General గా కొంతమంది B.Tech students ఏమనుకుంటారు అంటే కాలేజ్ డేస్ అనేవి గోల్డెన్ డేస్ అవి ఎన్నటికి తిరిగిరావు ఎంజాయ్ చేద్దాం మామ అనుకుంటారు.., ఇంకొంత మంది ఎంజాయ్ చేయకుండా ఎప్పుడు చదువు చదువు అంటూ లైఫ్ లో మెమరబుల్ డేస్ మిస్ చేసుకుంటారు కాని ఇప్పుడు మీరు తెలుసుకోబుతున్న స్టూడెంట్స్ మాత్రం అటు కాలేజిడేస్ ఎంజాయ్ చేస్తూనే చదువుకుంటు ఇటు ఒక కొత్తరకం కంపెనీని స్టార్ట్ చేసి ఆదాయం మాత్రమే కాకుండా ఎన్నో వేలమందికి కష్టం తగ్గిస్తున్నారు.
'ఇస్త్రీవాల' ఇప్పుడు ఈ పేరు విజయవాడ నగరం అంతా పాకేస్తుంది.. 'ఇంట్లో కాని Bachelor రూమ్ లో కాని బట్టలు ఉతకాలంటే మనం ఎంతో అవస్త పడుతుంటాం.. ఇంట్లో వాటర్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, టైం లేకుండా పనుల్లో బిజిగా ఉన్నప్పుడు, హెల్త్ బాలేనప్పుడు ఇలా చాలా సందర్భాలలో ఇబ్బందులు పడుతుంటాం అదికాక బయట లాండ్రీ షాపు వాళ్ళు అధిక ధర తీసుకుని నిర్లక్ష్యపు సమాధానాలు ఇలా చాలానే చుస్తుంటాం కాని ఈ ఇస్త్రీవాల మాత్రం మిగితా వారి కన్నా తక్కువ ధరకే అది కూడా ఫ్రీ హోం డెలవరి సర్వీస్ తో మనం కోరుకున్న సమయానికి బట్టలు ఉతికి ఐరెన్ చేసి మనకందిస్తారు. అనుకున్న సమయానికి అందించిడం వీరి మరో ప్రత్యేకత ఒక్కోసారి కొన్ని గంటల్లో ఇచ్చిన సంధర్భాలు చాలా ఉన్నాయి.
శ్రీరామ్ సురవరపు మరియు తన ఏడుగురు మిత్రులు శ్రీకాంత్, కైలాష్, సాయిరాం పట్నాయక్, అర్జున్, విశ్వేష్ వీరందరు ఒక టీం గా ఏర్పడి ఈ ఆన్ లైన్ లాండ్రీషాపును ప్రారంభించారు. ఈ సర్వీస్ ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్ లో అందుబాటులో ఉంది రాబోయే రోజుల్లో బెంగుళూర్, చెన్నై,ముంబాయ్, వైజాగ్, పూణే లాంటి దేశంలోని 20 ప్రధాన నగరాలకు విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
చదువు పూర్తచేసి ఒకటి రెండు సంవత్సరాలు ఏదో కోర్సుచేసి ఆ తర్వాత జాబ్ ల కోసం వెతికేరోజులు అనేవి పాత రోజులు.. చదువుకుంటూనే విజయవాడ కె.ఎల్ యూనివర్సిటీ విద్యార్ధులు ఈ ఇస్త్రీవాల ఆన్ లైన్ లాండ్రీషాప్ ను బి.టెక్ మూడవ సంవత్సరంలోనే(2015) ప్రారంభించారు.. ఇప్పుడు బి.టెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్న విద్యార్ధులు మరిన్ని స్టార్టప్ కంపెనీలతో దూసుకుపోవాలని ప్రయత్నిస్తున్నారు.' Check out there website here: www.isthriwala.com
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.