Jaanu cinema chusevaallalo, Lead pair performance kosam vellevaaru oka rakam, Aa experience kosam inkosari vellevaallu oka rakam, Assalu 96 cinema ni chudakunda vellina vaaru oka rakam, nenu moodo rakam anukuntunnaremo naalugo rakam. Cinema lo S.Janaki gaari paatalu evevi pettaro chudataaniki vella. S.Janaki gaari gonthu aame paatalaki evaru fan kaaru cheppandi. Koyila swaram aamedi. Aame gonthu nundi telugu padaalu, tene addukunnattu palukutaayi. Melody tho manalni maimaripinchagalaru, Patho kantatadi teppinchagalaru. Jaanu movie valla aame paadina konni manchi paatalani marokkasari gurthocchela chesaayi. Ee movie aa songs placement kuda aa particular scene ni portray chese vidhanga pettaru. Let's check them out.
1. జిలిబిలి పలుకుల - సితార ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ వినువీడి వెన్నల్లో రాగంలా ఆశల ముంగిటా ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా రామ జీవితం ఎన్ని ఉరుములున్న, మెరుపుళ్లున్న వాటి మధ్యలో కూడా కనిపించే స్పష్టమైన జ్ఞాపకం జాను. ఎన్నో ఆశలు ఎన్నో ఊహలు జాను గురించి కలగన్న రాముకి, జాను తోడుగా ఉందా?
2. తొలిసారి - శ్రీవారికి ప్రేమలేఖ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. జాను గురించి తలుచుకున్నప్పుడు వచ్చే పాట ఇది.
3. చిన్ని చిన్ని కోరికలే - మౌనరాగం చిన్ని చిన్ని కోరికలే కోరి కోరి కుసేనమ్మ మొదటిసారి జాను ని తలుచుకుంటే స్నేహం కన్నా మించిన భావన కలిగిన క్షణాలు అవి. ఎప్పుడు జాను ని చూస్తా అనే కోరిక రాము లో మొదలయ్యే క్షణాలు అవే.
4. ఆకాశంలో ఆశల హరివిల్లు - స్వర్ణకమలం మబ్బుల్లో తూలుతున్న మెరుపాయిపోనా వయ్యారి వాన జల్లై దిగిరానా సంద్రంలో పొంగుతున్న అలనైపోనా సందెల్లో రంగులెన్నో చిలికేనా ప్రేమించే ప్రతి ప్రేమికుడి ఊహల్లో, ప్రేయసి ఒక మెరుపు, వాన జల్లు. అల, నల్లగా మారే సంధ్యవేళల్లో కూడా తాను ఎన్నో రంగులని నింపుతుంది.
5. జాబిల్లికోసం ఆకాశమల్లే - మూగమంచిమనసులు నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనుస్సక్కడ ఎన్నాళ్ళైనా నీ ఊసులనే నా ఆశలుగా నా ఊహలనే నీ బాసలుగా అనుకొంటిని కలకంటిని నీ వేరిగా ఈ నాలుగు లైన్స్, రాము, జాను జీవితాన్ని క్లుప్తంగా చెప్పేస్తాయి.
6. మనసా తుళ్లిపడకే - శ్రీవారికి ప్రేమలేఖ ఏ నోము నోచావు నీవనీ దొరికేను ఆ ప్రేమఫలము ఏ దేవుడిస్తాడు నీకనీ అరుదైన అంత వరము మనసా వినవే మహ అందగాడు కనుకా జతగా మనకందిరాడు కలలాపవే కన్నె మనసా ఇద్దరు ప్రేమించుకున్నారు కానీ, కలవలేకపోయారు. చాలా రోజుల తరువాత కలిసాక, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ వాస్తవికత ని గుర్తుచేసే పాట ఇది.
Aa particular scene ki taggattu already unna song ni lyric ni match cheyadam really awesome. O sari aa lyrics ni scene ki match chesthu chudandi meeke arthamavthundi. Chance vachindi kabatti, Me favorite S.Janaki song ni mention cheyandi mari.
ఈ సినిమా లో జాను పాడిన అన్ని పాటలు ఎస్.జానకి గారు పాడినదే కానీ, "యమునా తటిలో" పాటను స్వర్ణలత గారు పాడారు, రామ చంద్ర అడిగేంత వరకు ఎస్.జానకి పాడిన పాట తప్ప ఇంకేదీ పాడదు.