మన తెలుగులో కైలాష్ ఖేర్ గారు తక్కువ పాటలు పాడారు కాని పాడిన కొన్ని పాటలతోనే మనతో ఆత్మీయమైన అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారు. కైలాష్ గారి గాత్రం ఎంతో భిన్నమైనది.. ఆ గాత్రం ఎంత భిన్నమైనదో అంతే స్థాయిలో హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. నిజమే ఎవరి శైలి వారిది, సింగర్స్ వారి ప్రత్యేకతతో ప్రేక్షకులను సమ్మోహనం చేస్తుంటారు.. కొన్ని పాటలు వింటుంటే ఇది ఎవరు పాడారు.? అని ఆలోచిస్తుంటాం, నెట్ లో సెర్చ్ చేస్తుంటాం కాని కైలాష్ గారి గాత్ర ప్రత్యేకత వల్ల తడుముకోకుండానే వెంటనే మనకు అర్ధమైపోతుంది.
కైలాష్ గారు మన తెలుగులో అన్ని రకాల ఎమోషన్స్ నిండిన పాటాలు పాడారు అందులో కొన్ని మధురమైన మరుపురాని పాటలు..
1. పండగల దిగివచ్చావు.. (మిర్చి)
2. వీడే వీడే (జయ జానకి నాయక)
3. వయ్యారి BlackBerry.. ( నువ్వా నేనా)
4. ఒకానొక ఊరిలో.. (ఆకాశమంతా)
5. ఎందుకో ఎందుకో.. (గోపాల గోపాల)
6. ఎలగెలగ.. (పరుగు)
7. ఈ జన్మమే రుచి చూడడానికి .. (ఉలవచారు బిర్యాని)
8. కమ్ముకున్నా చీకట్లోనా.. (అరుంధతి)
9. మధ గజమే.. (రుద్రమదేవి)
10. వచ్చాడయ్యో సామి (భారత్ అనే నేను)
11. యేడ పోయినాడో (అరవింద సమేత వీర రాఘవ)
12. ప్రయత్నమే (చిత్రలహరి)
13. దాసు బిందాసు (ఫలక్నుమా దాస్)