ఎమ్మెస్.విశ్వనాథన్,ఇలయరాజా,కె.వి మహదేవన్...ఈ ముగ్గురినీ ఎనబై,తొంబై దశకాలలో తెలుగు సినీ సంగీతాన్ని ఏలిన చక్రవర్తులుగా చెప్పవచ్చు! వీరు మాతృభాష తమిళంలో ఎంత కీర్తిని సంపాదించారో అంతకు సమానంగా తెలుగు లో కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి కీర్తి ఘటించి వేలాది అభిమానులను సంపాదించుకున్నారు. సంగీతానికి, సంగీత కళాకారులకి భాషతో సంభంధం లేదు కదా...!
ముఖ్యంగా కె.వి మహదేవన్..! తెలుగు సంగీతాభిమానులకు ముద్దుగా "మామ"..! ఆయన స్వర సారధ్యం చేసిన ఎన్నో చిత్రాల లోని పాటలు తెలుగు ప్రేక్షకులను ఏల్ల పాటు అలరించాయి. తెలుగు పరిశ్రమను మూడు తరాలుగా అనుకుంటే మొదటి రెండు తరాలను తన సంగీతం తో మైమరిపించిన స్వరబ్రహ్మ ఈ "కృష్ణకోయిల్వెం కటాచలం భాగవతర్ మహదేవన్". వంద ఏళ్ల భారతీయ సినీ ప్రస్థానంలో అభిమానులందరూ గర్వించవల్సిన సంగీత దర్శకులలో తప్పక ముందు వరసలో ఉండే కె.వి మహదేవన్
ముఖ్యంగా సంప్రదాయ సంగీతానికి తన ప్రతిభ ద్వారా ప్రాణం పోసారు. ముఖ్యంగా కళాతపస్వి "కె.విశ్వనాథ్-కె.వి మహదేవన్" కాంబినేషన్లో వచ్చిన అన్ని చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఆయా చిత్రాల విజయంలో ఆయన కృషి మరువలేనిది."కె.విశ్వనాధ్" కళాఖండం శంకరాభరణం చిత్రానికి గాను కె.వి మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. "లే లే లే నారాజ", "మావ మావ మామ" లాంటి ఆ తరం మాస్ సాంగ్స్ను స్వరపరిచింది కూడా ఆయనే.
కె.వి మహదేవన్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన సంగీతం అందించిన తప్పక వినవలసిన 20 అద్భుత చిత్రాలోని పాటలు. ఆయన స్వరకల్పన చేసిన చిత్రాలలో "బెస్ట్ 20" ఎన్నుకోవడం అంటే కష్టమే.! కానీ ఇప్పటికీ మనం మరచిపోలేనివి, మరో 20 ఏళ్ళైనా మరవలేని పాటలు కలిగినవి ఇవి (ఈ ఆల్బమ్స్).
1. రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని - సంపూర్ణ రామాయణం
2. ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న - మంచి మనసులు
3. గోదారి గట్టుంది గట్టు మీద - మూగ మనసులు
4. చేతిలో చెయ్యేసి చెప్పుబావా - దసరా బుల్లోడు
5. నేను పుట్టాను లోకం మెచ్చింది - ప్రేమ్ నగర్
6. బూచాడమ్మా బూచాడు బుల్లిపెట్టెలో - బడి పంతులు
7. ఎదగడానికి ఎందుకురా తొందరా - అందాల రాముడు
8. ముత్యమంతా పసుపు ముఖమెంతొ - ముత్యాలముగ్గు
9. ఆరేసుకోబోయి పారేసుకున్నాను - అడవి రాముడు
10. శంకరా నాద శరీరా - శంకరాభరణం
11. ఝుమ్మంది నాదం...సయ్యంది పాదం - సిరిసిరిమువ్వా
12. నెమలికి నేర్పిన నడకలివీ - సప్తపది
13. విధాత తలపున ప్రభవించినది - సిరివెన్నెల
14. ఇన్ని రాశుల యునికి - శ్రుతి లయలు
15. శ్రీ సూర్యనారాయణా మేలుకో - మంగమ్మ గారి మనవడు.
16. జోలజోలమ్మ జోలా - సూత్రధారులు
17. కొండలలో నెలకొన్న - అల్లుడు గారు
18. శ్రీరస్తు శుభమస్తు - పెళ్లి పుస్తకం
19.అందమైనా వెన్నెల లోనా - అసెంబ్లీ రౌడీ
20. తెలి మంచు కురిసిందీ - స్వాతికిరణం