ఆయన ఏడిపించగలరు, పగలబడి నవ్వించగలరు, బాధపెట్టించగలరు, ఛీ..! ఇలాంటి మనుషులు కూడా ఉంటరా అని కోపం, అసహ్యం తెప్పించగలరు.. సాధారణంగా ఒక నటుడు తన నట జీవితంలో కేవలం కొన్ని రకాల పాత్రలకే పరిమితమవుతారు.. ఒక్కోసారి తమ పరిధిని దాటి విభిన్నపాత్రలు చేయటానికి ప్రయత్నించినా నటనలో ఉత్తమ ప్రతిభను కనబరుచలేక పోతుంటారు కాని కళామతల్లి అభినయాల తోట అయిన కోట మాత్రం అలా కాదు.. కితకితలు పెట్టే హాస్యం నుండి క్రూరమైన విలనిజం, బాధ్యతనంతా మోసే కన్నతండ్రిలా, హీరోలకు సహాయం చేసే మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా అన్ని రకాల పాత్రలతో నటించి మెప్పించగలరు. కోట నటించిన కొన్నిసినిమాలు ఫ్లాప్ అయి ఉండవచ్చు కాని కోట పోషించిన పాత్ర మాత్రం ఫేయిల్ కాదు. కేవలం డైరెక్టర్లు, రైటర్లు చెప్పినట్టుగా మాత్రమే కాకుండా తనదైనశైలిలో Improvisation చేసుకుంటూ పాత్రను హిట్ అయ్యేలా చేస్తు సినిమా విజయంలో తన పాత్రను వెన్నుముకల మరల్చగల నటులు కోట శ్రీనివాస్ రావు..
కృష్ణా జిల్లా కంకిపాడులో జూలై 10 1947న కోట జన్మించారు తండ్రి ఒక డాక్టర్. చిన్ననాటి నుండే నటన మీద ఆసక్తితో నాటకాలు ప్రదర్శించేవారు ఐనా తన వ్యక్తిగత జీవితంలో చదువును నిర్లక్ష్యం చేయలేదు. స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం సాధించి విధులు నిర్వహించేవారు. ఒకసారి 'ప్రాణం ఖరీదు' నాటకంలో కోట నటనను చూసి ముగ్ధుడైన దర్శకుడు క్రాంతి కుమార్ ఈ నాటికను సినిమాగా రుపోందించాలని సంకల్పించి కోటను సిని పరిశ్రమలోకి ఆహ్వానించారు. 1978 నాటి ప్రాణం ఖరీదు నుండి నేటి వరకు తెలుగు హిందీ తమిళ మలయాళీ, కన్నడ భాషలు కలిపి దాదాపు 700 చిత్రాలలో విభిన్న పాత్రలలో నటించారు. నటించిన ప్రతి భాషలో ఎన్నో అవార్ఢులను, రివార్ఢులను అందుకున్నారు. కేవలం మన తెలుగు లోనే 8 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది పురస్కారాలను స్వీకరించారు. ఉత్తమ విలన్ గా గాయం, గణేష్, చిన్నా, ఉత్తమ సహాయ నటడుగా లిటిల్ సోల్జర్స్, ఆ నలుగురు, పృథ్వీ నారాయణ, పెళ్లైన కొత్తలో చిత్రాలకు నందులను అందుకున్నారు.. నటన రంగంలో మాత్రమే కాకుండా రాజకీయాల ద్వారా 1999-2004 కాలంలో విజయవాడ ప్రాంత ఎం.ఎల్.ఏ గా ప్రజలకు సేవ చేశారు. 37 సంవత్సరాలుగా నటుడిగా చేసిన సేవకు భారత ప్రభుత్వం 2015 'పద్మశ్రీ' సత్కారంతో గౌరవించింది.. గుమ్మడి, ఎస్.వి రంగారావు, కైకాల సత్యనారయణల తర్వాత అంతటి స్థాయిలో విభిన్నతరహా పాత్రలు చేయదగిన నటునిగా తెలుగు సినీ పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని నిర్మించుకున్నారు.
1. గణేష్

2. అహణా పెళ్ళంటా

3. గాయం

4. ఆ నలుగురు

5. ఆమె

6. ఇడియట్

7. శత్రువు

8. బావగారు బాగున్నారా

9. మనీ

10. హలో బ్రదర్

11. మామ గారు

12. ఆడవారి మాటలకు అర్ధాలే వేరులె.
