పిల్లల మనసుల లాగానే అక్కడున్న కూరగాయాలు, బేకింగ్ ఐటమ్స్ మొదలైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ స్వచ్ఛమైనవే.. వారంలో గురువారం వచ్చిందంటే చాలు పిల్లలు అంతకుముందే పొలం నుండి తీసుకువచ్చిన కూరగాయలు, ప్యాకింగ్ చేసి పెట్టుకున్న ఇతర ఫుడ్ ఐటమ్స్ ను వారి క్షేత్రం స్కూల్ ముందుకు తీసుకువచ్చే అమ్ముతారు. స్టాకింగ్, వేయింగ్, ప్యాంకింగ్, బిల్లింగ్, బేకింగ్ ఫుడ్ ఐటమ్స్ ఈ పనులన్నీ పిల్లలే చేస్తారు. వారు ఆటలు ఆడినా, లేదంటే ఇలాంటి పనులు చేసినా పిల్లల్లో క్రమశిక్షణ కనిపిస్తుంది. అందుకే ఈ ఆర్గానిక్ స్టోర్ కు డిమాండ్ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆర్గానిక్ స్టోర్ ని నడుపుతున్న "ఈ పిల్లలందరూ లెర్నింగ్ డిసేబిలిటీతో బాధపడుతున్న వారే.."
వీరికి ఎలా ఉపయోగపడుతుంది: 21 రోజుల పాటు చేసిన పని ఒక అలవాటుగా మారిపోతుంది, ఇక ఆ తర్వాత కష్టపడకుండా, ఎక్కువగా ఆలోచించకుండానే తేలికగానే చేసుకుపోవచ్చని NLP ద్వారా తెలుసుకోవచ్చు. "క్షేత్రం స్కూల్ ను 12 సంవత్సరాల నుండి సూపర్ణ బజాజ్, సాహితీ రెడ్డి నడుపుతున్నారు. సుపర్ణ గారు స్కూల్ తో పాటుగా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు. పిల్లలతో ఈ ఆర్గానిక్ స్టోర్ ని స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది.? పిల్లల మానసిక స్థితికి ఇలా ప్రాక్టికల్ గా చెయ్యడం వల్ల భవిషత్తులో వారికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని 2017లోనే దీనిని మొదలుపెట్టారు.
తయారుచేయడం నుండి మార్కెటింగ్ స్ట్రాటజీ వరకు.. క్షేత్రంలో మొత్తం సుమారు 30 విద్యార్థులు ఉన్నారు, ప్రతి శనివారం పిల్లలు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే చోటుకు వెళతారు. వ్యవసాయంలోని పద్ధతులు తెలుసుకుంటారు. అలాగే ఆర్గానిక్ స్టోర్ ని కూడా రన్ చేస్తున్నారు కనుక సూపర్ణ, సాహితీ ఇంకా టీం సహాయంతో విలువైన మార్కెటింగ్ పద్ధతులు నేర్చుకుంటున్నారు. కూరగాయాలతో పాటు మిల్లెట్స్, పికెల్స్, సోప్స్, చేతులతో తయారుచేసిన సంచులు మొదలైనవి కూడా ఇక్కడ పిల్లలు అమ్ముతారు. ఇదొక్కటనే కాదు పిల్లల ఇష్టానికి తగ్గట్టుగా అందులో శిక్షణ ఇస్తున్నారు. చెఫ్ వచ్చి వంట నేర్పిస్తారు, కార్పెంటర్ వచ్చి కార్పెంట్రీ ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఇక్కడి పిల్లలు ప్రత్యేకంగా చేసే బేకింగ్ ఫుడ్ ఐటమ్స్ కు డిమాండ్ కూడా ఉంది. వారు మరొకరిపై ఆధారపడకూడదనేదే సూపర్ణ, సాహితీల సంకల్పం. For additional information visit https://www.facebook.com/SwacchOrganic/