Contributed by Sowmya Uriti
కాలం మారుతోంది చదువు-సంస్కారం అనేవి జంట పదాలు కావు అనిపించేంతగా కాలం మారుతోంది సామాజిక మాధ్యమాలలో మాత్రమే సమాజాన్ని చుసేంతగా కాలం మారుతోంది అసభ్య పదజాలాలను ఆధునికత పేరుతో అందలాన్నెక్కించేంతగా కాలం మారుతోంది కార్యాలతో కాక కాసులతో మనిషిని వెలకట్టేంతగా కాలం మారుతోంది ఉత్తములకు, ఉత్తములమని డాంబికాలు పలికే అధములకు తేడా తెలుసుకోలేనంతగా కాలం మారుతోంది ఆశీర్వదించే తల్లిదండ్రులనే నిరాశ్రయులను చేసేంతగా కాలం మారుతోంది కాలం తెచ్చే ఈ మార్పులకు లోబడని వారిని అసమర్ధులు అనేంతగా కాలం మారుతోంది ఈ మార్పు మంచికేనా అని సందేహం వచ్చేంతగా