అసలు బ్రతికున్నంత కాలం ఓ పది మందికి సహాయం చేయగలిగితే అంతే చాలు.. జీవితంలో దానికి మించిన గొప్ప విషయం మరొకటి లేదు..!! పోనీ అలా చేసే సామర్థ్యం లేనప్పుడు మన చుట్టూ ఉన్న ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా బ్రతకగలిగితే చాలు, అంతకు మించిన సార్ధకత ఏం కావాలి చెప్పండి జీవితానికి..
మనం ఎల్లప్పుడూ మూట సహాయం చేయలేకపోవచ్చు.. కనీసం మాట సహాయం అయినా చేయడానికి ప్రయత్నిద్దాం సాద్యమైనంత వరకూ.. అవి ఫ్రీ నేగా..(మాటలు)!ఇలాంటి వాటిని జీవితంలో ఆచరించే వాల్లు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఆలోచనలకి, ఆచరణకు మద్య దూరం కాస్త ఎక్కువే ఉంటుంది. అలాంటి వాల్లలో ఒకరు కె.వి.ఆర్.బి సుబ్రమణ్యం (KVRB Subrahmanyam). ముఖపుస్తకం లో తరచూ తెలుగులో మాట్లాడుకునే సాహితీ ప్రియులకూ, ఆ సర్కిల్ లో ఉన్న వారికి ఈ పేరుతో పరిచయం ఉంటుంది.
సాధారణంగా వయసు పై బడిత అయితేే చాదస్తం ఎక్కువవడమో,లేదా వైరాగ్యం ఎక్కువవడమో జరుగుతుంది. కానీ కొంత మందికి వయసు కేవలం శరీరానికి మాత్రమే వర్తిస్తుంది మనసుకు కాదు.. గ్రీన్ ఆర్మీ, విశ్వ మానవ వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజమే దేవాలయంగా భావిస్తూ ఎదురైన ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించే ఈ పెద్దాయన ఓ రోజు పంచుకున్న ఈ మాటలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి.
"అవకాశం ఉన్నంత మేరా నిజమే చెప్పడం
మోసం చేయాలనే ఆలోచన కి దూరంగా ఉండడం
ఉచితం గా దొరికే చిరునవ్వు తోనే ఎదుటి వాళ్ళని పలకరించడం
చేయ్యగలిగినంత సహాయం చెయ్యడం
తెలిసిన సమస్యకు మనిషిగా స్పందించడం
తెలిసిన వాళ్ళ దగ్గర, తెలియని వాళ్ళ దగ్గరా సాధారణ సమాచారం విషయం లొ ఒకేలా ఉండడం
మనవాళ్ళు అనుకున్న వాళ్ళను మనస్పూర్తిగా ఆదరించడం
పొరపాటు మనదే అయితే ముందుగా మనమే ఒప్పుకోవడం
మనల్ని తప్పుగా అర్ధం చేసుకొని దూరం అయిపియే వాళ్ళని, వారి ఇష్ట ప్రకారం హృదయం లోంచి బయటకు వదిలేయడం
మనుషుల మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకొక పోవడం
ఆత్మ విశ్వాసం తో జీవితాన్ని అర చేతిలో ఉంచుకోవడం, అదే ఆయుధం గా సమస్య ను ఎదుర్కోవడం
ఆత్మాభిమానం కలిగి ఉండి ఎంతటి వాళ్ళ కాళ్ళ ముందూ మోకరిల్లక పోవడం
జీవిత భాగస్వాములే కాక తోడ బుట్టిన వాళ్ళు కూడా జీవితం లొ సమస్యలు సృష్టిస్తారని ఎరిగి ఉండడం
మోసపూరిత ప్రవర్తన కారణంగా ఎంతటి అనుబంధం ఉన్న వ్యక్తి ని అయినా మనసు లోంచి బయటకు పంపగలిగే కఠిన నిర్ణయ మనస్తత్వాన్ని కలిగి ఉండడం.
మన వ్యక్తిత్వాన్ని కించ పరిచే వారికి దూరం గా ఉండాలి అనుకోవడం.
బాధ్యతల లొ ములిగి ఒక్కోసారి హక్కులను పట్టించుకో క పోవడం
మనిషిని చదివితేనే జీవితం తెలుస్తుంది అనే ఆలోచన కలిగి ఉండడం
సంగీతం, సాహిత్యం ఇచ్చినంత స్వాంతన ఇక ప్రపంచం లొ ఇంకేదీ ఇవ్వలేదు అని తేలుసుకోగలిగి ఉండడం
కన్నీరు, చిరునవ్వు మన భావాన్ని తెలియజేసే చక్కని మాధ్యమాలు అని ఎరిగి ఉండడం
ఆఖరుగా
అనంత సౌందర్యం ఆలోచించే హృదయం లోనే తప్ప కనపడే అద్భుతం లొ ఉండదనే సత్యాన్ని తెలుసుకోని ఉండడం
ఇవే జీవన సాఫల్యానికి ముఖ్యమైన ఆచరణ సాధనాలు.
ఇన్నేళ్ళ నా ప్రయాణం లొ అనుభవ పూర్వకంగా తెలుసుకున్న నిజాలు
ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల్లో నేను చాలామంది ని పోగొట్టుకోవడానికి పై లక్షణాలే కారణం.
అయినా ఇక్కడ చాలామంది ని పొందడానికి కూడా నాకున్న పై అభిప్రాయాలే కారణం.
ఈ ప్రయాణం లొ ఇంకా ఎందరో కలుస్తారన్న ఆశ తో భవదీయుడు"..