చల్ల గాలితో కలిసి వర్షం భూమిలో ఐక్యం అవుతుంటే మిరపకాయ బజ్జిలు తినాలని ఒకరు, లేదు ఐస్ క్రీమ్ తినాలని మరొకరు డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళ నెత్తి మీదున్న బుర్రలో ఏ దారి కనిపించకపోవడంతో, ఈ రెండిట్లో ఏదైతే బాగుంటుందని మూడో వ్యక్తిని అడిగారు. వర్షం పడుతున్నప్పుడు నాకివ్వేమి వద్దు అని ఆకాశం నుండి వయ్యారంగా భూమి మీదకు దుముకుతున్న వర్షంలోకి నడిచాడు. "ఈ ప్రపంచం గొప్ప హీరోలు కదిలిస్తుంటేనే ముందుకు వెళ్లడం లేదు. అసంఖ్యాకంగా ఉన్న నిజాయితీ పరులైన పనివాళ్ల. చిన్న చిన్న తోపుల ద్వారా కూడా" అని హెలెన్ కెల్లర్ ఒక మాటన్నారు.. దీన్నే మన జీవితానికి అన్వయించుకుంటే గొప్ప విజయాలు మనకు సంతోషాన్ని ఇస్తుందేమో గాని ఈ భూమి మీదకు వచ్చి ఉన్న అందాలను గమనించలేని కళ్ళు ఎందుకు.. మబ్బుల మధ్య చంద్రుడు తొంగి చూస్తున్నాడని గమనించన జన్మ, చెట్టుకొమ్మన విరగ్గాసిన జంపండును చిలుక కొరుకుతున్న సంఘటనలు.. మొదలైన సంఘటనలని చూడని జన్మ "సంపూర్ణమైన జన్మ" అని ఎలా చెప్పుకోగలం. ఇవ్వేమి మోటివేషనల్, ప్రేమ కవిత్వాలు కాదు.. ఇస్మాయిల్ గారు తన జీవితంలో చూసి రాసిన సంఘటనలు. ఊరికే అలా రాశారు.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
Designs By Madhav Sai Jaswanth
