'అణగతొక్కబడిన' - ' అణగదొక్కే'
OPPRESSED - OPPRESSOR ఈ రెండు జాతుల మధ్య కొన్ని వందల , వేల శతాబ్దాలు గా యుద్ధం జరుగుతూనే ఉంది .. మానవుడు భూమిమీద ఉద్భవించిన ఐదారు వందల సంవత్సరాల తరవాత ఈ విభజన మొదలైంది కావచ్చు. Human ఎవల్యూషన్ లో ఆ సమయం చాలా తక్కువ .. మనిషి ఎదిగే క్రమం లో ఎన్నో కోట్ల సార్లు తన జీవన విధానాన్ని పూర్తిగా మార్చేసుకోగలిగాడు కానీ మధ్యలో ఆ గీత మాత్రం చెరపలేక పోయాడు .. ఈ గీత ఇద్దరు మనుషుల మధ్యన అంటే అణగదొక్కబడిన మనిషి అణిచేసిన మనిషి మధ్యన మొదలయ్యి , రెండు కుటుంబాల మధ్యన , రెండు జాతుల మధ్యన విద్వేషం గా రగులుతూ వచ్చింది.ఈ గీత పేరు ' అసమానత్వం ' .. అణగారిన వర్గాలని కూకటి వేళ్ళతో సహా ఎన్నిసార్లు పెకిలించి వెయ్యాలని చూసినా వారితో ఉండే అవసరాల వల్ల వారు మళ్ళీ బౌన్స్ అవుతూనే ఉన్నారు .. అమెరికా లాంటి సూపర్ developed దేశాలు సైతం ఈ 'అసమానత్వం' ని touch కూడా చెయ్యలేక పోయాయి .. మనిషి నవ నాడుల్లో ' వాడు ' తక్కువ , ' నేను ' ఎక్కువ అనే అహంకారం - డబ్బువల్ల , పదవి వల్ల , అధికారం వల్ల , బ్యాక్ గ్రౌండ్ వల్ల , తెలివి తేటల వల్లా , ఇంకేదైనా కారణం వల్ల ఉంటూనే ఉన్నంత కాలం సమానత్వం సాధ్యమే కాదు .. అది కేవలం చట్టాల చిట్టాల పేపర్ల వరకే పరిమితం అవుతుంది .
ఈ తాలూకా భావాలు డైరెక్టర్ పా రంజిత్ లో కించిత్ ఎక్కువే కనపడతాయి .. అతని నేపధ్యం దగ్గర నుంచీ అనేక సైద్ధాంతిక భావాల వైపు సాగిన అతని ప్రయాణం అణగారిన వర్గాల మీద పోరుగా సాగుతూ ఉండే ప్రయత్నం ఉంటుంది. కబాలి లో కూడా వీటికి సంబంధించి ఎన్నో తన స్టైల్ సీన్ లు పెట్టాడు. కానీ కథ ని ఒడుపుగా చెప్పలేకపోవడం - కథ ఎక్కువ శాతం పక్కదారి పట్టడం తో ఆ సినిమా విషయం లో ఇది వర్క్ కాలేదు . ఎక్కడో మలేషియా లో డాన్ ల కథ ని ఇరికించిన తీరు కనపడుతుంది. తెరమీద రజినీకాంత్ తప్ప కబాలి కనపడడు .. కాలా విషయం లో మాత్రం మంచి క్లారిటీ తో వెళ్ళాడు రంజిత్ .
ఒక వర్గం మీద మరొక వర్గం శతాబ్దాల తరబడి చేసే సైలెంట్ దాడి గురించి అతని మనసులో లోతుల్లో కూరుకుపోయిన బలమైన పాయింట్ లు జనాల ముందు పెట్టాలి అనేది రంజిత్ ధృడ కాంక్ష . మన జనరేషన్ లోని అతిపెద్ద సూపర్ స్టార్ ని అడ్డం పెట్టుకుని ఈ విషయం చెప్పే ప్రయత్నం రంజిత్ చేసాడు. అది అందరికీ రుచిస్తుందో లేదో తెలీదు , అయితే అతని సిద్ధాంతాలని రుద్దుతున్నాడు అని అనుకున్న నాకు మాత్రం నా ఫీలింగ్ తప్పు అనిపించేలా చేసాడు రంజిత్. కాలా ఒక క్యారెక్టర్ కాదు , కాలా రజినీకాంత్ కాదు .. కాలా నలుపు - కాలా మురికి - కాలా అంటే జుగుప్స - కాలా అణచబడ్డ వర్గం - ఆ వర్గపు జాతి పొగరు - ఆ వర్గపు కుటుంబ పెద్ద .. అయితే ఎన్ని కాలాలు వచ్చినా , ఎన్ని ఉద్యమాలు జరిగినా , విప్లవ యుద్ధాలు నడిచినా ఈ వర్గాల మధ్య 'అసమానత్వ' అడ్డు తెర తొలగిపోవడానికి మరిన్నో శతాబ్దాలు లేదంటే ఇంకెన్నో యుగాలు పట్టచ్చు ..