"కిన్నెరసాని" నాకు తెలిసి ఈ పేరు వినగానే చాలామందికి తమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయనుకుంటా.. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో నాగార్జున సాగర్ డామ్, అరకు, లంబసంగి మొదలైన ఖచ్చితంగా చుడాల్సిన ప్లేసెస్ లో ఇది కూడా ఉంటుంది చాలామందికి ఇదివరకే ఒక మంచి జ్ఞాపకంగా ఉండి ఉంటుంది కిన్నెరసాని విహారయాత్ర. కిన్నెరసాని నది గోదావరి నదికి ఉపనదిగా పిలుస్తారు. ఈ నది దాదాపు 100కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంది. ఇక్కడికి వస్తే గనుక మనం చాలా రకాలుగా ఎంజాయ్ చేయవచ్చు. నదిలో బోటింగ్ చేస్తూ కిన్నెరసాని అందమైన హొయలు చూడవచ్చు, ముసళ్ళను (Crocodile Park) అతి దగ్గరిగా చూపిస్తూ మీ ఫ్రెండ్స్ భయపెట్టించవచ్చు. ఆ పరిసర ప్రాంతంలో ఉన్న జింకల పార్క్ లో జింకలతో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు, చుట్టు చెట్లతో ప్రకృతి మరింత ప్రశాంతంగా ఉండడం వల్ల ఆ ప్రకృతి ఒడిలో లీనమయ్యి సేద తీరవచ్చు. ఇంకా చాలా రకాలుగా ఆహ్లాదంగా ఇక్కడ గడుపవచ్చు.. వీలుంటే మీ ఆత్మీయులతో ఒకసారి టూర్ ప్లాన్ చేయండి.. ఖచ్చితంగా కిన్నెరసాని విహారయాత్ర ఎన్నటికి గుర్తుండిపోయే మధుర స్మృతులను మీకు అందిస్తుంది.