Meet The Guntur Guy Who Is Reason You Are Seeing 'Become A Blood Donor' On FB!
Srikanth Kashetti
Updated on
కొన్ని సంవత్సరాల క్రితం గుంటూరు కు చెందిన కార్తిక్ కు ఓ భయానక పరిస్థితి ఏర్పడింది. తన మిత్రుని కూతురుకు వచ్చిన వ్యాధి నిమిత్తమై ప్రతిరోజూ ఒక రక్తదాత సహాయం అవసరం వచ్చింది. 2011లో సోషల్ మీడియా ఇంతలా అభివృద్ధి జరగలేదు ఐతే ప్రజలలో సాటి మనిషిని కాపాడుకోవాలన్న కాంక్ష మాత్రం బలంగా ఉంది. కార్తిక్ తనకు తెలిసిన మిత్రులకు పరిస్థితి వివరిస్తే కొంతమంది ముందుకు వచ్చారు. కాని ఆ సంఖ్య ఐదు మాత్రమే.. ఐతే తన సమస్యను అందరిలో చూసుకున్నారు.. ఎంతో మంది తనలా ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడే ఆ వ్యక్తిగత సమస్యలో ఉన్నప్పుడే కార్తిక్ మిగిలిన వారి గురుంచి ఆలోచించారు.. సరిగ్గా ఉపయోంచుకోవాలే కాని సోషల్ మీడియా అన్నం పెడుతుంది, ప్రాణాల్ని బ్రతికిస్తుంది ఈ నమ్మకంతోనే Facebookలో సేవా ఉద్యమం తో పాటుగా, సోషల్ బ్లడ్ బ్యాంక్ స్టార్టప్ ప్రారంభించాడు.
ప్రతి ఒక్క బ్లడ్ గ్రూప్ కు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక వేదికను ఏర్పాటుచేశారు. మొదట ఇది ఒక నగరానికే పరిమితమైన గాని తర్వాత మిగిలిన భారతీయ ప్రాంతాలతో పాటుగా ఇతర దేశాల నుండి కూడా అభ్యర్ధనలు వెల్లువెత్తాయి. అన్ని మెసేజ్ లు రాగానే కార్తిక్ కు అర్ధం అయ్యింది సమస్య ఎంత తీవ్రమయినదోనని. ఇక తన సొంత ఊరు, రాష్ట్రం, దేశం దాటి వెంటనే అమెరికా వెళ్లి అక్కడ అదే సంవత్సరంలో అత్యవసరమైన సోషల్ బ్లడ్ బ్యాంక్ యాప్ ను ప్రారంభించారు.
ఎప్పుడైతే అమెరికా పయణమయ్యాడో కార్తిక్ జీవితంలో మాత్రమే కాదు ప్రపంచంలోనే బ్లడ్ డొనేషన్ విషయంలో పెనుమార్పులు సంభవించాయి. "సోషల్ బ్లడ్" అనే యాప్ ను రూపొందించి "రక్తం కావాల్సిన వారికి ఇచ్చేవారికి ఒక వేదికను ఏర్పాటుచేశామని ఈ యాప్ ను అవసరమైన వారికి సజెస్ట్ చేయమని వివిధ హాస్పిటల్స్ కు కోరినా ఆశించినంత రెస్పాన్స్ రాలేదు". ఐనా గాని కార్తిక్ నిరాశ చెందకుండా తన పని నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. చాప కింద నీరులా ఈ యాప్ జనాల్లోకి వెళ్ళింది ఎంతమంది సహాయాన్ని అందించారు తీసుకున్నారు.
ఫేస్ బుక్ కలయికతో..
ఈ పద్దతి కొనసాగాలంటే ఫండ్స్ మాత్రమే కాదు మరొక పెద్ద వేదిక అవసరం ఉంటుంది. ఈ ఆలోచనలో ఉండగానే ఓరోజు మార్క్ జూకర్ బర్గ్ కార్తిక్ కు ఫోన్ చేసి ప్రపంచంలోనే రెండో అతి పెద్ద జనాబా ఉన్న ఇండియాలో ఫేస్ బుక్ ఎలా మరింత విస్తరింపజేయాలని అడిగారు. దీనికి సంబంధించి విలువైన సూచనలివ్వడంతో పాటుగా భారత్ ఫేస్ బుక్ ఐడీలలో "బ్లడ్ డొనేషన్" ఆప్షన్ కూడా ఏర్పాటుచేయాలని అడిగారట. అలా 2017లో భారత్ కు బ్లడ్ డొనేషన్ ఆప్షన్ ను ఒక తెలుగువాడు తీసుకువచ్చాడు. రక్త సంబంధం కుటుంబ సభ్యుల మధ్యే కాదు ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషికి రక్త సంబందీకుడే. కార్తిక్ ఇంతటి ఉద్యమం నడిపిస్తుండడంతో జాతీయ అంతర్జాతీయల స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. అంతేకాక రెండుసార్లు ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ప్రచురితమయ్యి యంగ్ స్టార్టప్ ఇండస్ట్రీలిస్ట్ గా ఈ ప్రపంచంలో ఉదయించాడు.
Link to Social Blood App