వంద సంవత్సరాల జీవితమైన ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది అన్నట్టు వందల కోట్ల రూపాయాల పొదుపు కూడా ఒక్క రూపాయితో మొదలవుతుంది. ఇలా ఒక్క రూపాయితో 16 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన వారి పొదుపు ఉద్యమం నేడు వందల కోట్లకు చేరుకుంది. పది మంది కాదు వందమంది కాదు 27 గ్రామాలు, 950 గ్రూపులతో 10,000 మహిళలందరూ ఒక చిన్న చిన్న గ్రూపులుగా డివైడ్ అయ్యి వందల కోట్ల రూపాయలను పొదుపు చేసి వారి భవిషత్తును బాగుచేసుకుంటున్నారు.
వారిలో చాలా మంది నిరక్ష్యరాసులు.. అమాయకత్వం కూడా ఎక్కువే ప్రతి విషయంలో భర్తమీదనో లేదంటే ప్రభుత్వపు దయాదక్షన్యాల మీద ఆధారాపడి బతుకుతున్న వారే.. కాని ఇదంతా ఒకప్పటి జీవితం ఇప్పుడు కాదు! ఒక అమ్మ ఇచ్చిన స్పూర్తితో కృషి పట్టుదల అనే ఆయుధంతో వారి బాధలపై విజయం సాధించారు.. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆ మహిళలే నేడు పొదుపు సంఘలలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు మన కర్నూలు జిల్లా వనితలు.
వారి జీవితాలను బాగు చేసుకోవడం మాత్రమే కాకుండా గ్రామాలలోని అభివృద్ధి కార్యక్రమాలను ఆ పొదుపు ధనంతో పూర్తిచేస్తున్నారు.. జలజీవన పథకం పేరుతో వాటర్ షెడ్ ల నిర్మాణం, జీవనరేఖ పథకంతో మహిళలకు ఆర్ధిక సాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ తో రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై శిక్షణ, 7 ఎకరాలలో 6కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ తరహాలో స్కూల్ ఇలాంటి అభివృద్ది కార్యక్రమాలెన్నో వారి గ్రామాలలో ఏర్పాటు చేసుకున్నారు. డ్వాక్రా సంఘల ద్వారా వచ్చిన సొమ్మును పొదుపు చేసి ఇవన్నీ సాధించారు. ఇక్కడ స్కూల్ ప్రారంభించక ముందు చాలా మంది పిల్లలు కూలి పనులకు వెళ్ళేవారు కాని ఇప్పుడు స్కూల్ నిర్మాణంతో పాటు వారిలో వచ్చిన మార్పు వల్ల వారి బంగారు భవిషత్తు కోసం చదువును మార్గంగా ఎంచుకున్నారు.