పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది "కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే మసీద్, కర్తవ్యమే చర్చ్ మీ కర్తవ్యాన్ని మీరు సరిగ్గా పాటిస్తే మీరే దేవుళ్ళు.." అంటూ తోటి పోలీసులకు హితభోద చేస్తాడు అదే డైలాగ్ ప్రతి పోలీసుకు వర్తిస్తుంది.. సాధారణంగా ఒక పోలీసు కర్తవ్యం శాంతి భద్రతలను కాపాడటం, అన్యాయాన్ని, నేరాలను అరికట్టడం ఇవి మంచి పోలీసులందరూ నిర్వహించే కర్తవ్యమే.. కాని కడపలో Sub Inspector గా విధులను నిర్వహిస్తున్న హరికృష్ణ కూరగాయల మాత్రం ఒక సగటు పోలీస్ కన్నా ఎక్కువ సేవచేస్తు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు..
ఈ మధ్య జరుగుతున్న హరితహారం చూసి మొక్కలు నాటడం మొదలుపెట్టలేదు ట్రైనింగ్ తీసుకుంటున్న సమయం నుండే దాదాపుగా 10 సంవంత్సరాలనుండి ఇప్పటికి 3,000 మొక్కలు నాటారు. నాటడం మాత్రమే కాదు వాటికి నీళ్ళు పోస్తూ రక్షణ వలయాన్ని ఏర్పరిచి పెంచి పెద్ద చేస్తున్నాడు.. శిధిలమైపోయి నిరుపయోగంగా మారిపోయిన Police Quarters ను పూర్తిగా శుభ్రపరిచి పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ తో పాటుగా అక్కడ చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేశారు.. అంతేకాకుండా రోడ్డుకిరువైపులా చెట్లు నాటుతూ నగరాన్ని అందంగా కాలుష్య రహితంగా తీర్చిదిద్దుతున్నారు.. కొంతమంది పోలీసులంటే లంచాలు, రాజకీయ నాయకులకు కొమ్ముకాస్తారు, పౌరులతో అసభ్య పదజాలంతో తిట్టేవారుంటారు కాని హరికృష్ణ వీళ్ళందరి కన్నా భిన్నమైన వారు, ఉన్నతుడు, ప్రతి ఊరు కోరుకునే ప్రజా సేవకుడు.