరులో నడుపుతున్నారు.

సుందరయ్యగారు 19-May-1985న విజయవాడలొ చనిపోయారు. సుందరయ్యగారు మేడే రోజున అంటే 01-May-1913న పుట్టారు. సుందరయ్య "Marxist in practice"...Marxism is not a dogma but a theory to be applied in practice,a guide to action సుందరయ్యను "కమ్యునిస్ట్ గాంధి" అనటం సమంజసం కాదు,అది కొందరు అత్యుత్సాహంతో రాసిన వాడుక.సుందరయ్య,గాంధి రెండు విభిన్న మార్గాలు.ఎవరి మార్గాల్లో వారు గొప్పవారు.

సుందరయ్య కమ్యునిష్ట్ కాకుంటే ఏమి అయ్యుండేవారని అడిగిన ప్రశ్నకు "ఈరోజు కాకుంటే రేపో,మరో రోజో సుందరయ్య కమ్యునిష్ట్ అయ్యి వుండేవాడు" అంతేకాని కొందరి రాసినట్లు కాంగ్రేస్ పార్టి ప్రధానకార్యదర్శో ,మంత్రో అయ్యేవాడు కాదు అని సుందరయ్యగారు సమాధానం ఇచ్చారు.

అనేక సినిమల్లో ఉదత్త రాజకీయనాయకుడి పాత్రకు "సుందరయ్య" అని వుండటం గమనించివుంటారు.నాకు ముఠామేస్త్రిలోని సోమయాజుల పాత్ర గుర్తింది,ఈమధ్య కూడ ఎదో సినిమాలో కూడ సుందరయ్య పేరు వాడారు. మాఇంట్లో వుండే ఏకైక రాజకీయ నాయకుడి ఫోటో "సుందరయ్య" గారిది.నాకు తొలి పాఠాలు చెప్పిన పుల్లయ్యగారు,Dr.శాస్త్రిగారు నాకు గురువులు.అందుకే నేను మిత్రులకు చెప్తుంటాను I am from Dr.Sastry school!

Originally written as a Facebok post by Siva Racharla