Contributed by N.V. Chaitanya Sai
మర్చి 23,
అజయ్ నాకు చివరగా ఫోన్ చేసిన రోజు. ఆ రోజు కూడా ఎప్పటిలాగానే ఆనందంగా నవ్వుతూ, నన్ను నవ్విస్తూ...మాట్లాడాడు. కానీ... ఆ తరువాత రోజు నుండి నాకు కాల్ రావడం ఆగిపోయింది. రోజుకు కనీసం 10 సార్లు మెసేజ్ చేసే అజయ్ దగ్గరి నుండి, ఆ రోజు నుండి ఒక్కటంటే ఒక్క మెసేజ్ కూడా రాలేదు నాకు. సరిగ్గా సంవత్సరం క్రితం ఆన్లైన్లో (online) పరిచయం అయ్యాడు. ఒక మనిషిని చూడకుండా... కలవకుండా మనసుకు దగ్గర అవ్వచ్చని తెలియదు నాకు, అజయ్ ని కలిసే దాకా. తన మాటలతోనే నా రోజు మొదలయ్యేది, ముగిసేది కూడా. అలాంటిది ఇప్పుడు నాకు ఆ మాటలే దూరం అయ్యాయి.
అజయ్ ఫోన్ చెయ్యడం ఆపేసిన రెండు వారాల తరువాత...
నా ఫ్రెండ్స్: అభి నువ్వు ఎం బాధపడకు, ఏదో ఇంపార్టెంట్ వర్కు లో ఉండి ఉంటాడు. అందుకే చేసి ఉండదు ... కొద్ది రోజులు ఆగు మళ్ళీ అజయ్ నే కాల్ చేస్తాడు. అంతా మామూలు అయిపోతుంది.
మూడు నెలల తరువాత.... నా ఫ్రెండ్స్: ఇంకెన్ని రోజులు ఇలానే బాధపడుతుంటావు అభి. నీకు ముందు నుంచే చెప్తూ ఉన్నాము...జాగ్రత్త అని. నువ్వు మా మాట వినలేదు. నేను;- అది కాదే... ఎప్పుడూ సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే వాడు, ఇప్పుడు అసలు ఆన్లైన్ లో కాదు కదా...అసలు facebook, WhatsApp, Insta లలో అకౌంట్స్ కూడా చూపించట్లేదు.
ఫ్రెండ్స్:- అభి , నువ్వు అసలు ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇప్పట్లో social మీడియా లో ఎలా ఉంటున్నారో తెలియదా నీకు. ఎవరో randaom గా ఒక అమ్మాయికి మెసేజ్ చెయ్యడం, మంచిగా మాట్లాడితే...ఫ్రెండ్షిప్ అని, love అని వాళ్ళతో timepass చెయ్యడం చాలా మామూలు విషయం అయిపోయింది.
ఇంకొకర్తి ఎవరో తగిలి ఉంటుంది, నువ్వు బోర్ కొట్టేశావు...అందుకే నిన్ను అన్నిట్లో బ్లాక్ చేసి, దాన్ని తగుల్కొని ఉంటాడు. నువ్వు నమ్మినా, నమ్మకున్నా ఇదే నిజం. Move on అవుతావో...ఇలాగే జీవితమంతా ఏడుస్తూ...ఉంటావో నీ ఇష్టం.
నా ఫ్రెండ్స్ కి అర్థమైంది నా సిట్యుయేషన్. నాకు కూడా అర్థమైంది. అజయ్ నన్ను మోసం చేసి, వదిలేసి వెళ్లిపోయాడని. కానీ ఇన్ని రోజులు అజయ్, చూపిన ప్రేమ, చెప్పిన మాటలు అన్నీ అబద్ధం అని నా మనస్సు అంగీకరించట్లేదు. నేను అది ఆక్సెప్ట్ చెప్పాయలేక ఉన్నా.
"నువ్వు చూపిన ప్రేమ అబద్దమా, నువ్వు వదిలి వెళ్ళింది అబద్దమా" అని కాలర్ పట్టుకొని అడగాలని ఉంది. మర్చిపోదాం అనుకున్నా... "తను నన్ను కారణాలతో...కాదు, సమాధానం దొరకని ప్రశ్నలతో, వదిలేసి వెళ్ళాడు"!!
నాకు వినయ్ తో పెళ్ళి అయిన సంవత్సరం తరువాత... నేను చాలా సంతోషంగా ఉన్న, అజయ్ అసలు గుర్తుకు రావట్లేదు.
ఆదివారం, వినయ్ కి ఏ పని లేదు. తను దాచుకున్న జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి చూడాలని అనుకున్నాడు.
"నాకు గేమ్స్ లో వచ్చిన 1 ప్రైజ్, నేను నా ఫస్ట్ సాలరీ తో కొన్న watch,"
ఇలా ఎన్నో నాకు చూపిస్తూ...ఆనంద పడుతున్నాడు. అలానే ఒక ఫోటో ఆల్బమ్ కూడా తీశాడు. అందులో ఒక్కో ఫోటోని చూపిస్తూ, అప్పుడు జరిగిన విషయాలు అన్ని చెప్తున్నాడు.
ఒక్క ఫోటో దగ్గర వినయ్ ఆగిపోయాడు, ఏంటా అని నేను చూసాను ...అందులో వినయ్ ప్రక్కన ఉన్నది "అజయ్".
ఒక్క క్షణంలో పాత విషయాలు అన్ని గుర్తుకువచ్చి, నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. చెమటలు పడుతున్నాయి. వెంటనే అక్కడి నుండి వచ్చేసాను.
వినయ్:- అభి, ఏంటి అలా మధ్యలో వచ్చేశావు. నేను:- ఏం లేదు. (కొద్ది నిమిషాల మౌనం తరువాత) వినయ్, ఎందుకు ఆ ఫోటోని చూస్తూ అలానే ఆగిపోయావు. ఎవరతను?? వినయ్:- వాడు , నా బెస్ట్ ఫ్రెండ్. అభి:- మరి పెళ్లికి రాలేదు?? వినయ్:- రాలేదు కాదు, రాలేడు. అవును, వాడికి ఒక 2 సం. క్రితం ఆన్లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆమెని చాలా అంటే చాలా ఇష్టపడ్డాడు. ఎప్పుడు ఫోన్ చేసిన తన గురించే చెప్పేవాడు. కానీ నేను ఎప్పుడు ఆ అమ్మాయిని చూడలేదు. వాడు, ఆ అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వడానికి, తనకి చెప్పకుండా...తనని కలవాలని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏక్సిడెంట్ అయి...చనిపోయాడు. నేను ఆ అమ్మాయి కి ఈ విషయం చెప్పాలని చాలా try చేసా...కానీ ఆ అమ్మాయి ఎవరో తేలిక చెప్పలేక పోయా. నేనే, వాడి సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని delete చేసేసా. తనకి ఈ విషయం తెలుసో తెలియదో, అసలు వాడి గురించి ఏమనుకుంటుందో తలచుకుంటేనే బాధ గా ఉంది.
అంతే.... నా కంట్లో నుండి, కన్నీరు కారిపోతున్నాయి. వెంటనే నా బెడ్రూంలో కి వెళ్ళిపోయి.. చిన్న పిల్లలా ఏడ్చాను. ఆ కన్నీరు, బాధ వల్లనా....లేదా, నేను ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని అపార్థం చేసుకున్నందుకా...?? నాకు అజయ్ గురించి పూర్తిగా తెలిసినా...నా ఫ్రెండ్స్ అలా చెప్పడం వల్ల, అజయ్ ని అపార్థం చేసుకున్నాను. "నిజాలకు, అభిప్రాయాలకు చాలా చిన్న తేడా ఉంటుంది. మనుషులం కదా... మోసపోతూ ఉంటాం, అప్పుడప్పుడు".