Contributed By Cheppalli Naga Chetan
నాన్న: జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కల, వయ్యారి వాలు కాళ్ళ లోన వరాల వెండి పూల వాన, స్వరాల ఊయలూగు వేళ.. …….వెన్నెల రాత్రి, చల్లటి గాలి ఎంత హాయిగా వుందో వాతావరణం. ఎంతైనా నేను చాల లక్కీ, నన్ను ప్రేమించే నువ్వు, బాగా అల్లరి చేసే మన అబ్బాయి మన జీవితాలు సుఖంగ ఉండటానికి సరిపోయే జీతం, చాలు నాకు.. ఎంటే నేను ఇందాక నుంచి ఏదో మాట్లాడుతున్నా నువ్వు అటు వైపు తిరిగి పడుకొని ఏమి మాట్లాడవు, అపుడే పడుకున్నావా ఏంటి???
అమ్మ: లేదండి పడుకోలేదు.. నాన్న: మరి ఇటు తిరుగు.
అమ్మ: హా.. చెప్పండి ఎంటో నాన్న: ఎంటే కంట్లో ఆ నీళ్ళు ఏంటి?? ఎందుకు ఎడుస్తున్నావు? అమ్మ: ఏమి లేదండి.
నాన్న: ఏమి లేకపోతే ఏడవడం ఎందుకే.. నా కష్టం నీకు, నీ కష్టం నాకు చెప్పుకుంటేనే కదా ప్రశాంతంగా వుంటుంది. అమ్మ: ఈ రోజు బబ్లూ ని బాగా కొట్టాను.. వాడు అలిగి అన్నం కూడా తినకుండా పడుకున్నాడు.. మధ్యాహ్నం ఎప్పుడో పెట్టిన క్యారేజి తినుంటాడు.. ఇంకా ఏమి తినలేదు. వాడు అస్సలే ఆకలికి ఉండలేడు. నాన్న: నువ్వే కొట్టి నువ్వే ఏడుస్తున్నావా.. భలే దానివి, అసలు ఎందుకు కొట్టావు.?
అమ్మ: ఇవాళ వాడికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు.. మార్కులు తక్కువ వచ్చాయి అందుకే కొట్టాను. టూషన్ కి వెళ్ళమంటే వెళ్ళడు, మార్కులు తక్కువ వస్తునాయి, వాడి ఫ్యూచర్ గురించి భయంగా వుంది.. ఆ కోపంలో ఎదో కొట్తేసాను. నాన్న: పిచ్చిదానా వాడు పుట్టి ఇంకా తొమ్మిదేళ్ళు కూడా కాలేదు అప్పుడే ఫ్యూచర్ అని ఏదేదో మాట్లాడుతున్నావు.. అక్కడ స్కూల్ లో చదువు గురించే, ఇంట్లో చదువు గురించే.. పాపం పసివాడు బంగారం వాడు.
అమ్మ: ఇప్పట్నుంచి సరైన దారిలో పెడితేనే కదండీ అప్పటికి బాగు పడతాడు.. నాన్న: చూడు.. మనం స్కూల్ కి డబ్బులు కట్టేది మంచి చదువు చెప్పమని, అది వాళ్ళు చూసుకుంటారు, తల్లి తండ్రులుగా మనం చేయాల్సింది మన కళ్ళతో వాళ్ళకి ప్రపంచాన్ని చూపించడం. అమ్మ: ఎం చెప్పారు?? అర్థం అవ్వలేదు..
నాన్న: పిల్లలకి చదువు ముఖ్యమే కాదనట్లేదు కాని వాడు చదివే చదువు వాళ్ళకి నచ్చుండాలి, వాళ్ళు చేసే పని వాళ్ళకి నచ్చితేనే కదా హ్యాపీగా వుంటారు. పేరెంట్స్ గా మనం చేయాల్సింది ఏంటంటే మనకి తెలిసిన విషయాలన్నీటిని చెబుతూ వుండాలి.. అలా చెబుతూ వుంటే వాళ్ళకే తెలీకుండా ఎదో ఒక టాపిక్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు.. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే చదువుతారు. చదువు అనేది ఇష్టంతో రావాలి కాని కష్టంతో, భయంతో రాకూడదు బంగారం.. అమ్మ: ఇప్పుడు మరి ఏం చేయమంటారు.?
నాన్న: ముందు నువ్వు హోం వర్క్ చెయ్యి. అమ్మ: నేనా హోం వర్క్ హా?? ఎందుకు? నాన్న: నువ్వే.. రోజు సమాజంలో జరిగే ఒక విషయం గురించి తెలుసుకో.. వాడికి అది ఉపయోగపడుతుంది అనుకుంటే దానిని కథ లాగ మార్చి చెప్పు.. అలా రోజు చెబుతూ ఉంటే.. వాడే మంచి మార్గంలో వెళతాడు చివరికి.
అమ్మ: మరి చదువు.? నాన్న: చదువు చదివితే రాదు దానిని ఆస్వాదించాలి.. వాడు ఆస్వాదించాలి అంటే ఇలాంటివి మనం చేయాలి అమ్మ: అంటే కాలం చెప్పిన కథలను చెప్తే వాడే భాగుపడతాడు అంటారు నాన్న: హమ్మయ్య అర్థం చేసుకున్నావు.. చల్లటి గాలిలో మన ప్రేమ రోజులు గుర్తొస్తున్నాయి.
అమ్మ: వస్తాయి వస్తాయి ఎందుకు రావు.. మీరు గుర్తుచేస్కోండి.. నాకు నిద్రొస్తుంది నేను పడుకుంటున్నా.. గుడ్ నైట్ నాన్న: గుడ్ నైట్.. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, జోరుగాలిలో జాజి కొమ్మ జారనీయకే కల.. వయ్యారి వాలు కాళ్ళ లోన వరాల వెండి పూల వాన, స్వరాల ఊయలూగు వేళ.