ఒక చావు మనల్ని ఎంతో బాధపెడుతుంది.. మరల వారిని చూడలేమని, మరల వారి ఆత్మీయతను అనుభవించలేమని. ఫొటోస్, పేయింటిగ్స్ లో ఉన్నా గాని ఇంకా వారిని మనస్పూర్తిగా దర్శించలేక పోతున్నామనే భావన విగ్రహాం ద్వారా పోతుంది. ఒక వ్యక్తి నిండైన రూపం, అతని Body Language విగ్రహాంలో చూసుకోవచ్చు. గొప్ప నాయకులు, సామాన్యులు ప్రతిమ రూపంలో ఆయన చేతిలో మళ్ళి పుడతారు. ప్రస్తుతం ఇలాంటి ప్రతిమలను తయారుచేసేవారు బహుశా చాలామందే ఉండొచ్చు. ఆ ఉన్నశిల్పులలో విగ్రహాంలో ప్రాణం తీసుకువచ్చే వారిలో మన శిల్పి 'రాజ్ కుమార్ వడియార్' గారు అగ్రగణ్యులు అనే చెప్పాలి.
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో నివాసముంటున్న రాజ్ కుమార్ గారు తన తండ్రి గొప్ప శిల్పి ఐన ఆచార్య శ్రీనాధ రత్న వడయార్ గారి నుండి వారసత్వంగా ఈ వృత్తిని స్వీకరించారు. చిన్నతనం నుండే ప్రతిమలు సృష్టిస్తున్న రాజ్ కుమార్ గారు ఇప్పటికి దేశ, విదేశి నాయకులు, గొప్ప వ్యక్తులు, కళాకారులు, నటులు, సామాన్యుల ప్రతిమలు, దేవుని ప్రతిమలతో కలిపి దాదాపు 2000కు పైగా విగ్రహాలను తయారుచేశారు. సామాన్యుల విగ్రహాలతో పాటు మాజీ ముఖ్యమంత్రులు ఎన్.టి.ఆర్, వై.ఎస్.ఆర్, జయలలిత, ఎం.జి.ఆర్ ఇలాంటి గొప్ప అభిమానం ఉన్న నాయకుల విగ్రహాలు ఆయన సృష్టిలో ప్రాణం ఉన్నవారిలా సహజంగా కనిపిస్తాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు మన దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ విగ్రహాలు కావాలంటే కేరాఫ్ అడ్రస్ మన రాజ్ కుమార్ గారే. అత్యుత్తమ విగ్రహాలంటే రోడ్డు కూడలి మధ్య, పార్కుల వద్దనే కాదు సాక్షాత్తు వారి అధికారిక పార్టీ ఆఫీసులలో ప్రతిష్టించే విగ్రహాలను తయారుచేసేంతటి స్థాయి వారిది.
జాతీయ, అంతర్జాతీయ వేదికల నుండి ఎన్నో అవార్డులను, ప్రశంసలను అందుకున్న వారి ప్రతిభకు కొన్ని మచ్చు తునకలు...
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.