జీవితంలో ఎప్పుడైన ఒకసారయినా అనుకుంటాం... మిగిలిన వారికున్న డ్రెసెస్ కన్నా మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయని, మనం వేసుకున్న డ్రెస్ చాలా డల్ గా ఉందని లేదా అసలు ట్రెండ్ కు తగ్గట్టుగా ఫ్యాషన్ పరంగా Update అవ్వడం లేదు, Maintain చెయ్యడం లేదు అని సవలక్ష విధాలుగా ఆలోచిస్తుంటాం కాని ఉన్న రెండు, మూడు దుస్తులే ఉండి చినిగిన బట్టలు వేసుకునే మన భారతీయ పేదల గురుంచి చాలా తక్కువ మందే పట్టించుకుంటారు.. అలాంటి పేదవారి కోసమే జాహిద్ అలీ ఖాన్ (Chief Editor Of Siasat Urdu Daily), Faiz-e-Aam Trust, Helping Hands ఇంకా మరికొంత మంది స్నేహితులతొ కలిసి మన తెలుగు పేదవారి కోసం ఈ ప్రత్యేకమైన క్లాత్ బ్యాంక్ ను ప్రారంభించారు. ఈ బ్యాంక్ నుండి పేదవారు రేషన్ కార్డ్ ను చూపించి ఉచితంగా వారికి నచ్చిన వస్తువులు తీసుకెల్లవచ్చు..
నిజానికి ఈ తరహా బ్యాంక్ దేశంలోనే మొదటిది కాదు. ఔరంగబాద్ లో ఇలాంటి క్లాత్ బ్యాంక్ ఉంది. ఇంకా ఆహారాన్ని అందించే బ్యాంక్ లో.. మధ్య ప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్‌లో పేదలకు ఉచితంగా ఆహారం, కూరగాయలను అందించే రోటీ బ్యాంక్ ఉంది. ఇది స్థానిక పేదలకు రోటీలను, వంట వండుకునే వారికి కూరగాయలను ఉచితంగా అందిస్తోంది. ఈ రెండు సంస్థల నుండి స్పూర్తిని పొంది ఈ క్లాత్ బ్యాంక్ ను స్థాపించి కార్యకలపాలను ఈ నెల 1న హైద్రాబాద్ మలక్ పేటలో మొదటిసారి ప్రారంభించారు
పేదవారికి అంటే ఇక్కడ చినిగిపోయినవి, మాసిపోయినవి ఉంటాయని అనుకోకండి.. నాణ్యతలో ఎక్కడ రాజీపడకుండా ముందుగానే అంతా గమనించి పరిశీలించిన తర్వాతనే బట్టలను ఈ బ్యాంక్ లో పొందుపరుస్తారు.. ఇప్పటికే 10,000కు పైగా అన్ని సైజలలో బట్టలు, చెప్పులు, చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలను రేషన్ కార్డు చూపించిన వారికి ఉచితంగా ఇస్తున్నారు. ఇంకా దీనిని పెద్ద స్థాయిలో విస్తరించాలని సంస్థ నిర్వహకులు ప్రణాళికలు రచిస్తున్నారు. మనం కూడా ఇంతటి మంచి కార్యక్రమంలో భాగం కావచ్చు.. కొత్తగా కొనుక్కున్న బట్టలు కాని మరే ఇతర వస్తువులు వాడక, Olx లో అమ్మడానికి మనసు రాక ఇంట్లో ఉన్నవి చాల ఉండొచ్చు. అలాంటి వస్తువులను మలక్ పేటలోని క్లాత్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే పేదవారికి మనవంతు సహాయంగా ఉంటుంది :)
![3 copy](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/3-copy-3_2016-05.jpg)
![4 copy](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/4-copy-1_2016-05.jpg)
![1 copy](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/1-copy-3_2016-05.jpg)
![2 copy](https://cdn.shopify.com/s/files/1/0896/6753/5157/files/2-copy-3_2016-05.jpg)