ప్రతిరోజు మన మదిలో దాదాపు 70,000 వేల ఆలోచనలు వస్తాయట వాటిలో కొన్నిమాత్రమే ఆచరణలోకి వస్తాయని ఒక రిసెర్చ్ చెబుతుంది. ఏ లక్ష్యమైన గాని దానిని కేవలం మనసులో అనుకున్న దాని కన్నా ఒక పేపర్ మీద రాసి ఉంచితే ఆ లక్ష్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందనంటారు. ఐ.పి.ఎస్ అధికారి ఆవుల రమేష్ రెడ్డి గారు కూడా అంతే రాసుకునేవారు ఐ.పి.ఎస్ కావాలని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విజేతల ఫోటోలను సేకరించి "మై మెమోరిస్ ఆఫ్ టోటల్ కమిట్ మెంట్" బుక్ తయారుచేసుకుని అందులో "నా జీవితంలో మరోసారి ప్రిలిమ్స్ రాయను ఇదే చివరిది" అని రాసుకున్నారట. మన మీద మనం తప్పకుండా ఒత్తిడి పెంచుకోవాలి లేదంటే వైరాగ్యంతో ఉన్నచోటే జీవితాంతం ఉండిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి ఆ ఒత్తిడి సంఘం నుండి వస్తుంది. ఒక హాస్టల్ వార్డెన్ కొడుకు ఐ.పి.ఎస్ అధికారిగా ఎదిగారంటే నిజంగా అది ఒక సక్సెస్ స్టోరినే..
రమేష్ రెడ్డి గారిది ప్రకాశం జిల్లా జాల్లపాలెం అనే చిన్న పల్లెటూరు. నాన్న తిరుపతి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వార్డెన్. పేద, మధ్య తరగతి కుటుంబాలలో పుట్టిన పిల్లలకు జ్ఞానమే ఆస్థి. మొదట డాక్టర్ అవ్వాలనుకుని ఎంసెట్ రాశారు 1,461 వ ర్యాంక్ వచ్చినా కాని ఎం.బి.బి.ఎస్ లో సీట్ రాలేదు, కాని బాపట్ల అగ్రికల్చర్ లో బీఎస్సీ లో సీటు మాత్రం లభించింది. ఒక్కోసారి మనం ఓడిపోయాం అని అనుకుంటాం కాని ప్రతి ఓటమి మనకో గొప్ప అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఎం.బి.బి.ఎస్ లో సీటు రాలేదని నిరాశపడ్డారు బీఎస్సీ చదువుతున్నప్పుడు అక్కడి వాతావరణం, అక్కడ ఎంతోమంది సివిల్స్ రాసిన చరిత్ర ఉండడంతో నెమ్మదిగా సివిల్స్ మీద మమకారం పెరిగింది.. కలలో భవిషత్తును ప్రభుత్వ అధికారిగా ఊహించుకున్నారు ఆ కలను చేరుకోవాలంటే ఓ వారధి కావాలి ఆ వారధే శ్రమ. అవును శ్రమ ఖచ్చితంగా తాను ఊహించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని బలంగా నమ్మారు. ఇక్కడా కాదు అని చెప్పి డిల్లీలో కోచింగ్ తీసుకున్నారు.
మొదటి సారి ప్రిలిమ్స్ లోనే ఓడిపోయారు. రెండోసారి ఇంటర్యూలో ఓడిపోయారు. మూడోసారి కూడా నిరాశే పలుకరించింది. మన భవిషత్తుకై మన కన్నా మన బంధువులు ఎక్కువ ఆరాటపడుతారు మనం ఓడిపోతున్నామా గెలుస్తున్నామా అని తెలుసుకుని కాలేక్షేపం సమయంలో ముచ్చడించుకోవడానికి అంతే కాని మన బాధలు ఏమాత్రం పంచుకోరు. కాని వారు కూడా మనల్ని భయంకరంగా మోటివేట్ చేస్తారు మనం పాజిటీవ్ ఆలోచిస్తే మనకు ఆ విషయం తెలిసిపోద్ది. ఈసారి పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. తన ఓటమికి ఏ ఒక్కటి కూడా కారణం కాకూడదని భావించారు. ముందు సమయాన్ని కాపాడుకోవాలి మిత్రులతో ఎక్కువ కలవకూడదు అని చెప్పి గుండు చేయించుకున్నారు. తర్వాత ఒకవేళ కలవాలనుకున్నా గుండు చేయించుకుంటే ఎవ్వరిని కలవలేమని. ఒత్తిడి తగ్గించుకోవడానికి క్రికెట్ ఆడేవారు, సెల్ ఫోన్ వాడడం పూర్తిగా మానేశారు, మంచి జ్ఞాపకశక్తిని భోజనం తీసుకున్నారు ఇలాంటి క్రమశిక్షణ కలిగిన ప్రణాళికతో నిరంతర శ్రమతో ఈసారి పరీక్షను ఎదుర్కున్నారు 54వ ర్యాంకుతో ఐ.పీ.ఎస్ గా అవతరించారు.
ఉన్నత స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన వారి కంటే అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగినవారికి అన్నిరకాల కష్టాలు భావోద్వేగాలు తెలుస్తాయి. రమేష్ రెడ్డి గారి జీవన ప్రయాణం ఆ దారుల నుండే జరిగింది కాబట్టే ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు. మొక్కలు నాటడం దగ్గరి నుండి పిల్లల చదువులకు ఆర్ధికంగా అండగా నిలబడడం వరకు అంతా తన ఉద్యోగంలో భాగంగానే నెరవేరుస్తున్నారు. జీవితంలో కష్టాలు రావడం ఒకరకంగా మన అదృష్టంమే కష్టంలో నేర్చుకున్న పాఠం, కష్టంలో పుట్టే కసి, పట్టుదల మనల్ని ఉన్నతులను చేస్తుంది అని మరొక్కసారి చెప్పడానికి రమేష్ రెడ్డి గారి జీవితం ఓ గొప్ప ఉదాహరణ.
Source: Achievers Stories