కే.విశ్వనాధ్ గారు సినిమాని ఒక తపస్సులా భావించే కళాతపస్వి,ఆయన మన తెలుగు సినీపరిశ్రమకి చేసిన కృషికి,సినిమాకి ఆయన అద్దిన సొగబులకి,మనమెప్పుటికి రుణపడి ఉండాలి,ఇంకో నాలుగు తరాల తరువాత అయినా కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేపుడు,మొదట ఉదహరించే నాలుగు చిత్రాల్లో అయన చిత్రాలు నిలుస్తాయి. ఆయన సినిమాల్లో సంగీతానికి ఎంత ప్రధాన్యత ఉన్నదో మనకి తెలియనిది కాదు. వాటిల్లో కొన్ని అజరామరమైన పాటలు మాత్రమే మన తరానికి తెలుసేమో,కొన్ని ఆణిముత్యాల్లాంటి పాటలు మనకి తెలియక,ఇంకొన్ని మనం తెలుసుకోక ఇప్పటి వరుకు విని ఉండం కావొచ్చు,ఆలా మనం మిస్ ఆయన కొన్ని అద్భుతమైన పాటలు వినండి, ప్రతీ పాట ఓ ఆణిముత్యం,నా మాట గా చెబుతున్న,మీ సమయం ఏ మాత్రం వృధా కాదు,ఓసారి విని ఆస్వాదించండి
1.ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికీ ఎరుక (సిరిసిరి మువ్వా)
2. జోలాజాలమ్మజోలా (సూత్రధారులు)
3. గోవులు తెల్లన (సప్తపది)
4. మావిచిగురు తినగానే (సీతామాలక్ష్మి)
5.చరణ కింకిణులు (చెల్లెలి కాపురం)
6.దొరకునా ఇటువంటి సేవ (శంకరాభరణం)
7.తెలవరదెమో స్వామి (శ్రుతిలయలు)
8.సిగ్గుపూబంతి (స్వయంకృషి)
9.తెలి మంచు కరిగింది (స్వాతికిరణం )
10.విధాత తలపున (సిరివెన్నెల)
11.అందెల రవమిది (స్వర్ణకమలం)
12.చుక్కలారా చూపుల్లారా (ఆపద్భాన్దవుడు)
13.హరిపాదన పుట్టావంటే గంగమ్మ (శుభ సంకల్పం)
14.ఒక్క క్షణం (స్వరాభిషేకం )
15.అనుజుడై లక్ష్మణుడు (స్వరాభిషేకం )