1983 భూపాల్ అమిత్ ఇంట్లో..
రఘుపతి(అమిత్ తాత): నాకేమో వయస్సు ఐపోతుంది, ఇది వరకు లాగ కష్టపడలేకపోతున్న.. ఇంకొన్ని రోజులు ఆ దేవుడు కరుణిస్తే దేవి పెళ్లి చేసి సుఖంగా కళ్ళు మూస్తా. మన కొడుకే బ్రతికుంటే మనకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదేమో.. వాడిని మనమే చూసుకుని, ఇప్పుడు వాడి పిల్లల బాధ్యతలు మనమే చూసుకోవాల్సి వస్తుంది. ఆడపిల్లని బయటికి పనికి పంపలేను.. మనవడు అటు చదువుకు పనికి రాకుండా ఏదో తిండికి సరిపడేంత సంపాదిస్తున్నాడు. పగ వాడికి కూడా ఇన్ని కష్టాలు రాకూడదు మంజరి.
మంజరి(అమిత్ అవ్వ): మీకు ఎవరో తెలిసిన వాళ్ళు ఫ్యాక్టరీ లో మన అమిత్ కి పని ఇప్పిస్తా అన్నారు ఆ విషయం ఏం అయ్యింది.? రఘుపతి(అమిత్ తాత): శుక్ల గారు అని అక్కడ ఫ్యాక్టరీ లో భద్రతా అధికారిగా పని చేస్తున్నారు. మన అమిత్ గురించి చెప్పాను. చూద్దాం అన్నారు.
అమిత్: మా మనవడు ఎంత కష్టమైనా పడతాడు అని చెప్పలేక పోయావా.? ఈ వయస్సులో కూడా నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఆ ఫాక్టరీలో నాకు ఉద్యోగం వస్తే ఇక నువ్వు అక్కడ పని చేయడం మానేసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకో. నేనే ఎలాగోలా కష్ట పడి చెల్లి పెళ్ళికి డబ్బులు సర్దుతాను.
రఘుపతి: నువ్వు ఒక సారి నాతో పాటి రేపు ఫ్యాక్టరీ కి రా.. నేను శుక్ల గారితో మళ్ళి ఇంకోసారి మాట్లాడి నీకేమన్న పని దొరుకుతుందేమో చూస్తాను. అమిత్: అలాగే తాత.. (మరుసటి రోజు ఉదయం భోపాల్ ఫ్యాక్టరీ లో..)
రఘుపతి: శుక్ల గారు నమస్కారం. మొన్న మీకు మా మనవడి గురించి చెప్పా కదా. ఇదిగో వీడే. శుక్ల: బానే బలంగా వున్నాడు.. పనికొస్తాడు.. చూద్దాం!! రఘుపతి(అమిత్ తాత): సార్.. మీకు మా ఇంట్లో పరిస్థితి తెలుసు. ఎన్నో ఏళ్ళు ఇక్కడే విశ్వాసంగా పని చేసాను. ఇప్పుడేమో నాకు వయస్సు పైన బడుతుంది.. ఎక్కువ సేపు నిలబడలేకపోతున్న కూడా.. నా సంపాదనతో పాటు వీడి జీతం కూడా తోడవుతే కొంచెమన్న గట్టేక్క గలం. మీరే మాకు ఏదోక విధంగా సహయం చేయాలి..
శుక్ల: రఘుపతి నీ గురించి నాకు తెలియందా చెప్పు. మొన్న నువ్వు నన్ను అడిగినప్పుడే మేనేజర్ తో మాట్లాడి చూసాను.. నీ పరిస్థితి అంత విడమర్చి చెప్పాను.. ఆయన మాటల్ని బట్టి నీతో పాటు నీ మనవడికి కూడా ఉద్యోగం అంటే కష్టం కాని నీ బదులు నీ మనవడిని అయితే తీసుకునే అవకాశాలు వున్నాయి. అంటే నీకు కాని నీ మనవడికి కాని ఇద్దర్లో ఒక్కరికే ఉద్యోగం.
అమిత్: శుక్ల గారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. ఇక్కడ ఉద్యోగం వస్తే తాత తో పని మానిపించి ఇంట్లో ఇక విశ్రాంతి తీసుకో మని చెప్దాం అని నేను కూడా అనుకుంటున్నా.. ఆ శ్రమ లేకుండా మీరే మంచి వార్త చెప్పారు. రఘుపతి(అమిత్ తాత): నీ ఒక్కడి సంపాదనతోనే ఇల్లు నడపటం కష్టం రా అబ్బాయ్.. నాకు ఓపిక ఉన్నన్నాళ్ళు నేను ఒక చేయి వేస్తా. చెల్లల్లి పెళ్లి వరకైనా నా సంపాదన కూడా తోడైతే, ఏ చీకు చింత లేకుండా దాని పెళ్లి ఐపోతుంది.
అమిత్: వద్దు తాత ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది చాలు. ఇక అన్ని నేనే చూసుకుంటా.. వయస్సు వుంది కదా కష్టపడతా. అయినా చెల్లి పెళ్ళికి అప్పుడే తొందర ఏమొచ్చింది. ఇంకొద్ది రోజులు ఆగి కొద్దో గొప్పో డబ్బు సంపాదించాక ఘనంగా చేద్దాం దాని పెళ్లి. శుక్ల: బాగుందయ్య రఘుపతి. నీ మనవడిని చూస్తుంటే బాగా చెమటోడ్చేవాడి లాగే కనిపిస్తున్నాడు. కుర్రోడు కదా కొంచెం ఎక్కువ సేపు పని చేయించి ఎమన్నా జీతం పెంచుతారేమో అడిగి చూస్తా.. ఇక ఇంతకు మించి నేనేం చేయలేను.. అమిత్: శుక్ల గారు మీకెప్పుడు రుణపడుంటాను.. మీ పేరు చెడగొట్టకుండా బుద్దిగా పనిచేసుకుంటా.. తాత ఇక నువ్వు ఇంట్లోనే ఉంటూ అవ్వ ని చెల్లి ని జాగ్రత్తగా చూసుకో.. ఇకపై కష్టం నాది..
(కొన్ని నెలల తర్వాత..)
అమిత్: శుక్ల గారు ఏంటి ఈ మధ్య అస్సలు కనబడట్లేదు.. శుక్ల: హా అమిత్. ఏంటి ఎలా వున్నావు? తాత ఎలా వున్నాడు? అమిత్: నేను బాగున్నా శుక్ల గారు.. మీరు ఎలా ఉన్నారు?? మీలో ఎప్పుడు వుండే ఆ నవ్వు లేదు.. ఏదో ఆందోళనలో ఉన్నట్లున్నారు? శుక్ల: అలాంటిది ఏమి లేదు.. మన పనిని మనం సవ్యంగా చేస్తే నెలకి జీతం ఇస్తారు.. మన పనిలో భాగంగా సలహాలు ఇస్తే.. నీ పని నువ్వు చెయ్యి అని బెదిరిస్తారు.. ఏంటో ఈ మనుషులు అస్సలు అర్థం కారు. అమిత్: ఏం చెప్పారూ.. ఒక్క ముక్క కూడ అర్థం కాలేదు..
శుక్ల: ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ లాభాలు అంతంత మాత్రమే.. లాభాలు తగ్గితే ఎక్కడ లోపం వుందో తెలుసుకోవాలి లేకపోతే నాణ్యతను పెంచి వస్తువును తయారు చేయాలి అంతే కాని పోయిన లాభాన్ని భర్తి చేయడానికి ఫ్యాక్టరీ లోని భద్రతా వ్యవస్థను పక్కన పెట్టడం ఏంటో.. నాకైతే అర్థం కాలేదు.. ఫ్యాక్టరీ లోని పైపులు మరీ దారుణంగా వున్నాయి.. ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రతి ఫ్యాక్టరీ లో ఇన్ని సంవత్సరాలకు ఒకసారి అని ఫ్యాక్టరీ లోని అన్ని పైపులను తణికి చేసి లోపాలు ఎక్కడైనా వుంటే వాటిని సరి చేయాలి.. కాని ఫ్యాక్టరీ లాభాల్లో లేదని ఆ పనిని పక్కన బెట్టారు..
అమిత్: అదేంటి శుక్ల గారు.. ఫ్యాక్టరీ కట్టే అప్పుడు మంచి నాణ్యమైన పైపులే గా మనం వాడేది.? శుక్ల: అప్పుడు మంచివే.. కాని మన ఫాక్టరీలో తయారయ్యేవి ఎరువులు.. అంటే విష వాయువులతో తయారు చేస్తాం.. కాలం గడిచే కొద్ది ఆ ఎరువులు తయారు చేసే గ్యాస్ వల్ల పైపులు కూడా నాశనం ఐపోతాయి. అసలే విష వాయువులు అవి బయటికి వస్తే ఇక ఎమన్నా వుందా??
అమిత్: అశుభం ఎందుకులే శుక్ల గారు.. మనకి మూడు పూటలు నాలుగు వేళ్ళు లోపలికి వెళ్తున్నాయి అంటే డానికి కారణం ఫ్యాక్టరీ ఎహ్ కదా. ప్రతి దాంట్లో ఏదోక అవకతవకలు వుంటూనే వుంటాయి. మన వ్యవస్థే అలాంటిది. మీరు మరి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మన పని చేసామా నెలాఖరుకు జీతం తీస్కున్నామా అన్నట్లు వుండాలి గాని.. పై వాళ్ళతో గొడవపడి ఉద్యోగానికి ఎసరు పెట్టుకోవడం ఎందుకు చెప్పండి.. శుక్ల: నీ వరకు వచ్చిన రోజు అర్థం అవుతుంది నేను ఎందుకు చెప్తున్నానో అని.. సర్లే ఇది అలా ఉంచు.. ఇంతకి నీ సంగతేంటి.. ఎలా ఉంది ఇక్కడ పని అంతా.?
అమిత్: బాగుంది.. ఎక్కువ కష్టపడటం వల్ల తక్కువ కాలంలోనే చాల మంది పరిచయం అయ్యారు. త్వరలోనే Machine Operatorగా ప్రమోషన్ కూడా ఇస్తాం అన్నారు. శుక్ల: అదేంటి?? Machine Operator ఆ.. నీకైనా దాని గురించి ఏమి తెలీదు కదా.. దాని గురించి తెలుసుకోవాలన్నా చాలా సమయం పడుతుందే... అప్పుడే నీకు ఆ పని చేయమని ఎలా చెప్తారు?? అమిత్: ఏమో శుక్ల గారు నాకు తెలీదు.. శుక్ల: ఈ ఫ్యాక్టరీ లో ప్రధాన లోపమే అది పని సరిగ్గా నేర్పించకుండా పనుల్ని అప్పచెబుతారు. రేపు ఎవరికన్నా ఎమన్నా అవుతే ఎవరు పూచి?? అమిత్: పని పెరిగితే జీతం పెరుగుతుంది.. ఎంత చేసిన దాని కోసం కదా.. సరే ఈ విషయాలన్నీ వదిలేయండి.. చెల్లికి పెళ్లి కుదిరింది.. మీకే మొదటిగా చెబుతున్నా.. ఖచ్చితంగా రావాలి మీరు.. మీ చనువు వల్లే ఈ రోజు ఇదంతా.. శుక్ల: చాల సంతోషం.. నాదేముంది.. అంత నీ కష్టం.. అమిత్: సరే శుక్ల గారు.. ఇక సెలవు.. కొంచెం పట్నం లోకి వెళ్లి పెళ్లి పనులకు కావలసినవి సమకూర్చాలి. శుక్ల: శుభం
December 2 1984 ఉదయం 10:30 నిమిషాలు అమిత్: దేవి, అవ్వ జాగ్రత్త, నేను తాత పట్నంలోకి వెళ్లి కొంచెం పనులు చూసుకొని వస్తాం.. రాత్రి ఇంటికి రావడానికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు.. మీరు మాకోసం ఎదురు చూడకుండా భొంచేయండి. రఘుపతి: చివరికి దేవి పెళ్లి నా చేతులు మీద జరుగుతుంది. చాలా సంతోషంగ వుంది. అమిత్: హ హ సరే పద పద.. ఆలస్యం ఐపోతుంది.
(అమిత్ వెళ్ళిపోయినా ఒక 4-5 గంటలకి, శుక్ల కంగారుగా అమిత్ ఇంటికి వచ్చి..)
శుక్ల: అమిత్.. అమిత్ దేవి: శుక్ల గారు.. మీరా లోపలికి రండి శుక్ల: అమిత్.. లేడా దేవి: అమిత్ ఇంకా తాత, పెళ్లి పనుల కోసం పట్నం వెళ్లారు.. రాత్రి ఆలస్యం అవుతుంది అని చెప్పారు. శుక్ల: అవునా.. అయితే మీరు వెంటనే బయల్దేరండి.. దేవి: శుక్ల గారు ఎక్కడికి.. అసలు ఏమైంది.. ఎందుకు మీరు అంత కంగారుగా వున్నారు.? శుక్ల: ఇప్పుడు అన్ని చెప్పే అంత సమయం లేదు.. త్వరగా పదండి.. దేవి: కాని తాత లేకుండా నేను ఎక్కడికి రాను.. శుక్ల: ఇక్కడే వుంటే ప్రాణం పోతుంది.. ఫ్యాక్టరీ నుంచి ఏ క్షణమైనా విష వాయువులు బయటికి రావచ్చు.. అది వస్తే ఇక్కడ వున్న ఎవరు మిగలరు.. అందరు చని పోతారు.. నా మాట విని త్వరగా కదలండి.. ఈ ఫ్యాక్టరీ నుండి వీలైనంత దూరం వెళ్ళాలి.. దేవి: కాని మా అన్నయ్య తాత లేకుండా ఎక్కడికి రాము. శుక్ల: మీ కర్మ.!!
అదే రోజు రాత్రి 11-2:00 గంటల మధ్యలో పైపుల్లోని M ethylene గ్యాస్ లోకి నీరు చేరి విష వాయువులు తయారయ్యి పైపులు బలంగా లేకపోవడంతో అవన్నీ బయటికి వచ్చాయి. వాటి వల్ల అక్కడికక్కడే 3787 మంది మరణించారు. అమిత చెల్లి ఇంకా అవ్వ కూడా ఆ మృతుల్లో ఒకరు. మరుసటి రోజు ఇద్దరి మృత దేహాలను చూసి అమిత్ మూర్చబోయాడు. ఆ విష వాయువుల ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో రఘుపతి సృహ తప్పి క్షణాలలో మరణించాడు. చుట్టు అంత శవాలతో అనాథైన అమిత్ కి అప్పుడు శుక్ల మాటలు గుర్తొచ్చాయి "నీ వరకు వస్తే కాని నీకు తెలిదు"
1994 నాటికి మొత్తం మృతుల సంఖ్యా 25000 పైన ఇక దాని వాళ్ళ అనారోగ్యానికి గురైన వారు 5 లక్షల మంది. ఈ రోజుకి ఇంకా పరిహారం కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పిచ్చి జనం.ఇంత ఘోరమైన సంఘటనలు జరిగిన ఇప్పటికి ఇలాంటివి అరికట్టలేకపోతున్నాం. ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు గుర్తించాల్సింది ఏంటంటే డబ్బు కంటే ప్రాణం ఎన్నో రెట్లు గొప్పది.
Letting men die is a money saving device. Safety costs money...as one safety official put it "when everything is hurry, hurry, hurry, when you start pressuring people and taking short cuts, things can go wrong and then people die".