మందు తాగే అంత level లేదు, తందనానా అని ఊగడాలు లేవు మా బ్రతుకు లో., అందుకే సందులో ఉన్న curry ని పార్సెల్ చేయించుకొచ్చి, పక్కమేడమీద bachelors తాగిన మైకం లో ఒకరినొకరు తిట్టుకుంటున్న మాటలు విని మేము నవ్వుకుంటూ, రూమ్ లో వండుకున్న rice ని ప్లేట్ లోకి వడ్డించుకుంటూ deep thought లోకి వెళిపోయాడు మా బావ. Job Searching పని మీద నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు తోడుగా ఆ search లో వీడూ తోడున్నాడు. నేను వాడినీ, వాడు ఏం ఆలోచిస్తున్నాడబ్బా ఇంకా curry open చెయ్యకుండా అని అనుకుంటూ తారలతో మెరిసిపోతున్న ఆ ఆకాశాన్ని చూడసాగాను. ఇంతలో......
బావ-1 : అరే బావా నువ్వు చదివావా మన దేశంలోనే యువత బలం ఎక్కువ ఉంది అంట. సకం పైగా ఉన్న జనాభా యువత ఏ అంట బావా.
బావ -2 : అదేంట్రా ఈ ముక్క నీకు ఇప్పటిదాకా తెలీదా ?
(కుక్కర్ లో rice వడ్డించుకుంటూ......)
బావ-1 : లేదు రా, నేను కనీసం ఇందులో కూడా weak ఏ రా ........ ఏం చేస్తాం, మన బతుకులు అలా అయిపోయాయి.
బావ -2 : మన దేశం లో ఉన్న యువత అంత మంది అన్నది నిజమే, కానీ ఎంతమంది వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు ? ఎవడి dreams ఆడికి valuable గానే ఉంటాయి బా..... కానీ ఏం లాభం ? Petrol valuable ఐనా, దాన్ని గాలి లో ఉంచితే ఆవిరైపోతుంది కదా కాసేపటికి....
(Curry వేసాడు, నేను వెళ్లి మాగాయ్ డబ్బా తీస్కొని వచ్చి తెచ్చిన పప్పు లో వేసుకుంటున్నా .... )
బావ -1: నిజమే బా , బాగా చెప్పావ్! 8th లో అనుకుంటా, నేను ఇస్రో వాళ్ళు పంపే రాకెట్స్ పేపర్ లో చదివి , నేనూ ఇలా ఇస్రో లో సైంటిస్ట్ అవుతా అని అనుకునేవాడిని.
బావ -2 : నేను Badminton player ని అవ్వాలని అనుకునేవాడిని. కానీ ఆశలు అన్నీ ఆవిరైపోయాయి బా. ఇంకేం చేస్తాం , PV. Sindhu మ్యాచ్ TV లో చూడటం తప్ప!
(Rice సరిగ్గా ఉడకలేదు అనుకుంటా..... గట్టిగా ఉన్నట్టు అనిపించింది .... )
బావ-1 : దీనికి కారణం ఎవరంటావ్ ? మనకి మనమే కష్టపడాలి బా.... మనకోసం ఆగేవాడు ఎవడూ లేదు ఈ లోకం లో
బావ -2 : మనం ఇలా jobless అయ్యి , jobs కోసం కుక్కల్లా తిరిగే పరిస్థితి కి కారణం మన society ఏ.
(పక్కనున్న Water Packets లో water తాగుతూ ....... )
బావ -1: అదెలా బా ? మన parents ఏ కారణం అని నేను అనుకుంటున్నా.
బావ -2 : అమ్మా నాకు ఇందులో interest ఉంది, నాకు ఇది నేర్పించండి అని అంటాం బా , కొందరు పేరెంట్స్ అసలు ఇలాంటివి పట్టించుకోరు, కొందరు అయ్యో పోన్లే అని నేర్పిస్తారు. కానీ చివరికి అంతా బొంబాయి అవ్వుద్ది .
(భోజనం లో రుచి తెలియట్లేదు ....)
బావ-1 : బొంబాయి అవ్వడానికి కారణం మనకున్న education బావ . తొక్కలో education బావ మనకి ఉన్నాది. అసలు ఎంత percentage స్టూడెంట్స్ btech చదువుతన్నారో , ఎంతమందికి జాబ్ లు వస్తున్నాయో అని మన Government అంచనా వేసివుంటే ఎప్పుడూ బాగుపడుదుము .
బావ -2 : అంతేగా మరి . మనం ఏ games , special talents ఉన్నా టెన్త్ కి వచ్చేసరికి మనం మంచిగా చదివి ఇంటర్లో MPC తీసుకోవాలి. ఇంటర్ తో ఆగిపోరు బావా వీళ్ళు. ఇంటర్ లో మనం realize అయ్యేలోపే , కొందరు IIT కి , కొందరు వేరే పెద్ద పెద్ద colleges కి వెళ్ళిపోతారు. మన పరిస్థితి ఏంటంటే, అటు IIT లు దేఖలేక , ఇటు Eamcet దేఖలేక, ఎదో phone number ర్యాంక్ కి ప్రైవేట్ వాటిలో జాయిన్ అవుతాం . ఇంక చుస్కో బా ..... మొత్తం గబ్బు గబ్బు అయ్యిది బతుకు. స్కూల్ లో మనకి ఇవేం interest ఓ తెల్సుకొని , వాటిలో మనల్ని తోపులు గా తయారుచేస్తే , చైనా ఒక్క సంవత్సరం గెలిచే Gold medals లో మనం దానికి double గెలుస్తాం.
(Plate లో ఉన్న సకం కూడా తినలేకపోయా ........ )
బావ-1 : అంతే బా , ముమ్మాటికీ నిజమ్, ఆరోజు ఆలా చేసుంటే ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు.
బావ -2 : Problem ఎక్కడుంది అంటే బా, మన parents కి ఒక రకం గా అదేదో ఫీలింగుతో కూడిన భయం. సినిమాలన్నా , games అన్నా, Computer అన్నా , ఫోన్లు అన్నా వాళ్ళకి అదేదో ఫీలింగ్ . అదేంటో మనకి ఇప్పటికీ అర్థంకాదు. సినిమాల్లోకి వెళ్తే పాడైపోతారని, గేమ్స్ ఆడితే చదువు side ట్రాక్ వెళ్ళిపోద్ది అని, అదేదో ఫీలింగ్. ఆ feeling కూడా సొసైటీ లో ప్రతీ అడ్డమైన వాడు ఇచ్చే ఉచిత సలహాల వల్ల . అది మీడియా కావచ్చు, newspaper లు కావచ్చు, లేదా సాయంత్రం పూట ఇంట్లో ఎం చెయ్యాలో తెలీక earphones పెట్టుకొని వేరుశెనక్కాయలు కొనుక్కొని ఉచిత సలహాలు ఇచ్చే వాడు కావచ్చు. వెళ్ళందర్నీ చూసి వాళ్ళు కూడా అలాగే stereotype అయిపోతారు. అలా అవ్వని వాళ్ళు ఏ సచిన్, సింధు, ద్రావిడ్ లాంటి parents మాత్రమే ఏమో. ఆరోజు మనకి అలా మనకి నచ్చిన దానిమీద మన focus పెట్టమని అని ఉంటే మనం వేరేలా ఉండేవాళ్ళం బా.
బావ-1 : నువ్వు చెప్పిన మాటలు వింటుంటే ముద్ద దిగట్లేదు బా......... నా లోపలున్న బాధని నీ నోటి ద్వారా చెప్తున్నావ్ .
బావ -2 : హా ఉంటది ఉంటది ఎందుకు ఉండదు. మన లక్ష్యం ఎప్పుడూ, ఇంటర్ మీద ఆశ తో టెన్త్ చదవడం, btech మీద ఆశ తో ఇంటర్ లో MPC చదవటం, తర్వాత software job చెయ్యడం. ఇందుకే గా మనం భూమి మీద పుట్టింది.
(చేయి కడిగేసుకున్నాక, అక్కడనుంచి లేచి పక్కనే వేసుకున్న బెడ్ మీద చారబడి ........ )
నాకు ఇంక సీన్ అర్ధమయిపోయింది బా ..... మనమే ఒక కంపెనీ పెట్టేద్దాం. ఒక్కొక్కడికీ సమాధానం చెపుదాం....
చెపుదాం ..... చెపుదాం ..... చెపుదాం ..... చెపుదాం ....... చెపుదాం ........
బావ : రేయ్ ఇందిరా అలా కలవరిస్తున్నావ్ , లే నీయబ్బ లే ! అని ఎవడో పక్కనుంచి తన్నినట్టు అనిపించింది.
కళ్ళు తెరిచి చుస్తే ఎండ దారుణం గా తగులుతుంది , ఇంతలో .......
"ఏంది రా అరగంట నుంచి ఏదేదో వాగుతున్నావ్, టైం అవుతుంది, లేచి ఫ్రెష్ అవ్వు, ఈరోజు రెండు companies కి వెళ్ళాలి." అని మా బావ బ్రష్ చేస్తూ అంటున్న అర్థంకాని మాటలు విని లేచా..