జగదీశ్వర్ రెడ్డి గారు తన కెరీర్ లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు.. "ఉత్తమమైన సీ.ఎం గ్యాలెంట్రీ అవార్డ్, ఇండియన్ పోలీస్ మెడల్, అంతరిక్ష సువర్ణ మెడల్, కఠిన సేవా పథకం, పోలీసు ఉత్తమ సేవ, ఇవి మాత్రమే కాదు.. 200కు పైగా వివిధ కేసుల ఛేదనలో అందుకున్న అవార్డులు, రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ ఉన్నతాధికారుల నుండి గౌరవప్రదమైన ప్రశంస పత్రాలు, దేశ అత్యుత్తమ ఇన్వెస్టిగేషన్ సంస్థ సిబిఐ నుండి అవార్డు ఇంకా మరెన్నో .. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై అవినీతి నిరోధక శాఖ దాడి చేస్తే ఆ ఊరిలో పొలాలు, ఇంత బ్యాంక్ బాలెన్స్, ఇన్ని పెట్టుబడులు, కేజీల బంగారం అంటూ వెలుగులోకి వస్తాయి కాని ఒక నిజాయితీ గల ఆఫీసర్ గురించి ఎంక్వేరి చేస్తే ఇలాంటి ట్రాక్ రికార్డ్స్ యే బయటపడతాయి..
జగదీశ్వర్ రెడ్డి గారిది నల్గొండ జిల్లాలోని చెరువుగట్టు స్వస్థలం. నాన్న టీచర్ అవ్వడంతో చిన్నతనం నుండి చదువు పట్ల, కెరీర్ పట్ల ఓ నిర్ధిష్టమైన అవగాహన ఉండేది. అలా ఎంఏ ఆర్కియాలజి, ఎంబిఏ చదివారు. ఆ తర్వాత పోలీస్ అవ్వాలని కలలు కన్నా గాని ఒక్కడే కొడుకు అవ్వడంతో అమ్మ ఒప్పుకోలేదు. ప్రతి అమ్మకు ఇలాంటి భయం తప్పక ఉంటుంది అని భావించి నా ఇంటి కన్నా దేశానికి నా అవసరం ఎంతో ఉందని వెనుకడుగు వేయకుండా1993లో సబ్ ఇన్స్ పెక్టర్ పరీక్షలు రాశారు గెలిచారు. ఉద్యోగం వచ్చేసింది ఇక ఏముంది ప్రజలను భయపెట్టో, బ్లాక్ మేయిల్ చేసో డబ్బులు సంపాదించుదామనే నీచపు మనస్తత్వం జగదీశ్వర్ రెడ్డి గారిది కాదు కాబట్టి ఒక పక్క సిటీలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూనే మరో పక్క ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం, సైబర్ లా లను తన క్వాలిఫికేషన్ లో భాగం చేసుకున్నారు.
ట్రాక్ రికార్డ్: 1. 'Winners don't do different things. They do things differently,' అని ఓ గొప్ప రచయిత అన్నట్టు జగదీశ్వర్ గారు సమస్యల పరిష్కరాలలో తనదైన స్టైల్ లో డిఫ్రెంట్ గా ఉండేది. ఒకసారి ఫాక్షనిస్టులు ఎక్కువగా ఉండే ఊరికి పోస్టింగ్ వచ్చింది. రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు ఒకరి మీద కేసులు పెట్టకుండా ఇద్దరి కుటుంబాలను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఏళ్ళ తరబడి ఉన్న సమస్యలను, పగను ఓ స్వీట్ వార్నింగ్ తో తీర్చేశారు.
2. ఇద్దరి మహిళలపై శంషాబాద్ ఫామ్ హౌజ్ లో దోపిడి దొంగలు లైంగిక దాడి జరుపుతున్నారు. అప్పుడు ఎస్.ఐ గా ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడికి చేరుకుని లొంగిపోవాలని వారిని హెచ్చరించారు. కాని అటునుండి ఏ స్పందన లేకపోగా దొంగలు తల్వార్లతో దాడికి దిగారు. పోలీస్ మీదనే ఇలాంటి దాడికి దిగితే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు అని జగదీశ్వర్ గారు నేరుగా కాల్పులు జరిపి దొంగలను హతమార్చారు. దేశవ్యాప్తంగా ఈ కేస్ సంచలనం సృష్టించింది.
3. రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ఫామ్ హౌజులుంటాయి. ఆ సంఖ్య స్థాయిలోనే నేరాల సంఖ్యలు కూడా అధికంగానే ఉండేవి. ఇక తట్టుకోలేక "మమ్మల్ని ఆదుకోండి అంటు భాదితులు పోలీసుల కాళ్ళపై పడ్డారు". సిగ్గు విడిచి కాళ్ళమీద పడ్డారాంటే పరిస్థితి ఎంత తీవ్రంగ ఉందో తెలుసుకుని 1999లో నేరస్థులపై నేరుగా కాల్పులు జరిపి శాంతిని స్థాపించారు.
4. కుక్కల రాజు బస్ దోపిడిలకు పెట్టింది పేరు. రాత్రి సమయాలలో ప్రయాణం చేసే ప్రయాణికులపై దాడి చేస్తూ భయపెడుతూ వారి దగ్గరున్న విలువైన బంగారు నగలను డబ్బులను దోచుకునేవాడు. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరిగినా గాని అతనిని పట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉండేది జగదీశ్వర్ రెడ్డి గారు చాకచక్యంగా వ్యవహరించి అతడిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. కాని పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో ఎన్ కౌంటర్ లో చనిపోయాడు.
ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు 20సంవత్సరాలకు పైగా సర్వీస్ లో ఎంతోమందిని అదుపులోకి తీసుకున్నారు. వేల కేసులను సమయస్పూర్తితో సులభంగా పరిష్కరించారు. ట్రాక్ రికార్డ్ అంటే ఉద్యోగ పరంగా మాత్రమే కాదు సేవా కార్యక్రమంలో కూడా విస్తృతంగా పాల్గొంటారు. కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివించడంతోపాటు వీలున్నప్పుడల్లా వివిధ రూపాలలో సమాజానికి తన సహాయం అందజేస్తుంటారు. ఎస్.ఐ నుండి డి.ఎస్పి, ఓసిడి ఆఫీసర్ గా సాగుతున్న ఆయన ప్రస్తానంలో శాంతి భద్రతల స్థాపన మాత్రమే కాదు ఒక పోలీస్ నేరస్థుల పట్ల ప్రజల పట్ల ఎలా ఉండాలి అని తన జీవితాన్నే ఒక ఉదాహరణ గా మలుస్తున్నారు.