నేటితరం వ్యవసాయం చేసే తల్లిదండ్రులందరు చాలా వరకు వారి పిల్లలను వారిలా వ్యవసాయం చెయ్యాలని కోరుకోవడం లేదు.. ఎందుకంటే లాభాల మాట తర్వాత సంగతి పండించిన పంటకు కనీసం కనీస ధర కూడా రావడం లేదు, పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా రాకపోవడంతో పాపం వారు మాత్రం ఏం చెస్తారు లేండి.! దాదాపు ఇదే ఆలోచనలో ఉన్న ప్రదీప్ రెడ్డి తల్లిదండ్రులు కూడా తన కొడుకుని ఉన్నత చదువులు చదివించారు. ప్రదీప్ ది రామడుగు మండలం లక్షీపూర్ గ్రామం. ప్రదీప్ అర్హతకు తగ్గ ఉద్యోగం సింగపూర్ లో వచ్చింది. 9 సంవత్సరాలలో అతను నెలకు 4లక్షల జీతం అందుకుంటున్నాడు.. కాని ఇవ్వేమి ప్రదీప్ కు ఆనందాన్ని ఇవ్వడం లేదు ఎందుకంటే ప్రదీప్ కు చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ కాబట్టి.
చెప్పుకోడానికి సింగపూర్.. చేయడానికో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉన్నాకూడా అతని మనసంతా వ్యవసయం మీదే ఉంది. సింగపూర్ లోని స్థానిక పొలాలకు వెళ్ళడం అక్కడి రైతులతో మాట్లాడి మెళకువలు తెలుసుకోవడం, ఆన్ లోన్ లో వ్యవసాయం లో వస్తున్న ఆధునిక పరికరాలను, పద్ధతులు పరిశీలించేవారు. "జీవితం అంటే డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే కాదు తనకు నచ్చిన పనిచేస్తు డబ్బు సంపాదించడం అని ప్రదీప్ ఉద్దేశం." అలా తన జాబ్ నుండి స్వాతంత్ర్యం, స్వేచ్ఛ కావాలనుకున్నాడు.. "ఒకరి కింద ఎందుకు పనిచేయడం..? హాయిగా నాకు నచ్చే వ్యవసాయం చేయాలని నిశ్ఛయించుకున్నాడు." అలా ఆనందం ఇవ్వని 4 లక్షల ఉద్యోగం వదులుకుని పరిపూర్ణ సంతోషం ఇచ్చె రైతు ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు తన సొంత పొలంలో. సాధారణంగా ఇప్పుడున్న రైతులు ఎన్నో సంవత్సరాల నుండి తమ చిన్నతనం నుండి వ్యవసాయం చేస్తున్నారు వారికున్న అనుభవం ఎక్కువ కాని మన ప్రదీప్ కేమో ఆలోచన ఉంది కాని అనుభవం లేదు. అనుభవం లేకపోవడంతో ముందు కొన్ని తప్పటడుగులు వేసినా క్రమంగా తన దారిలో వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎవరైతే ప్రదీప్ ను చూసి "వ్యవసాయం నీకు చాతకాదు బాబు చక్కగా ఉద్యోగం చేసుకో" అని సూచనలు ఇచ్చినవారే ఇప్పుడు ప్రదీప్ రెడ్డి దగ్గర నుండి వ్యవసాయపు సూచనలు తీసుకుంటున్నారు.
కరీంనగర్ పట్టనానికి దగ్గరి ప్రాంతంలో ని మల్కపూర్ లో 7 ఎకరాలు వ్యవసాయ భూమి లీజుకు తీసుకోని అక్కడ కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. వీటి మూలంగా ఉద్యోగికి వచ్చినట్టుగా నెలకు ఇంత ఆదాయం అని ఆర్జించారు. ఒక్క కూరగాయలు మాత్రమే కాకుండా పండుగలను దృష్టిలో పెట్టుకుని పూల మొక్కలు నాటి అదే పొలంలో పూల ద్వారా కూడా ఆదాయం సంపాదించారు. మిగిలిన రైతుల కన్నా ప్రదీప్ ఎక్కువ సంపాదించడం వెనుక ఒక మంచి ఆలోచన ఉంది తన పంటను దళారికి అమ్మడం కన్నా నేరుగా వినియోగదారునికే అమ్మడం వల్ల అదనపు ఆదాయం పొందుతున్నాడు. ఈ రకం పద్ధతి వల్ల అటు వినియోగదారుడు ఇటు పండించిన రైతు లాభపడేలా సాగుతుంది. కరీంనగర్ SRR College దగ్గర తన సొంత కారులో కూరగాయలు తీసుకెళ్తు అక్కడ నేరుగా వినయోగదారులకు తాజా కూరగాయలను మార్కెట్ రేట్ కన్నా తక్కువ ధరకే అమ్ముతుంటున్నారు.
సాధారణంగా బాగా చదువుకున్న రైతులు Pesticides లో ఏది Best అని కనుక్కుని ఆ మందులు వాడతారు కాని మన ప్రదీప్ మాత్రం సాధ్యమైనంత వరకు మిగిలిన వారికన్నా చాలా తక్కువ స్థాయిలో పురుగుల మందులను వినియోగిస్తున్నారు ప్రస్తుతానికి కొంత మొత్తంలో వాడుతున్నా రానున్న రోజుల్లో కేవలం సేంద్రీయ ఎరువులు వాడుతు వ్యవసాయం(Organic Farming) చేయాలని ఆ రకంగా ముందుకు సాగుతున్నారు. ప్రదీప్ వ్యవసాయ రంగంలో సమూల మార్పులు చెయ్యాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం ఎన్నో Startups వస్తున్నాయి కాని అవన్నీ Technical పరంగానే ఉంటున్నాయి.. Agri Startups కూడా మరిన్ని రావాలని విద్యార్ధులు కూడా ఈ రంగంలోంకి రావాలని ప్రదీప్ ఆశిస్తున్నారు.., తనలా లక్షల్లో ఆదాయం అందుకోవాలని కోరుకుంటున్నారు. ప్రదీప్ కుడా Agri Startups మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు..
Article Info Source: Hmtv
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.