'శివ' హిట్ అయిన క్లాసిక్ అయితే, 'క్షణక్షణం' ఫ్లాప్ అయిన క్లాసిక్. A Look Back

Updated on
'శివ' హిట్ అయిన క్లాసిక్ అయితే, 'క్షణక్షణం' ఫ్లాప్ అయిన క్లాసిక్. A Look Back
Contributed by Cinema Kaburlu శివ రిలీజ్ అయింది. అరవై ఏళ్ల సినిమా పిచ్చోడి నుంచి ఆరేళ్ల చిన్న పిల్లాడి వరకు అందరినోట ఒకటేమాట. రామ్ గోపాల్ వర్మ. డైరెక్టర్ అనేవడికి అంతగా గుర్తింపు లేని రోజుల్లో వర్మ ఒక phenomenon అయ్యాడు. అలాంటి వ్యక్తి రెండో సినిమా ఏం చెయ్యబోతున్నాడు అనే ఆసక్తి అందర్లో ఉండుంటుంది. ఆఖరికి సినిమా అన్నౌన్స్ చేశాడు. పేరు క్షణక్షణం. హీరో వెంకటేష్. హీరోయిన్ శ్రీదేవి. జగదేక వీరుడు అతిలోక సుందరితో comeback ఇచ్చిన శ్రీదేవి, సంవత్సరం అవ్తున్న సరే మళ్లీ ఏ సినిమాలో కనపడలేదు. అప్పటికే ఇరవై ఏళ్ళు చెక్కుచెరగని stardomతో ఉన్న తను, మొదటిసారి వెంకటేష్ పక్కన నటిస్తోంది. అదికూడా తన వీరాభిమాని అయిన వర్మ దర్శకత్వంలో. నిజానికి శివ ఓ చిన్న సినిమా లాగ రిలీస్ అయింది. ఓ కొత్త దర్శకుడితో ఓ కుర్ర హీరో చేస్తున్న సినిమా. అంతే. కాని క్షణక్షణం అలా కాదు. ఇప్పుడు ఆ కొత్త దర్శకుడు 'వర్మ' అయ్యాడు. అందుకే కాబోలు ఏ దర్శకుడికైన రెండో సినిమా హిట్ తియ్యడం కష్టం అంటుంటారు. చివరికి సినిమా రిలీస్ అయింది. Expectations ఎక్కువ అవ్వడంవల్లో ఏమో అనుకునంత ఆడలేదు.
ఇంచుమించు ఆరేళ్ల క్రితం స్వామి రారా తరవాత సుదీర్ వర్మ అంటే పిచ్చెక్కిన నాకు, ఒక ఇంటర్వ్యూ లో తన favourite సినిమా ఎంటి అని అడిగితే క్షణక్షణం అన్నాడు. వెంటనే చూసా. Late 90s lo పుట్టిన నాలాంటి ఎంతోమందికి వర్మ అంటే రక్త చరిత్ర మాత్రమే. అప్పటికి శివ గురించి వినడమే తప్ప చూసినవాళ్లు చాలా తక్కువ. క్షణక్షణం చుసినాక నాక్కూడా అర్థమైంది వర్మ అనే phenomenon. Technical masterpiece. కొన్ని frames, shots ఇప్పటికీ ఎవ్వరూ recreate చెయ్యలేరు. Screenplay పరంగా చూస్కుంటే way ahead of its times అనొచ్చు. అవి మాత్రమే కాదు, డాన్సులు ఇరగదీసే శ్రీదేవిని పాట మొత్తం కూర్చోపెట్టి "జాము రాతిరి జాబిలమ్మ" అన్నాడు. తనతో ఓ పాట కూడా పాడించారు. పరేష్ రావల్ debut. అది కూడా own dubbing. తను సీరియస్ గానే ఉంటాడు కాని మనకి నవ్వు వస్తుంటది. అప్పటికి, ఇప్పటికి తనో most unique విలన్ characterization. అడవిలో ఈ బ్రిడ్జి ఎవరు కట్టుంటారు. పాములు నిజంగానే పగపడుతయా లాంటి క్రేజీ doubts అడిగే వ్యక్తి. తనని ఓ notorious సినిమా విలన్గా కంటే ఓ మనిషి లాగ ట్రీట్ చేస్తాడు వర్మ. వెంకటేష్ లాంటి మాస్ హీరోతో పాటలు, ఫైట్లు ఉంటూనే, అరగంట వరకు తన ఎంట్రీ లేని offbeat సినిమా ఇది.
View this post on Instagram

శివ రిలీజ్ అయింది. అరవై ఏళ్ల సినిమా పిచ్చోడి నుంచి ఆరేళ్ల చిన్న పిల్లాడి వరకు అందరినోట ఒకటేమాట. రామ్ గోపాల్ వర్మ. డైరెక్టర్ అనేవడికి అంతగా గుర్తింపు లేని రోజుల్లో వర్మ ఒక phenomenon అయ్యాడు. అలాంటి వ్యక్తి రెండో సినిమా ఏం చెయ్యబోతున్నాడు అనే ఆసక్తి అందర్లో ఉండుంటుంది. ఆఖరికి సినిమా అన్నౌన్స్ చేశాడు. పేరు క్షణక్షణం. హీరో వెంకటేష్. హీరోయిన్ శ్రీదేవి. జగదేక వీరుడు అతిలోక సుందరితో comeback ఇచ్చిన శ్రీదేవి, సంవత్సరం అవ్తున్న సరే మళ్లీ ఏ సినిమాలో కనపడలేదు. అప్పటికే ఇరవై ఏళ్ళు చెక్కుచెరగని stardomతో ఉన్న తను, మొదటిసారి వెంకటేష్ పక్కన నటిస్తోంది. అదికూడా తన వీరాభిమాని అయిన వర్మ దర్శకత్వంలో. నిజానికి శివ ఓ చిన్న సినిమా లాగ రిలీస్ అయింది. ఓ కొత్త దర్శకుడితో ఓ కుర్ర హీరో చేస్తున్న సినిమా. అంతే. కాని క్షణక్షణం అలా కాదు. ఇప్పుడు ఆ కొత్త దర్శకుడు 'వర్మ' అయ్యాడు. అందుకే కాబోలు ఏ దర్శకుడికైన రెండో సినిమా హిట్ తియ్యడం కష్టం అంటుంటారు. చివరికి సినిమా రిలీస్ అయింది. Expectations ఎక్కువ అవ్వడంవల్లో ఏమో అనుకునంత ఆడలేదు || Cut || ఇంచుమించు ఆరేళ్ల క్రితం స్వామి రారా తరవాత సుదీర్ వర్మ అంటే పిచ్చెక్కిన నాకు, ఒక ఇంటర్వ్యూ లో తన favourite సినిమా ఎంటి అని అడిగితే క్షణక్షణం అన్నాడు. వెంటనే చూసా. Late 90s lo పుట్టిన నాలాంటి ఎంతోమందికి వర్మ అంటే రక్త చరిత్ర మాత్రమే. అప్పటికి శివ గురించి వినడమే తప్ప చూసినవాళ్లు చాలా తక్కువ. క్షణక్షణం చుసినాక నాక్కూడా అర్థమైంది వర్మ అనే phenomenon. Technical masterpiece. కొన్ని frames, shots ఇప్పటికీ ఎవ్వరూ recreate చెయ్యలేరు. Screenplay పరంగా చూస్కుంటే way ahead of its times అనొచ్చు. అవి మాత్రమే కాదు, డాన్సులు ఇరగదీసే శ్రీదేవిని పాట మొత్తం కూర్చోపెట్టి "జాము రాతిరి జాబిలమ్మ" అన్నాడు. తనతో ఓ పాట కూడా పాడించారు. పరేష్ రావల్ debut. అది కూడా own dubbing. తను సీరియస్ గానే ఉంటాడు కాని మనకి నవ్వు వస్తుంటది. అప్పటికి, ఇప్పటికి తనో most unique విలన్ characterization. అడవిలో ఈ బ్రిడ్జి ఎవరు కట్టుంటారు. పాములు నిజంగానే పగపడుతయా లాంటి క్రేజీ doubts అడిగే వ్యక్తి. తనని ఓ notorious సినిమా విలన్గా కంటే ఓ మనిషి లాగ ట్రీట్ చేస్తాడు వర్మ. వెంకటేష్ లాంటి మాస్ హీరోతో పాటలు, ఫైట్లు ఉంటూనే, అరగంట వరకు తన ఎంట్రీ లేని offbeat సినిమా ఇది. శివ హిట్ అయిన క్లాసిక్ అయితే, క్షణక్షణం ఫ్లాప్ అయిన క్లాసిక్. అంతే తేడా. రిలీజ్ టైంలో 'మరో శివ' కావాలి అని అడిగిన వాళ్ళందరికీ 'తొలి క్షణక్షణం' ఇచ్చాడు వర్మ. #ramgopalvarma #rgv #kshanakshanam #sridevi #victoryvenkatesh #pareshrawal #telugucinema

A post shared by Cinema Kaburlu (@cinema_kaburlu) on

శివ హిట్ అయిన క్లాసిక్ అయితే, క్షణక్షణం ఫ్లాప్ అయిన క్లాసిక్. అంతే తేడా. రిలీజ్ టైంలో 'మరో శివ' కావాలి అని అడిగిన వాళ్ళందరికీ 'తొలి క్షణక్షణం' ఇచ్చాడు వర్మ.