కరీంనగర్ జిల్లా రాంపూర్ గిద్దె పెరుమాల్ ఆలయం అత్యంత మహిమాన్విత కోవెలగా పరిగనిస్తారు. చాలా దేవాలయాలలో కేవలం వినాయక చవితి పర్వదినాలలో మాత్రమే భక్తులు దర్శనానికి వస్తే కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం మాదిరిగానే ఈ దేవలయంలో కుడా సంవత్సరం అంతా భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటారు. ఈ దేవాలయాన్ని సుమారు 400 సంవత్సరాలకు పూర్వమే నిర్మించారు ఆ కాలంలో ప్రధానంగా ఈ గుడిలో హనుమంతుడిని కొలిచేవారట. ఇదే దేవాలయంలో నిత్యం అత్యంత క్రమశిక్షణతో పూజలు నిర్వహిస్తున్న ఒక మహాభక్తుడిని స్వప్నంలో గణేషుడు వచ్చి కుడివైపు తొండం ఆకృతిలో నేను ఇక్కడే స్వయంభూ గా వెలిశానని తెలిపారు మానేరు బ్రిడ్జీ పరిసరాలలో తవ్వకాలు జరిపితే కలలో చెప్పిన ఆకారంలో ప్రతిమ బయటపడిందట ఇదంతా 100సంవత్సరాలకు పూర్వమే జరిగింది. ఇక అప్పటినుండి ఇదే దేవాలయంలో ఆంజనేయ స్వామితో పాటుగా వినాయకుడిని పూజించడం మొదలుపెట్టారు.

భక్తులందరూ ఇక్కడి గణనాథుడిని గిద్దెన్న అని ప్రేమగా పిలుచుకుంటారు దీనికి ఒక ప్రధాన కారణం ఉంది రైతులు తాము పండించిన ధాన్యాన్ని గిద్దెడు అని అక్కడి వాడుక బాషలో పిలుచుకుంటారు. ఇప్పుడు మనం టన్నులు క్వింటల్ అన్నట్టుగా వారు "గిద్దెల కొద్ది పంటలు పండాలని వినాయకుడిని వేడుకున్నారట" అలా కోరుకున్నట్టే పంటలు సంవృద్దిగా పండటంతో అప్పటినుండి ఇక్కడి గణపతిని గిద్దెన్న గా పిలుచుకుంటారు. ఇక్కడి గణపతి ఆంజనేయస్వామిలా సింధూర వర్ణంలో దర్శనమిస్తారు.

ఇక్కడి దేవాలయానికి ఉన్న మరొక ప్రత్యేకత సాధారణంగా ఏ గుడి ఐనా చాలా తక్కువ స్థలంలో నిర్మించి ఉంటుంది దాని వల్ల భక్తులు ఇబ్బందికి గురి అవుతుంటారు కాని ఈ దేవాలయం మాత్రం 20ఎకరాల విశాలమైన వాతావరణంలో ఉంటుంది భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటం వల్ల వారి కోరికలను భగవంతునికి మనస్పూర్తిగా విన్నవించుకుంటారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.