తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆత్రేయ, వేటూరి తర్వాత వారి స్థాయిలో సాహిత్యాన్ని అందివ్వగల వ్యక్తి సిరివెన్నల సీతారామశాస్త్రి గారు. ఆయన పాట రాస్తున్నారు అంటేనే ఆ చిత్రంలో ఏదో విషయం ఉంటుంది అని అనుకుంటాం. ఆయన రాసిన పాటలు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతాయి. ప్రేమలోని మాధుర్యం ఐనా, విరహ వేదన ఐనా, కుటుంబంలోని అనురాగం ఐనా, సంస్కృతి సాంప్రదాయాలలోని గొప్పతనం ఐనా, స్నేహం లోని సంతోషం ఐనా, దేవుడి గురించిన వివరణ ఐనా, మనిషి ప్రవర్తన గురించిన సవరణ ఐనా ప్రతీ దాని గురించి ఆయన కలం నుండి జాలువారిన సాహిత్య జల్లులు మనకు అన్ని రకాల అనుభూతులు పంచుతాయి.
ప్రస్తుత తరంలో శాస్త్రి గారితో ఎక్కువగా ప్రయాణం చేస్తున్న దర్శకులలో రాధాకృష్ణ జాగర్లమూడి ఒకరు. మనిషి గురించి మనసుకు హత్తుకునేలా చిత్రాలు తీసే రాధాకృష్ణ జాగర్లమూడి, సీతారామ శాస్త్రి గారి కలయిక లో వస్తున్న నాలుగవ చిత్రం కంచె. విషయం ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి పనిచేస్తే ఫలితం చాలా గొప్పగా ఉంటుందని కంచె పాటల్లోని సాహిత్యం వింటే తెలుస్తుంది. క్రిష్ అవసరానికి శాస్త్రి గారి ఆలోచనలతో పుట్టిన కంచె సాహిత్యాన్ని చిరంతన్ భట్ సంగీతం అద్భతంగా మన ముందుకు తీసుకువచ్చింది. కంచె పాటలతో శాస్త్రి గారు అందించిన మరికొన్ని అద్భుతమైన ప్రవచనాలు...
పాట: ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో
పాడిన వారు: అభయ్ జోధ్పూర్, శ్రేయ గోశల్
సందర్భం: ప్రేమలో ఉన్న యువ జంట తమ పరవశాన్ని మాటల్లో వర్ణించటం
గుర్తుండిపోయే వాక్యాలు:
పాట: నిజమేనని నమ్మనీ
పాడిన వారు: శ్రేయ గోశల్
సందర్భం: వారి ప్రేమ విజయం పొందదు అనే అనివార్య నిజాన్ని నమ్మలేక
గుర్తుండిపోయే వాక్యాలు:
పాట: భగ భగమని ఎగసిన మంటలు...
పాడిన వారు: విజయ్ ప్రకాష్
సందర్భం:నిజమైన మనిషిగా బ్రతకలేక, సాటి మనిషిని బ్రతకనివ్వక అస్తిత్వం కోసం తన నాశనాన్ని తనే ఆహ్వానిస్తున్న ప్రస్తుత సమాజాన్ని ఉద్దేశించి
గుర్తుండిపోయే వాక్యాలు:
పాట: ఊరు యేరయ్యింది... యేరు హోరెత్తింది...
పాడిన వారు: శంకర్ మహదేవన్
సందర్భం: అంతరాలు, అంటరానితనాలు, అంతరించే అంతస్తులు, అర్ధంలేని ఆవేశాలు, అంతులేని అత్యాసలు అన్నిటిని దాటేసి అందరు కలిసి జరుపుకునే నిజమైన పండుగ సంబరం వేళ
గుర్తుండిపోయే వాక్యాలు:
పాట: రా ముందడుగేద్దాం
పాడిన వారు: విజయ్ ప్రకాష్, హీర్తి సగాతియ
సందర్భం: పగని ప్రేమిస్తు, ప్రేమని ద్వేషిస్తు, ఆధిపత్యాన్నిఆరాధిస్తు, యుద్ధాన్ని ఆయుధంగా మార్చుకొని అశాంతిని అంతిమంగా పొందుతున్న ప్రపంచ తీరుని నిరసిస్తు
గుర్తుండిపోయే వాక్యాలు:
ఆయన రాసిన ప్రతి మాట ఎంతో విలువైనది అర్ధవంతమైనది, ఆయన సాహిత్యం గురించి చెప్పే స్థాయి గాని, జ్ఞానం కాని, ఆలోచనా శక్తి కాని మాకు లేవు. కేవలం అభిమానం అనే అర్హతను అవకాశంగా చేసుకుని రాసిన ఆర్టికల్ ఇది.
వాస్తవంగా మాకు పాటల్లో ప్రతి పదం నచ్చింది, మీకు నచ్చిన లైన్స్ మేము మిస్ చేసినట్టు అనిపిస్తే కింద కామెంట్ చేయండి.